PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mystery-in-vj-chitra-movie-deathe38152ff-5911-4b4c-ad54-3f7512bdefd3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mystery-in-vj-chitra-movie-deathe38152ff-5911-4b4c-ad54-3f7512bdefd3-415x250-IndiaHerald.jpgవిజె చిత్ర.. తమిళ నాట చాలా పాపులర్ అయిన టీవీ నటి. కెరీర్ దూసుకెళ్తున్న సమయంలోనే పెళ్లి కూడా సెటిల్ అయింది. భర్త ఓ వ్యాపారవేత్త. భవిష్యత్తుపై కలలు కంటూ పరుగులు తీయాల్సిన సమయంలో హఠాత్తుగా నిష్క్రమించటం అటు తమిళ టీవీ ఇండస్ట్రీనికి, ఇటు తమిళ ప్రేక్షకులను షాక్ కు గురిచేసింది. mystery in vj chitra movie death;jeevitha rajaseskhar;huzur nagar;police;television;tamil;marriage;husband;paruguవిజె చిత్ర మరణంలో మిస్టరీ?విజె చిత్ర మరణంలో మిస్టరీ?mystery in vj chitra movie death;jeevitha rajaseskhar;huzur nagar;police;television;tamil;marriage;husband;paruguFri, 11 Dec 2020 21:45:00 GMTతమిళ నాట చాలా పాపులర్ అయిన టీవీ నటి. కెరీర్ దూసుకెళ్తున్న సమయంలోనే పెళ్లి కూడా సెటిల్ అయింది. భర్త ఓ వ్యాపారవేత్త. భవిష్యత్తుపై కలలు కంటూ పరుగులు తీయాల్సిన సమయంలో హఠాత్తుగా నిష్క్రమించటం అటు తమిళ టీవీ ఇండస్ట్రీనికి, ఇటు తమిళ ప్రేక్షకులను షాక్ కు గురిచేసింది.

అయితే చిత్ర మరణంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. చిత్ర ఆత్మహత్య చేసుకుందని పోస్టుమార్టం రిపోర్టులో తేలినా... ఆమె తల్లిదండ్రులు, బంధువులు మాత్రం దాన్ని కొట్టిపారేస్తున్నారు. నిశ్చితార్థం అయ్యే వరకు హేమనాథ్ పద్ధతిగానే ఉన్నాడని, ఆ తర్వాత అతడి నిజస్వరూపం బయటపడిందని చిత్ర తల్లి విజయ ఆరోపించారు. వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు మొదలైనట్టున్నాయని, కానీ, ఆ విషయాలను చిత్ర తమ దృష్టికి తీసుకు రాలేదని అంటున్నారు.

చిత్ర ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదంటున్నారు ఆమె తల్లి. హేమనాథ్ ఆమెను కొట్టి చంపేసినట్టున్నాడని, దీనిపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. అటు చిత్ర క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఆమె జీవితంలో ఎలాంటి గందరగోళం ఉన్నట్టుగా చూచాయగా కూడా తెలియలేదని అంటున్నారు. అయితే,  ఆర్థికంగా ఏవో సమస్యల్లో ఉన్నట్టు గుర్తించామంటున్నారు. కానీ, అవేవీ చనిపోయేంత పెద్దవి కావంటున్నారు.

అయితే, తమిళ ప్రేక్షకుల్లో పాపులర్ అయిన పాండియన్ స్టోర్ ధారావాహికలో కొన్ని సన్నివేశాల  విషయంగా చిత్రతో హేమనాథ్ గొడవపడ్డట్టు కూడా తెలుస్తోంది. మరోపక్క చిత్ర మరణించిన హోటల్కు ఓ రాజకీయ ప్రముఖుడి కారు వచ్చి వెళ్లినట్టుగా మరో వాదన తెరపైకి వచ్చింది.  

చిత్ర మృతదేహానికి కీల్పాకం ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగింది. ఆ తర్వాత, ఆమె మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మార్చురీ వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో వారిని కట్టడి చేయడానికి పోలీసులు శ్రమించారు. అంబులెన్స్లో ఆమె మృతదేహాన్ని కోట్టూరుపురానికి తరలించారు. అభిమానుల సందర్శనార్థం ఉంచారు. బుల్లి తెరకు చెందిన సహచర నటీ నటులు, టెక్నీషియన్లు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. సాయంత్రం ఊరేగింపుగా, అభిమానుల కన్నీటి సంద్రం నడుమ బీసెంట్ నగర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి.




సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!

కరోనా వ్యాక్సీన్‌తో షాకింగ్ సైడ్ ఎఫెక్ట్స్.. వెల్లడించిన అమెరికా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>