PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/janasena592b2661-a6be-4aca-9137-6a0e84e9092e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/janasena592b2661-a6be-4aca-9137-6a0e84e9092e-415x250-IndiaHerald.jpgఏపీలో కూడా ఉపఎన్నికల నగర మోగనుంది. త్వరలోనే తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉపఎన్నిక జరిగే అవకాశం ఉంది. సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణించడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక ఈ ఉపపోరులో పోటీ చేసేందుకు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు సిద్ధమవుతున్నాయి. అయితే ఇటీవల తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ, తిరుపతి బై పోల్‌లో కూడా దుమ్ములేపుతామని మాట్లాడుతుంది. janasena;pawan;pawan kalyan;tiru;bharatiya janata party;andhra pradesh;telangana;janasena;mp;tirupati;bank;parliment;husband;tdp;ycp;janasena party;partyకలిసి పోటీ...అది సరే అభ్యర్ధి జనసేన నుంచేనా?కలిసి పోటీ...అది సరే అభ్యర్ధి జనసేన నుంచేనా?janasena;pawan;pawan kalyan;tiru;bharatiya janata party;andhra pradesh;telangana;janasena;mp;tirupati;bank;parliment;husband;tdp;ycp;janasena party;partyFri, 11 Dec 2020 00:00:00 GMTతిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉపఎన్నిక జరిగే అవకాశం ఉంది. సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణించడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక ఈ ఉపపోరులో పోటీ చేసేందుకు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు సిద్ధమవుతున్నాయి. అయితే ఇటీవల తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ, తిరుపతి బై పోల్‌లో కూడా దుమ్ములేపుతామని మాట్లాడుతుంది.

అయితే తెలంగాణ, ఏపీ బీజేపీ నాయకత్వాలకు చాలా తేడా ఉంది. పైగా తెలంగాణలో బీజేపీ బాగా బలంగా ఉంది. కానీ ఏపీలో బీజేపీ పరిస్తితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ పార్టీకి ఒక్కశాతం కూడా ఓట్లు కూడా లేవు, కానీ వారి పార్ట్‌నర్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి మాత్రం 5 శాతంపైనే ఓట్లు ఉన్నాయి. ఇక అందుకే జనసేనతో కలిసి నెక్స్ట్ ఏపీలో తాము అధికారంలోకి వచ్చేస్తామని బీజేపీ నేతలు ప్రకటించేస్తున్నారు.

కాస్త ఎక్కువ ఓటు బ్యాంక్ ఉన్న జనసేన నేతలే ఇలా డైలాగులు వేయడం లేదు. కానీ నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ మాత్రం బాగా హడావిడి చేస్తుంది. అధికార వైసీపీకి తామే ప్రత్యామ్నాయం అని, టీడీపీ పని అయిపోయిందని మాట్లాడుతున్నారు. ఇక డైలాగులు ఇలా నడుస్తుండగానే, తిరుపతి ఉపఎన్నికలో సత్తా చాటుతామని బీజేపీ నేతలు చెబుతున్నారు. పైగా జనసేనతో కలిసి పోటీ చేస్తామని, అధికార వైసీపీని ఓడిస్తామని మాట్లాడుతున్నారు.

అయితే తిరుపతిలో ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీల మధ్యే ఉంటుందనే సంగతి తెలిసిందే. కానీ బీజేపీ-జనసేనలు గట్టి పోటీ ఇస్తాయని చెబుతున్నారు. కాకపోతే ఇక్కడ జనసేన-బీజేపీల నుంచి ఎవరు పోటీ చేస్తారనేది అర్ధం కావడం లేదు. బీజేపీ మాత్రం తమ పార్టీ నుంచి అభ్యర్ధిని పెట్టి, జనసేన మద్ధతు తీసుకోవాలని చూస్తున్నారు. మరి చూడాలి ఈ విషయంపై జనసేన ఎలా నడుచుకుంటుందో.




ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !

హైకోర్ట్ రాయలసీమలోనే... చెప్పేసిన సోము




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>