MoviesVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakul2f9ef3ea-30cf-4fd1-a71a-dda306bb7271-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakul2f9ef3ea-30cf-4fd1-a71a-dda306bb7271-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాబడిన రియా చక్రవర్తితో రకుల్ జరిపిన వాట్సాప్ చాటింగ్ గురించి ఎన్సీబీ ఆమెను ప్రశ్నించినట్లు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి జాతీయ మీడియాలో అనేక కథనాలు ప్రసారం అయ్యాయి. అయితే తనకు వ్యతిరేకంగా మీడియా కథనాలు ప్రచారం చేయడాన్ని రకుల్ ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఎన్సీబీ విచారణ పూర్తయ్యేంతవరకు తన పేరును rakul;auto;amala akkineni;rakul preet singh;delhi;india;bollywood;tollywood;high court;whatsapp;google;media;television;december;arrest;heroine;chatting;drugsరకుల్ ప్రీత్ సింగ్ కు అనుకూలంగా తీర్పురకుల్ ప్రీత్ సింగ్ కు అనుకూలంగా తీర్పుrakul;auto;amala akkineni;rakul preet singh;delhi;india;bollywood;tollywood;high court;whatsapp;google;media;television;december;arrest;heroine;chatting;drugsFri, 11 Dec 2020 16:45:17 GMTరకుల్ ప్రీత్ సింగ్ అనుకూలంగా తీర్పు

బాలీవుడ్ లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాబడిన రియా చక్రవర్తితో రకుల్ జరిపిన వాట్సాప్ చాటింగ్ గురించి ఎన్సీబీ ఆమెను ప్రశ్నించినట్లు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి జాతీయ మీడియాలో అనేక కథనాలు ప్రసారం అయ్యాయి. అయితే తనకు వ్యతిరేకంగా మీడియా కథనాలు ప్రచారం చేయడాన్ని రకుల్ ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఎన్సీబీ విచారణ పూర్తయ్యేంతవరకు తన పేరును ఈ కేసులో ప్రస్తావించకుండా ఎలక్ట్రానిక్ - ప్రింట్ - వెబ్ మీడియాను నియంత్రించాలని కోరింది. అయితే పీసీఐ మరియు ఎన్బీఏ నుంచి ఎలాంటి మార్గదర్శకాలు బయటకు రాకపోవడంతో రకుల్ మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తనపై ఇష్టారాజ్యంగా మీడియాలో కథనాలు వస్తున్నాయని ఆమె మరోసారి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో తాజాగా న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ రకుల్ ప్రీత్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది.


ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ కు క్షమాపణలు చెబుతూ డిసెంబర్ 17న కథనాన్ని ప్రసారం చేయాలని పలు న్యూస్ ఛానల్స్ కి ఆదేశాలు జారీ చేసింది. తమ మార్గదర్శకాలకు అనుగుణంగా కథనాన్ని ప్రసారం చేసి.. ఆ విషయాన్ని ప్రసారం చేసిన వారం రోజుల్లోగా లిఖిత పూర్వకంగా నివేదించాలని ఎన్బీఎస్ఏ పేర్కొంది. వీటిలో జీ గ్రూప్ కు చెందిన మూడు ఛానెల్స్ తో పాటు టైమ్స్ నౌ - ఇండియా టీవీ - ఆజ్ తక్ - ఇండియా టుడే - న్యూస్ నేషన్ - ఏబీపీ వంటి ప్రధాన వార్తా ఛానెల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కేసులో తమ వెబ్ సైట్స్.. ఇతర సోషల్ మీడియా మాధ్యమాల నుంచి రకుల్ ప్రీత్ సింగ్ కు వ్యతిరేకంగా ఇచ్చిన లింక్స్ ని డిలీట్ చేయాలని.. ఈ ఆదేశాల్ని తక్షణం అమలు చేయాలని అథారిటీ ఆదేశించింది. దీంతో రకుల్ కోర్టు మెట్లెక్కి తనకు అనుకూలంగా తీర్పు రాబట్టిందని చెప్పవచ్చు


జూ.ఎన్టీఆర్ మరో షో కి రంగం సిద్ధం ..అన్నపూర్ణ స్టూడియో లో భారీ సెట్

సినిమా ఛాన్స్ ఇవ్వకపోయినా.. ఫ్రెండ్ షిప్ కి విలువిచ్చిన మహేష్ గొప్పదనం చూడండి..!!

చంద్రుడిపై యాత్రకు భారత సంతతి వ్యోమగామికి అవకాశమిచ్చిన నాసా!

తుళ్ళూరులో హై టెన్షన్.. పోటాపోటీగా కేసులు..కానీ !

తిరుప‌తిపై బాబు గేమ్ ప్లాన్ మామూలుగా లేదే...!

మోడీని ఇలా తిట్టి.. అలా పొగిడి.. కేసీఆర్ నయా పొలిటిక‌ల్ గేమ్‌..!

తెలంగాణ పాలిటిక్స్‌లో వైఎస్ ఫార్ములా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>