PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/congressc58908b8-1981-45b6-bcaf-702d4795b081-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/congressc58908b8-1981-45b6-bcaf-702d4795b081-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలవ్వడంతో టీపీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ పదవి కోసం కాంగ్రెస్ నేతల మధ్య రేసు మొదలైంది. పీసీసీ పదవి తనకే దక్కనుందని అనేక మంది నేతలు దీమాతో ఉన్నారు. ఇప్పటికే టీపీసీసీ నియామకంపై అభిప్రాయ సేకరణ కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్కం ఠాగూర్‌ బుధవారం నగరానికి వచ్చారు. congress;kumaar;bharatiya janata party;uttam kumar reddy nalamada;revanth reddy;congress;mp;రాజీనామా;tpcc;chadha venkat reddy;jagga reddy;reddy;yatra;partyపీసీసీ రాకుంటే బీజేపీలో చేరేందుకు సిద్దమైన కోమటిరెడ్డి?పీసీసీ రాకుంటే బీజేపీలో చేరేందుకు సిద్దమైన కోమటిరెడ్డి?congress;kumaar;bharatiya janata party;uttam kumar reddy nalamada;revanth reddy;congress;mp;రాజీనామా;tpcc;chadha venkat reddy;jagga reddy;reddy;yatra;partyFri, 11 Dec 2020 11:00:00 GMTకాంగ్రెస్ ఘోర పరాజయం పాలవ్వడంతో టీపీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ పదవి కోసం కాంగ్రెస్ నేతల మధ్య రేసు మొదలైంది. పీసీసీ పదవి తనకే దక్కనుందని అనేక మంది నేతలు దీమాతో ఉన్నారు. ఇప్పటికే టీపీసీసీ నియామకంపై అభిప్రాయ సేకరణ కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్కం ఠాగూర్‌ బుధవారం నగరానికి వచ్చారు.

ఈ సమయంలో ఆయనను కలిసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీపీసీసీ చీఫ్‌ పదవి తనకు ఇవ్వాలని కోరారు. గురువారం ఠాగూర్‌ను ఎంపీ కోమటిరెడ్డి కలిసి తన అభిప్రాయాలతో కూడిన రెండు పేజీల లేఖను అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్ష పదవి తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరో నాలుగు రోజుల్లో టీపీసీసీ పదవి ఎవరికి దక్కుతుందో తెలుస్తుందని అన్నారు. టీపీసీసీ పదవి దక్కకుంటే పార్టీకి రాజీనామా చేసి బీజేపీ గూటికి కోమటిరెడ్డి వెళ్లడానికి లైన్ క్లియర్ చేసుకున్నారని వస్తున్న వార్తలపై కూడా ఆయన స్పందించారు.

పీసీసీ పదవి ఎవరికివ్వాలన్న దానిపై అధిష్ఠానానిదే తుది నిర్ణయమని, పీసీసీ అధ్యక్ష పదవి తనకు రాకున్నా బీజేపీలో మాత్రం చేరనంటూ కోమటిరెడ్డి స్పష్టం చేశారు. అధ్యక్ష పదవి వస్తే మాత్రం తాను గ్రామ గ్రామానా పాద యాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు మరింత కష్టపడతానన్నారు. కాగా.. టీపీసీసీ చీఫ్‌ పదవిపై అనేక మంది సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు కన్నేశారు. ప్రముఖంగా వీరిలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి, జీవన్‌రెడ్డి తదితర నేతలు ఉన్నారు.

టీపీసీసీ చీఫ్ కోసం పోటీ పడుతున్న వారిలో ఎక్కువమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలే ఉన్నారు. మరి ఈసారి కూడా పీసీసీ చీఫ్ రెడ్డి సామాజిక వర్గానికే చెందుతుందో లేదో చూడాలి.


ముంబైలో మహేష్ చిల్ సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్.

బిగ్‌బాస్4 చివరి వారంలో కూడా ఏంటీ గొడవలు?

ఆ అధికారికి ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు అప్పగించేందుకు పావులు కదుపుతున్న ఏపీ ప్రభుత్వం!

బీజేపీ నేతలను ఏకిపారేసిన దీదీ మమతా బెనర్జీ!

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>