PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp-have-some-favor-in-ysrcp-domination-areaf88f29a6-6fe1-4abc-9e84-d56c2b618550-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp-have-some-favor-in-ysrcp-domination-areaf88f29a6-6fe1-4abc-9e84-d56c2b618550-415x250-IndiaHerald.jpgకృష్ణా జిల్లా ఎక్కువగా టీడీపీకి అనుకూలంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీకి కాస్త అనుకూల ఫలితాలు వస్తాయి. 2014 ఎన్నికల్లో సైతం ఇదే జరిగింది. కానీ 2019 ఎన్నికల్లో టీడీపీకి గట్టి దెబ్బ తగిలింది. వైసీపీ 14 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. టీడీపీకి రెండు స్థానాలే దక్కాయి. అయితే 2014లో, 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ గెలిచిన నియోజకవర్గాల్లో తిరువూరు ఒకటి. tdp;tiru;krishna river;congress;2019;district;parliment;mla;minister;krishna district;tdp;ycp;kovvur;tiruvuru;rajahmundry;party;kothapalli samuel jawaharవైసీపీ కంచుకోటలో టీడీపీకి ఛాన్స్..ట్విస్ట్ ఏంటంటే?వైసీపీ కంచుకోటలో టీడీపీకి ఛాన్స్..ట్విస్ట్ ఏంటంటే?tdp;tiru;krishna river;congress;2019;district;parliment;mla;minister;krishna district;tdp;ycp;kovvur;tiruvuru;rajahmundry;party;kothapalli samuel jawaharFri, 11 Dec 2020 04:00:00 GMTకృష్ణా జిల్లా ఎక్కువగా టీడీపీకి అనుకూలంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీకి కాస్త అనుకూల ఫలితాలు వస్తాయి. 2014 ఎన్నికల్లో సైతం ఇదే జరిగింది. కానీ 2019 ఎన్నికల్లో టీడీపీకి గట్టి దెబ్బ తగిలింది. వైసీపీ 14 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. టీడీపీకి రెండు స్థానాలే దక్కాయి. అయితే 2014లో, 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ గెలిచిన నియోజకవర్గాల్లో తిరువూరు ఒకటి.

తిరువూరు మొదట్లో టీడీపీకి అనుకూలంగా ఉండేది. 1983 నుంచి ఇక్కడ టీడీపీ నాలుగు సార్లు గెలిస్తే, కాంగ్రెస్ మూడు సార్లు గెలిచింది. కానీ చివరి రెండు ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. వైసీపీ నుంచి రక్షణనిధి వరుసగా గెలుస్తూ వచ్చారు. దీంతో ఇక్కడ వైసీపీ బాగా బలపడింది. పైగా ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడం రక్షణనిధికి కలిసొస్తుంది. ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యేకు బాగా ప్లస్ అవుతున్నాయి.

కాకపోతే అనుకున్న మేర అభివృద్ధి జరగకపోవడం ఎమ్మెల్యేకు మైనస్ అవుతుంది. ఇక ఇలాంటి సమయంలో టీడీపీ నుంచి సరైన నాయకుడు ఉంటే పరిస్తితి వేరుగా ఉండేదని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. టీడీపీలో గట్టి నాయకుడు ఉంది, సమస్యలపై పోరాడితే తిరువూరులో నెక్స్ట్ టీడీపీకి కాస్త అనుకూల వాతావరణం ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ మాత్రం అదే టీడీపీ నుంచి సరైన నాయకుడు లేకుండా పోయాడు.

రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మూడు సార్లు ఓటమి పాలైన నల్లగట్ల స్వామీదాస్ టీడీపీలో యాక్టివ్‌గా కనిపించడం లేదు. పైగా గత ఎన్నికల్లో తిరువూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి జవహర్ సైతం, నియోజకవర్గం మొహం చూడటం లేదు. ఈయన రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షుడు కావడంతో అటు వైపే మొగ్గుచూపుతున్నారు. దానికితోడు జవహర్ తన పాత నియోజకవర్గం కొవ్వూరుకు వెళ్లాలని చూస్తున్నారు. దీంతో తిరువూరులో టీడీపీ పుంజుకోలేకపోతుంది. ఇదే వైసీపీ ఎమ్మెల్యే రక్షణనిధికి ప్లస్ అవుతుంది.




ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !

హైకోర్ట్ రాయలసీమలోనే... చెప్పేసిన సోము




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>