MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu5140aeca-be5c-49e6-9912-2dd5b9cef35d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu5140aeca-be5c-49e6-9912-2dd5b9cef35d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్లో ప్రస్తుతం వరుస విజయాలతో మాంచి దూకుడును కనబరుస్తున్నాడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు. భరత్ అనే నేను,మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో స్టార్స్ రేసులో ముందున్నాడు. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత.. తనకు మహర్షి వంటి సూపర్ సక్సెస్ ను ఇచ్చిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి తోనే మహేష్ మరో సినిమా చేస్తున్నాడని అప్పట్లో వార్తలొచ్చాయి. మహేష్ కోసం మరో పవర్ఫుల్ స్టోరీని కూడా వంశీ రెడీ చేసాడట. కానీ మధ్యలో ఏమైందో తెలియదు సడెన్ గా మహేష్.. గీత గోవిందం డైరెక్టర్ పరశురాం తో తన నెకmahesh babu;mahesh;govinda;keerthi;pooja hegde;suresh;bharath;geetha;govi;maharshi;thaman s;vamsi;vamsi paidipally;goa;sri bharath;cinema;sangeetha;rajani kanth;january;bank;maharshi 1;director;heroine;success;april;march;research and analysis wing;dookuduజనవరి 25 కు మహేష్ సర్కారు వారి పాట..!!జనవరి 25 కు మహేష్ సర్కారు వారి పాట..!!mahesh babu;mahesh;govinda;keerthi;pooja hegde;suresh;bharath;geetha;govi;maharshi;thaman s;vamsi;vamsi paidipally;goa;sri bharath;cinema;sangeetha;rajani kanth;january;bank;maharshi 1;director;heroine;success;april;march;research and analysis wing;dookuduFri, 11 Dec 2020 16:00:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు. భరత్ అనే నేను,మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో స్టార్స్ రేసులో ముందున్నాడు. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత.. తనకు మహర్షి వంటి సూపర్ సక్సెస్ ను ఇచ్చిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి తోనే మహేష్ మరో సినిమా చేస్తున్నాడని అప్పట్లో వార్తలొచ్చాయి. మహేష్ కోసం మరో పవర్ఫుల్ స్టోరీని కూడా వంశీ రెడీ చేసాడట. కానీ మధ్యలో ఏమైందో తెలియదు సడెన్ గా మహేష్.. గీత గోవిందం డైరెక్టర్ పరశురాం తో తన నెక్స్ట్ మూవీ ని అనౌన్స్ చేసేసాడు. నిజానికి మహేష్.. గీత గోవిందం సినిమా చూసి.. పరశురాం టేకింగ్ బాగా నచ్చి తనతో ఓ సినిమా చేస్తానని మాటిచ్చాడట. ఈ నేపథ్యంలోనే మహేష్.. పరశురాం చెప్పిన కథకు కనెక్ట్ అయి ఓకే చెప్పేసాడు.

ఇక వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'సర్కారువారి పాట'.ఇక ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే! మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. మహేష్ సరసన కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి ప్రేక్షకుల్లో భారీ రెస్పాన్స్ లభించింది.సినిమాలో మహేష్ చాలా సరికొత్తగా కనిపించనున్నారు. ఈ సినిమా కథ బ్యాంక్ కుంభకోణాల చుట్టూ సాగుతుందని.మహేష్ ఈ సినిమాలో ఒక బ్యాంక్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. అంతేకాకుండా సినిమాలో మహేష్ మొత్తం రెండు డిఫరెంట్ షేడ్స్ కలిగిన పాత్రల్లో దర్శనమిస్తారని కూడా ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

 లాక్ డౌన్ కు ముందు ఓ చిన్న షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా యొక్క రెగ్యులర్‌ షూటింగ్‌ జనవరి 25న ప్రారంభం కానుందని తెలిసింది. హైదరాబాద్‌లో మొదలయ్యే షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించి, ఫిబ్రవరిలో చిత్ర బృందం గోవా చేరుకోనుంది. అక్కడ షెడ్యూల్‌ పూర్తయ్యాక మూడో షెడ్యూల్‌ అమెరికాలో చేస్తారని సమాచారం. మార్చి, ఏప్రిల్‌ నెలలో 40 రోజులపాటు అమెరికాలో చిత్రీకరణ చేయనున్నట్లు తెలిసింది. సినిమా ఎక్కువ భాగం అమెరికాలోనే ఉండనుందని సమాచారం. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది...!!


కొడాలి నానీకి నేనెవరో తెలియదా...? ఈ రోజు నుంచే చూపిస్తా...!

ఆ రైతు అకౌంట్లో 4వేలకు బదులు 473కోట్లు... తీరా విత్ డ్రా సమయంలో ?

ఆక్వారంగానికి మంచి రోజులు !

అమరావతి ఉద్యమం మరింత ఉధృతం

వైసీపీ ని టెన్షన్ పెడుతున్న చోటా నేతలు..వీరితోనే ముప్పు..?

ప్రత్యేక రాయలసీమ కావాల్సిందే, టీడీపీ మాజీ హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఆర్ధిక ఎమర్జెన్సీ ఉందని ఆస్తులు అమ్ముతున్నారా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>