SatireVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/lokesh-tdp-naidu-mangalagiri-bhimili-kuppam8bc5e915-0454-4947-9f15-cce772d1f4aa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/lokesh-tdp-naidu-mangalagiri-bhimili-kuppam8bc5e915-0454-4947-9f15-cce772d1f4aa-415x250-IndiaHerald.jpgసరే అప్పట్లో జరిగిందేదో జరిగిపోయింది మరి భవిష్యత్తులో పోటీ చేసేందుకు ఏదో ఓ నియోజకవర్గమైతే కావాలి కదా ? చంద్రబాబంటే ఎప్పుడో 30 ఏళ్ళ క్రితమే కుప్పాన్ని ఎంచుకున్నారు. మరి కొడుకు విషయం ఏమిటి ? లోకేష్ కు కూడా ఏదో ఓ నియోజకవర్గాన్ని చూపాల్సిన బాధ్యత ఫార్టీ ఇయర్స్ పైనే ఉందికదా. చంద్రబాబు ఉద్దేశ్యంలో 2022లోనే ఎన్నికలు వచ్చేస్తున్నాయి. అంటే 2024లో జరగాల్సిన షెడ్యూల్ ఎన్నికలు రెండేళ్ళ ముందే ఎందుకు వచ్చేస్తున్నాయంటే జమిలి ఎన్నికలపైనే చంద్రబాబు బాగా ఆశలు పెట్టుకున్నారు. మరి 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్lokesh tdp naidu mangalagiri bhimili kuppam;cbn;lokesh;nani;balakrishna;kodali nani;srinivas;visakhapatnam;telugu desam party;amarnath cave temple;telugu;avanthi srinivas;vishakapatnam;nandamuri balakrishna;kuppam;assembly;minister;mangalagiri;lokesh kanagaraj;nandamuri taraka rama rao;hindus;partyహెరాల్డ్ సెటైర్ : లోకేష్ ఈసారి ఎక్కడి నుండి పోటీ చేస్తాడు ?హెరాల్డ్ సెటైర్ : లోకేష్ ఈసారి ఎక్కడి నుండి పోటీ చేస్తాడు ?lokesh tdp naidu mangalagiri bhimili kuppam;cbn;lokesh;nani;balakrishna;kodali nani;srinivas;visakhapatnam;telugu desam party;amarnath cave temple;telugu;avanthi srinivas;vishakapatnam;nandamuri balakrishna;kuppam;assembly;minister;mangalagiri;lokesh kanagaraj;nandamuri taraka rama rao;hindus;partyFri, 11 Dec 2020 07:00:00 GMTప్రస్తుతం ఇదే ప్రశ్న తెలుగుదేశంపార్టీ నేతలను తొలిచేస్తోంది. మొన్నటి ఎన్నికల్లో తన పుత్రరత్నం పోటీ చేయబోయే అసెంబ్లీ నియోజకవర్గాలపై చంద్రబాబునాయుడు చాలా పెద్ద కసరత్తే చేశారు. కుప్పంలో కొడుకును పోటీ చేయించి తాను ఇంకేదైనా నియోజకవర్గానికి మారుతారని చంద్రబాబు విషయంలో ప్రచారం జరిగింది. తర్వాత లేదు లేదు కృష్ణాజిల్లాలోని గుడివాడ నుండే పోటీ చేయబోతున్నారని చెప్పారు. తర్వాత ఇది కూడా కాదని అనంతపురం జిల్లాలోని హిందుపురం నియోజకవర్గమన్నారు. చివరకు ఇది కూడా కాదు వైజాగ్ జిల్లాలోని భీమిలీ అన్నారు. చివరాఖరుకు గుంటూరు జిల్లాలోని మంగళగిరి నుండి పోటీ చేశారు. ఇన్ని నియోజకవర్గాల్లో సర్వేలు చేయించి ఏదీ సేఫ్ కాదని అర్ధం చేసుకుని అన్నిటికన్నా సేఫ్ నియోజకవర్గమని భావించి పోటీ చేయించిన మంగళగిరిలో లోకేష్ 16 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.




సరే అప్పట్లో జరిగిందేదో జరిగిపోయింది మరి భవిష్యత్తులో పోటీ చేసేందుకు ఏదో ఓ నియోజకవర్గమైతే కావాలి కదా ? చంద్రబాబంటే ఎప్పుడో 30 ఏళ్ళ క్రితమే కుప్పాన్ని ఎంచుకున్నారు. మరి కొడుకు విషయం ఏమిటి ? లోకేష్ కు కూడా ఏదో ఓ నియోజకవర్గాన్ని చూపాల్సిన బాధ్యత ఫార్టీ ఇయర్స్ పైనే ఉందికదా. చంద్రబాబు ఉద్దేశ్యంలో 2022లోనే ఎన్నికలు వచ్చేస్తున్నాయి. అంటే 2024లో జరగాల్సిన షెడ్యూల్ ఎన్నికలు రెండేళ్ళ ముందే ఎందుకు వచ్చేస్తున్నాయంటే జమిలి ఎన్నికలపైనే చంద్రబాబు బాగా ఆశలు పెట్టుకున్నారు. మరి 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయంటే ఇప్పటి నుండి లోకేష్ కోసం సేఫ్ నియోజకవర్గాన్ని రెడీ చేయకపోతే ఎలా ? అన్న ప్రశ్నే ఇఫుడు నేతలను తొలిచేస్తోంది.




కుప్పం నియోజకవర్గాన్ని వదిలేస్తే మొదట అనుకున్న గుడివాడలో లోకేష్ పోటీ చేస్తాడని ఎవరు అనుకోవటం లేదు. ఎందుకంటే అక్కడున్నది మంత్రి కొడాలి నాని. ఇక హిందుపురం నియోజకవర్గం నుండి పోటీ చేసేది అనుమానమే. ఎందుకంటే ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నది స్వయంగా మామగారు నందమూరి బాలకృష్ణ. ఇక విశాఖపట్నం జిల్లాలోని భీమిలీ అంటారా ఇక్కడున్నది మరో మంత్రి అవంతి శ్రీనివాస్ కాబట్టి ఇక్కడ కూడా పోటీకి దిగే అవకాశాలు తక్కువే. చివరకు మంగళగిరి నుండే మళ్ళీ పోటీ చేయాలంటే లోకేష్ అసలు పోటీనుండే తప్పుకుంటానని అన్నా అనొచ్చు. అధికారంలో ఉన్నపుడే ఏదీ సేఫ్ నియోజకవర్గం కాదని అనుకుంటే ఇపుడు ప్రతిపక్షంలో ఉన్నపుడు అసలు పోటీకి రెడీ అవుతారా ? అన్నదే డౌటుగా మారింది. చూద్దాం చంద్రబాబు జమిలి ఎన్నికలు లోకేష్ ను ఎక్కడి నుండి గట్టెక్కిస్తుందో.




పోలీసులు ఇంటికొస్తారు జాగ్రత్త

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>