PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp-and-ysrcpe8ad0608-571a-4618-8cc2-7588ab6efb8e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp-and-ysrcpe8ad0608-571a-4618-8cc2-7588ab6efb8e-415x250-IndiaHerald.jpgగుంటూరు జిల్లాలో అధికార వైసీపీలోని కమ్మ ఎమ్మెల్యేని, టీడీపీలో ఓ సీనియర్ నేత టార్గెట్ చేశారు. వినుకొండ నియోజకవర్గానికి చెందిన ఈ కమ్మ నేతల మధ్య ఎప్పటినుంచి కోల్డ్ వార్ నడుస్తోంది. అయితే వినుకొండ ఎప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండేది. అందుకే ఇక్కడ కమ్మ వర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత జి‌వి ఆంజనేయులుకు తిరుగులేకుండా ఉండేది. కానీ 2019 ఎన్నికల్లో అదే సామాజికవర్గానికి చెందిన వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు, జి‌వికి చెక్ పెట్టారు. tdp and ysrcp;tiru;kamma;2019;mla;war;cheque;tdp;ycp;reddy;vinukonda;narasimhaకమ్మ ఎమ్మెల్యేని టార్గెట్ చేసిన కమ్మ నేత...దెబ్బ పడుతుందా?కమ్మ ఎమ్మెల్యేని టార్గెట్ చేసిన కమ్మ నేత...దెబ్బ పడుతుందా?tdp and ysrcp;tiru;kamma;2019;mla;war;cheque;tdp;ycp;reddy;vinukonda;narasimhaFri, 11 Dec 2020 02:00:00 GMTకమ్మ ఎమ్మెల్యేని, టీడీపీలో ఓ సీనియర్ నేత టార్గెట్ చేశారు. వినుకొండ నియోజకవర్గానికి చెందిన ఈ కమ్మ నేతల మధ్య ఎప్పటినుంచి కోల్డ్ వార్ నడుస్తోంది. అయితే వినుకొండ ఎప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండేది. అందుకే ఇక్కడ కమ్మ వర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత జి‌వి ఆంజనేయులుకు తిరుగులేకుండా ఉండేది. కానీ 2019 ఎన్నికల్లో అదే సామాజికవర్గానికి చెందిన వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు, జి‌వికి చెక్ పెట్టారు.

ఊహించని విధంగా జి‌వి ఆంజనేయులుపై బొల్లా విజయం సాధించారు. ఈ ఇద్దరు ఒకే సామాజికవర్గానికి చెందిన నేతలు అయినా, వేరు వేరు పార్టీలు కావడంతో ఎప్పటికప్పుడు మాటల యుద్ధానికి దిగుతూనే ఉన్నారు. ఇదివరకే వీరి మధ్య గట్టిగానే వార్ నడిచింది. ప్రధానంగా జి‌వి ఆంజనేయులు, ఎమ్మెల్యే బొల్లాని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. బొల్లాని ఎలగిన నెగిటివ్ చేసి నెక్స్ట్ ఎన్నికల్లో సత్తా చాటాలని జి‌వి ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా జి‌వి, బొల్లా టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు. బొల్లా బ్రహ్మనాయుడు భూకబ్జాలకు పాల్పడుతున్నారని, పేదలకు ఇళ్ళ స్థలాల పేరుతో కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారని విమర్శించారు. అలాగే ఎందుకు పనికి రాని తన వంద ఎకరాల పొలాన్ని అధిక ధరకు ప్రభుత్వానికి అంటగట్టారని, ఇంకా వీసి నరసింహ రెడ్డి భూమిని మోసం చేసి తక్కువ ధరకు కొట్టేశారని... అర్బన్ హౌసింగ్‌ని గాలికి వదిలేశారని జి‌వి ఆరోపణలు గుప్పించారు.

అయితే వైసీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాల పేరిట తీసుకున్న భూముల విషయంలో చాలా అక్రమాలు జరిగాయని టీడీపీ మొదట నుంచి ఆరోపణలు చేస్తుంది. స్థలాల విషయంలో వైసీపీ నేతలు అవకతవకలకు పాల్పడ్డారని విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే బొల్లాని టార్గెట్ చేసుకుని జి‌వి రాజకీయ యుద్ధానికి తెరలేపినట్లు తెలుస్తోంది. మరి బొల్లా, జి‌వికి ఎలా చెక్ పెడతారో చూడాలి.




ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !

హైకోర్ట్ రాయలసీమలోనే... చెప్పేసిన సోము




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>