PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaa66ecdba-3648-4754-b19c-6078e9d6d096-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaa66ecdba-3648-4754-b19c-6078e9d6d096-415x250-IndiaHerald.jpgప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి ఏ రేంజ్‌లో వణికిస్తుందో చెప్పక్కర్లేదు. దీన్ని నియంత్రించడం కోసం ప్రపంచ దేశాలన్నీ నానా ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వ్యాక్సిన్ తయారీ కోసం ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయాన్‌టెక్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన కొవిడ్ టీకా ఓ సంజీవనిలా రెడీ అయింది. ఈ వార్త విన్న చాలామంది ప్రజలు ‘హమ్మయ్య! కరోనాకు వ్యాక్సీన్ వచ్చేసింది’ అనుకున్నారు. corona;american samoaకరోనా వ్యాక్సీన్‌తో షాకింగ్ సైడ్ ఎఫెక్ట్స్.. వెల్లడించిన అమెరికా!కరోనా వ్యాక్సీన్‌తో షాకింగ్ సైడ్ ఎఫెక్ట్స్.. వెల్లడించిన అమెరికా!corona;american samoaFri, 11 Dec 2020 19:21:32 GMT
కానీ, ఇప్పుడు ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఒక్కొక్కటిగా తెరపైకి రావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఫైజర్ టీకా సైడ్ ఎఫెక్ట్స్ గురించి యూఎస్ ఎఫ్‌డీఏ సంచలన విషయం బయటపెట్టింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న నలుగురు వాలంటీర్లకు తాత్కాలికంగా ముఖ పక్షవాతం వచ్చిందట. అమెరికాలో ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం అధికారులు ఎఫ్‌డీఏను కలిసినప్పుడు ట్రయల్స్ సమయంలో ఈ అనారోగ్య సమస్య బయట పడిందట. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో నలుగురు వాలంటీర్లకు ఇలా జరిగినట్లు సమాచారం. కానీ, ఇదే పరీక్షల్లో పాల్గొన్న మిగతా సభ్యుల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ కనిపించలేదని కూడా అధికారులు వెల్లడించారు.. టీకా వల్ల ఏర్పడిన ఈ సమస్యపై మరింత విస్తృతంగా పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని ఎఫ్‌డీఏ పేర్కొంది. దీంతో ఈ వ్యాక్సిన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అమెరికన్లకు నిరాశ ఎదురైనట్లే అయింది.


అయితే ఈ వ్యాక్సీన్ అత్యవసర వినియోగానికి ఇప్పటికే బ్రిటన్ దేశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడిన బ్రిటన్ అధికారులు.. ఫైజర్ టీకా వినియోగంలో స్వల్ప సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు అంగీకరించారు. ముఖ్యంగా అలర్జీలు ఉన్న వ్యక్తుల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా కనిపించినట్లు ఇక్కడి పరిశోధనల్లో తేలింది. అందుకే అలర్జీలు ఉన్న వ్యక్తులు ఫైజర్ వ్యాక్సిన్ తీసుకోవద్దని హెచ్చరించింది.


కీర్తి సురేష్ తో మెగా మేనల్లుడు.. కాంబో అదుర్స్..!

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!

సినిమా ఛాన్స్ ఇవ్వకపోయినా.. ఫ్రెండ్ షిప్ కి విలువిచ్చిన మహేష్ గొప్పదనం చూడండి..!!

చంద్రుడిపై యాత్రకు భారత సంతతి వ్యోమగామికి అవకాశమిచ్చిన నాసా!

తుళ్ళూరులో హై టెన్షన్.. పోటాపోటీగా కేసులు..కానీ !

తిరుప‌తిపై బాబు గేమ్ ప్లాన్ మామూలుగా లేదే...!

మోడీని ఇలా తిట్టి.. అలా పొగిడి.. కేసీఆర్ నయా పొలిటిక‌ల్ గేమ్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>