PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/kcr68028d31-f234-4bb9-a970-de1aa14497fd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/kcr68028d31-f234-4bb9-a970-de1aa14497fd-415x250-IndiaHerald.jpgముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట పర్యటన కూడా హరీశ్ రావును అక్కున చేర్చుకునేందుకే పెట్టుకున్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. సభలో వేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్.. హరీశ్ రావును ‘ఆణిముత్యం’ అని, ‘నా పేరు నిలబెట్టిండు.. పిల్లోడు గట్టోడు’ అని ఆకాశానికెత్తేశారు. సిద్దిపేట అంటే తనకు ప్రాణమని, ఆ ప్రాంతాన్ని చూసుకోగల సమర్థత హరీశ్ రావుకు ఉందని తనకు పూర్తి నమ్మకం ఉన్నట్లు వ్యాఖ్యానించారుhareesh rao;kcr;ktr;harish;amala akkineni;varsha;bharatiya janata party;telangana rashtra samithi trs;thanneeru harish rao;telangana;chief minister;degree;minister;wife;t harish rao;siddipet;dookudu;partyసిద్ధిపేట సభలో మేనల్లుడు హరీష్ రావుపై సీఎం కేసీఆర్ పొగడ్తల వర్షం అందుకేనా?సిద్ధిపేట సభలో మేనల్లుడు హరీష్ రావుపై సీఎం కేసీఆర్ పొగడ్తల వర్షం అందుకేనా?hareesh rao;kcr;ktr;harish;amala akkineni;varsha;bharatiya janata party;telangana rashtra samithi trs;thanneeru harish rao;telangana;chief minister;degree;minister;wife;t harish rao;siddipet;dookudu;partyFri, 11 Dec 2020 16:30:00 GMTతెలంగాణ రాష్ట్రం ఏర్పాటు దగ్గర నుంచి ఆ రాష్ట్రంలో వరుసగా రెండు సార్లు కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అయితే ఇటీవలే కొన్నాళ్లుగా ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రాబల్యం క్రమంగా పెరుగుతుంది. దానికి నిదర్శనమే మొన్నటి దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు మరియు ఇటీవలే ముగిసిన గ్రేటర్ ఎన్నికల ఫలితాలు. క్రమంగా బీజేపీ పుంజుకుంటుండగా, టీఆర్ఎస్ మాత్రం బలహీనపడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇక దానికి అడ్డుకట్ట వేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. రాజకీయంగా బీజేపీ పార్టీని దెబ్బ తీసేందుకు పలు వ్యూహాలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా మంత్రి, స్వయాన మేనల్లుడైన హరీశ్ రావుపై తన వైఖరిని మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. సిద్దిపేటలోని డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం జరిగిన బహిరంగ సభలో ఈ విషయం స్పష్టమైంది. సిద్దిపేట పర్యటనలో హరీశ్ రావుకు ఇచ్చిన ప్రాధాన్యం చూసి రాజకీయ వర్గాల్లో ఈ చర్చ మొదలైంది.



ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా కాలంగా హరీశ్ రావును దూరం పెడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా తొలిసారి ఏర్పాటు చేసిన మంత్రి వర్గంలో చోటు కల్పించలేదు. ఆ తర్వాత హరీశ్ అభిమానుల నుంచి దీనిపై వ్యతిరేకత రావడం, ఇంకా కొన్ని కారణాల వల్ల మంత్రి పదవి ఇచ్చారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి సీటు కోసం కేటీఆర్‌కు లైన్ క్లియర్ చేసేందుకే హరీశ్ రావును దూరం పెడుతున్నారనే విశ్లేషణలు సైతం అప్పుడు వచ్చాయి. ఇటీవల దుబ్బాక నియోజకవర్గ ఉపఎన్నిక బాధ్యతలను హరీశ్ రావుకు అప్పగించారు. కానీ, బీజేపీ దూకుడుకు కారు నిలవలేకపోయింది. అతి స్వల్ప మెజారిటీతో ఆ స్థానాన్ని బీజేపీ ఎగరేసుకుపోయింది. దీంతో ట్రబుల్ షూటర్‌గా పేరు పొందిన హరీశ్ రావు ఖాతాలో తొలి అపజయం నమోదైనట్లయింది. ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతను కేటీఆర్‌కు అప్పగించగా.. అక్కడా నిరాశే ఎదురైంది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అందర్నీ కలుపుకుపోయి నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. అందుకే, తనను దూరం పెట్టడంతో హరీశ్ రావులో ఏర్పడి ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.



అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట పర్యటన కూడా హరీశ్ రావును అక్కున చేర్చుకునేందుకే పెట్టుకున్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. సభలో వేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్.. హరీశ్ రావును ‘ఆణిముత్యం’ అని, ‘నా పేరు నిలబెట్టిండు.. పిల్లోడు గట్టోడు’ అని ఆకాశానికెత్తేశారు. సిద్దిపేట అంటే తనకు ప్రాణమని, ఆ ప్రాంతాన్ని చూసుకోగల సమర్థత హరీశ్ రావుకు ఉందని తనకు పూర్తి నమ్మకం ఉన్నట్లు వ్యాఖ్యానించారు. దీంతో వేదికపైనే ఉన్న హరీశ్ రావు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ప్రసంగం అయ్యాక ఆయన దగ్గరకు వెళ్లి హరీశ్ రావు.. కేసీఆర్ కాళ్లకు నమస్కరించారు. అనంతరం కేసీఆర్ ఆలింగనం చేసుకున్నారు. నిజానికి కేసీఆర్ హరీశ్ రావును ఇంతలా పొగుడుతూ, ఎంతో సన్నిహితంగా మెలిగిన సందర్భాలు ఇటీవలి కాలంలో లేవు. అందుకే ఈ పరిణామంపై రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. కేసీఆర్, కేటీఆర్ మరియు హరీష్ రావుల మధ్య బంధం ఏమాత్రం ధృఢంగా ఉంటుందనేది చూడాలి.


కొడాలి నానీకి నేనెవరో తెలియదా...? ఈ రోజు నుంచే చూపిస్తా...!

ఆ రైతు అకౌంట్లో 4వేలకు బదులు 473కోట్లు... తీరా విత్ డ్రా సమయంలో ?

జనవరి 25 కు మహేష్ సర్కారు వారి పాట..!!

ఆక్వారంగానికి మంచి రోజులు !

అమరావతి ఉద్యమం మరింత ఉధృతం

వైసీపీ ని టెన్షన్ పెడుతున్న చోటా నేతలు..వీరితోనే ముప్పు..?

ప్రత్యేక రాయలసీమ కావాల్సిందే, టీడీపీ మాజీ హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>