ViralSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/farmer1e56ae00-7064-48c4-9426-85c4cb59397d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/farmer1e56ae00-7064-48c4-9426-85c4cb59397d-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఓ సామాన్య రైతు బ్యాంక్ అకౌంట్‌లోకి ఏకంగా రూ.473 కోట్ల మేర డబ్బులు జమయ్యాయి. తీరా బ్యాంకుకు వెళ్లి ఆరా తీసిన రైతు ఆశ్చర్యపోయాడు. మరి తన అకౌంట్‌లో అంత భారీ డబ్బు ఉన్నా ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకొనేందుకు ఎందుకు కుదరడం లేదో రైతుకు అర్థం కాలేదు. మరుసటి రోజు గురువారం భువనగిరిలోని దక్కన్‌ గ్రామీణ బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకు అధికారులకు విషయం వివరించగా.. వారు వివరాలు పరిశీలించి.. అకౌంట్‌ ఫ్రీజ్‌ అయిందని తెలిపారుfarmer;telangana;rbi;sbi;district;bank;nalgonda;cheque;yadadri;reddy;siddipetఆ రైతు అకౌంట్లో 4వేలకు బదులు 473కోట్లు... తీరా విత్ డ్రా సమయంలో ?ఆ రైతు అకౌంట్లో 4వేలకు బదులు 473కోట్లు... తీరా విత్ డ్రా సమయంలో ?farmer;telangana;rbi;sbi;district;bank;nalgonda;cheque;yadadri;reddy;siddipetFri, 11 Dec 2020 16:05:00 GMTతెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఓ సామాన్య రైతు బ్యాంక్ అకౌంట్‌లోకి ఏకంగా రూ.473 కోట్ల మేర డబ్బులు జమయ్యాయి. తీరా బ్యాంకుకు వెళ్లి ఆరా తీసిన రైతు ఆశ్చర్యపోయాడు. అంత భారీ మొత్తంలో డబ్బు తన ఖాతాలో చూసి ఆ రైతు ఒక్కసారిగా కంగుతిన్నాడు. పూర్తి వివరాలివీ.. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామానికి చెందిన అనుమూల సంజీవరెడ్డి అనే రైతుకు భువనగిరి పట్టణంలోని దక్కన్‌ గ్రామీణ బ్యాంకు శాఖలో ఓ బ్యాంకు ఖాతా ఉంది. సంజీవరెడ్డి బుధవారం సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌కు పనిమీద వెళ్లాల్సి వచ్చింది. డబ్బుల అవసరం రాగా.. తన వద్ద ఉన్న దక్కన్ గ్రామీణ బ్యాంకు ఏటీఎంతో డబ్బులు డ్రా చేసేందుకు యత్నించాడు. డీసీసీబీ ఏటీఎం సెంటర్‌లో డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించగా.. రాలేదు. చాలాసార్లు ప్రయత్నించినా ఫలితం లేదు.



డబ్బులు తన అకౌంట్‌లో లేవేమో అనుకొని బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకున్నాడు. ఆ రిసిప్ట్‌లో ఉన్న బ్యాలెన్స్‌ చూసి రైతు అనుమూల సంజీవ రెడ్డి ఆశ్చర్యపోయాడు. అతని ఖాతాలో బ్యాలెన్స్ రూ.473,13,30,000 అని ఉంది. ఇది చూసి షాకైన సంజీవరెడ్డి.. ఇదేదో తేడాగా ఉందని.. దగ్గరే ఉన్న ఎస్బీఐ ఏటీఎంకు వెళ్లి చెక్ చేసుకున్నాడు. అక్కడ వచ్చిన రిసిప్ట్‌లో కూడా అంతే బ్యాలెన్స్‌ చూపించింది. మరి తన అకౌంట్‌లో అంత భారీ డబ్బు ఉన్నా ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకొనేందుకు ఎందుకు కుదరడం లేదో రైతుకు అర్థం కాలేదు. మరుసటి రోజు గురువారం భువనగిరిలోని దక్కన్‌ గ్రామీణ బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకు అధికారులకు విషయం వివరించగా.. వారు వివరాలు పరిశీలించి.. అకౌంట్‌ ఫ్రీజ్‌ అయిందని తెలిపారు. ఏటీఎం సర్వర్‌ పనిచేయడం లేదని అన్నారు. ఏటీఎం రిసిప్ట్‌లో భారీ మొత్తంలో బ్యాలెన్స్‌ చూపిస్తోందని అడిగితే.. ‘మీ ఖాతాలో కేవలం రూ.4 వేలు మాత్రమే ఉన్నాయని బ్యాంకు అధికారులు సమాధానం చెప్పారు. దీంతో సంజీవరెడ్డి ఏమీ అర్థంకాక వెనుదిరిగి ఇంటికి చేరుకున్నాడు. మరోవైపు, రైతు ఖాతాలో కోట్ల కొద్ది డబ్బు జమైందన్న వార్త గంటల్లోనే ఆ మండలమంతా వ్యాపించిపోయింది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


కొడాలి నానీకి నేనెవరో తెలియదా...? ఈ రోజు నుంచే చూపిస్తా...!

జనవరి 25 కు మహేష్ సర్కారు వారి పాట..!!

ఆక్వారంగానికి మంచి రోజులు !

అమరావతి ఉద్యమం మరింత ఉధృతం

వైసీపీ ని టెన్షన్ పెడుతున్న చోటా నేతలు..వీరితోనే ముప్పు..?

ప్రత్యేక రాయలసీమ కావాల్సిందే, టీడీపీ మాజీ హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఆర్ధిక ఎమర్జెన్సీ ఉందని ఆస్తులు అమ్ముతున్నారా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>