MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil41dcd09b-b79b-4134-b5d3-5a1e259f8d8a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil41dcd09b-b79b-4134-b5d3-5a1e259f8d8a-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై తనదైన శైలిలో దూసుకెళ్తున్న షో బిగ్ బాస్. ఈ షోలో బిగ్‌బాస్ హౌస్‌లో మోనాల్, అఖిల్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్న విషయం తెలిసిందే. అదంతా స్క్రీన్ స్పేస్ కోసమే అని కూడా తెలుసు. మోనాల్ కారణంగా అభి, అఖిల్ మధ్య గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే అభి మోనాల్ నుంచి దూరం ఉన్నా అఖిల్ మాత్రం అభిపై సందర్భం వచ్చిన ప్రతీసారి పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.akhil;akhil akkineni;pulihora;korcha;bigboss;loveఅఖిల్‌పై మోనాల్ సంచలన కామెంట్స్..!అఖిల్‌పై మోనాల్ సంచలన కామెంట్స్..!akhil;akhil akkineni;pulihora;korcha;bigboss;loveFri, 11 Dec 2020 09:00:00 GMTఅఖిల్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్న విషయం తెలిసిందే. అదంతా స్క్రీన్ స్పేస్ కోసమే అని కూడా తెలుసు. మోనాల్ కారణంగా అభి, అఖిల్ మధ్య గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే అభి మోనాల్ నుంచి దూరం ఉన్నా అఖిల్ మాత్రం అభిపై సందర్భం వచ్చిన ప్రతీసారి పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అఖిల్‌తో మాట్లాడుతూ మోనాల్ ఒక సలహా ఇచ్చింది. దీంతో అఖిల్ హర్ట్ అయ్యాడు.

అయితే మోనాల్ నవ్వతూ అఖిల్‌ను పులిహోర కలపడం తగ్గించుకో అని సలహా ఇచ్చింది. దీంతో అఖిల్ సీరియ‌స్ అయ్యాడు. ఒక‌మ్మాయిని ఫ్రెండ్‌గా తీసుకుంటే త‌ప్పేమీ కాద‌ని అఖిల్ అన్నాడు. ఆ తర్వాత పులిహోర అంటూ సోహైల్ సైతం అఖిల్ ‌పై పాట‌లు పాడాడు. నేనేదో చేసేస్తున్నా అన్నట్లుగా మాట్లాడుతున్నావ‌ని మోనాల్ మీద అఖిల్ ఫైర్ అయ్యాడు. దీంతో మోనాల్ నీవు మొద‌టి నుంచి ఫ్లర్టింగ్ చేస్తున్నావు. కానీ, ఈ మ‌ధ్య కొంచెం ఎక్కువైందని అంది.

ఇక అది చూడ‌టానికి బాగోలేదు అని ఉన్నమాట‌ చెప్పింది. నిన్ను ఏదో బ్యాడ్ చేయ‌డానికి ఇలా చెప్పట్లేద‌ని స్పష్టం చేసింది. కానీ అఖిల్ మాత్రం ఆమె మాట‌ల‌తో ఏకీభ‌వించ‌లేదు. ‘నేను అంద‌రి ముందే మ‌జాక్ చేస్తున్నాను అంతే, నీకు త‌ప్పుగా అనిపిస్తే నాకు చెప్పకు, నాతో మాట్లాడ‌కు’ అని దురుసుగా మాట్లాడ‌టంతో మోనాల్ హ‌ర్టై అక్కడ నుంచి వెళ్లిపోయింది. నీతో టైమ్ స్పెండ్ చేయాల‌ని ఉంద‌ని మోనాల్ మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట పెట్టింది. అలా అనిపిస్తే ఎక్కడో మూల‌న ఎందుకు కూర్చుంటావు, నువ్వే వ‌చ్చి నా ప‌క్కన కూర్చో అని ప‌ట్టింపు లేన‌ట్లుగా మాట్లాడాడు. దీంతో అఖిల్ అన్న మాటలకు మోనాల్ బాధపడింది.




కీర్తి ఇక ఆ టైపు సినిమాలు మానేస్తే బెటర్..?

ఆ అధికారిని రప్పించేందుకు పావులు కదుపుతున్న ఏపీ ప్రభుత్వం!

బీజేపీ నేతలను ఏకిపారేసిన దీదీ మమతా బెనర్జీ!

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>