PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/the-death-of-the-film-did-not-answer-those-questio9f291e7d-fc58-4877-af2a-ea63716c2c20-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/the-death-of-the-film-did-not-answer-those-questio9f291e7d-fc58-4877-af2a-ea63716c2c20-415x250-IndiaHerald.jpgకెరీర్‌ దూసుకెళ్తున్న సమయంలో ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది వీజే చిత్ర. పెళ్లయిన రెండు నెలలకే ఎలాంటి ఆధారం కనిపించకుండా చిత్ర బలవన్మరణం అనేక ప్రశ్నలను మిగిల్చింది. చెన్నైలోని తిరువాణ్‌ మియూర్‌ కి చెందిన చిత్ర అనేక టీవీ సీరియళ్లతో పాటు పలు సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించింది. చిత్ర పీఎంకే టీవీ ఛానెల్ మక్కల్ టీవీలో వీజెగా కెరీర్‌ మొదలు పెట్టి, తమిళ ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత ఆమెకు టీవీ సీరియళ్లలో అవకాశం వచ్చింది. విజయ్ టీవీలో పాండ్యన్ స్టోర్స్ అనే సీరియల్లో ముల్లై అనే పాత్రతో బుల్the death of the film did not answer those questio;darshana;hema;hemanth;tiru;vijay;police;television;tamil;marriage;husband;joseph vijayచిత్ర మరణంలో ఆ ప్రశ్నలకు బదులేది..?చిత్ర మరణంలో ఆ ప్రశ్నలకు బదులేది..?the death of the film did not answer those questio;darshana;hema;hemanth;tiru;vijay;police;television;tamil;marriage;husband;joseph vijayFri, 11 Dec 2020 22:30:00 GMTపెళ్లి చేసుకుంది వీజే చిత్ర. పెళ్లయిన రెండు నెలలకే ఎలాంటి ఆధారం కనిపించకుండా చిత్ర బలవన్మరణం అనేక ప్రశ్నలను మిగిల్చింది. చెన్నైలోని తిరువాణ్‌ మియూర్‌ కి  చెందిన చిత్ర అనేక టీవీ సీరియళ్లతో పాటు పలు సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించింది. చిత్ర  పీఎంకే టీవీ ఛానెల్ మక్కల్ టీవీలో వీజెగా కెరీర్‌ మొదలు పెట్టి, తమిళ ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత ఆమెకు టీవీ సీరియళ్లలో అవకాశం వచ్చింది. విజయ్ టీవీలో పాండ్యన్ స్టోర్స్ అనే సీరియల్లో ముల్లై అనే పాత్రతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిత్ర నటి మాత్రమే కాదు ఓ మంచి డ్యాన్సర్ కూడ. మోడల్ గా కూడా పనిచేసిన చిత్ర మే 2, 1992న చెన్నైలో పుట్టింది.

అయితే చిత్ర బలవన్మరణం ఓ మిస్టరీగా మారింది. ఆమె ముఖంపై ఉన్న గాయాలపై అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి.  ప్రతిరోజూ తిరువాన్‌మియూరులోని ఇంటి నుంచి షూటింగ్‌ కు వెళ్లే చిత్ర, నాలుగు రోజులుగా హోటల్లో ఉండటంపై అనేక అనుమానాలు వినిపిస్తున్నాయి. రెండు కుటుంబాల పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం జరిగినా, పెళ్లికి ముహూర్తం కుదిర్చినా, హేమనాథ్‌ ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అనే ప్రశ్న కూడా కీలకంగానే వినిపిస్తోంది.

పూందమల్లిలోని నజరేత్‌ పేట్టైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో భర్తతో కలిసి ఉంటున్న చిత్ర బుధవారం తెల్లవారుజామున షూటింగ్ పూర్తి చేసుకుని హోటల్ గదికి చేరుకుంది. స్నానం చేసి వస్తానని భర్తకు చెప్పి గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. ఆమె ఎంతసేపటికి తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన హేమంత్ హోటల్ సిబ్బంది సాయంతో తలుపు తెరిచి చూడగా చిత్ర ఫ్యాన్‌ కి వేలాడుతూ కనిపించింది. దీంతో భర్త హేమనాథ్ ను పోలీసులు విచారిస్తున్నారు. పూందమల్లి అసిస్టెంట్ కమిషనర్ సుదర్శనం నేతృత్వంలోని బృందం ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. చిత్రతో సన్నిహితంగా ఉన్న నటీ నటులు, స్నేహితుల వద్ద, పాండియన్ స్టోర్స్ యూనిట్ను విచారిస్తున్నారు. ఆత్మహత్యగా పోస్టుమార్టం చెప్తున్నా, ఆమె మరణం వెనుక బలమైన కారణం ఉండొచ్చన్న కోణంలో దర్యాప్తు వేగం పెంచారు.





అభిజిత్ కోసం నాగార్జున మాస్టర్ ప్లాన్..!

సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>