PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/ysrb397b253-4da9-47ad-9cb4-7691401b1e4c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/ysrb397b253-4da9-47ad-9cb4-7691401b1e4c-415x250-IndiaHerald.jpgజ‌గ‌న్ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కూడా ర‌ఘువీరా తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చారు. జ‌గ‌న్ కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచార‌ని ర‌ఘువీరా తీవ్ర విమ‌ర్శ‌లు చేసేవారు. ఇక ఇప్పుడు పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న సాకే శైల‌జానాథ్ సైతం వైఎస్ ద‌య‌తో పైకి వ‌చ్చిన వారే... మంత్రి అయిన వారే. అలాంటిది ఆయ‌న సైతం ఇప్పుడు జ‌గ‌న్‌నే టార్గెట్‌గా చేసుకుని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మోడీ పేరు చెపితే జ‌గ‌న్‌కు వ‌ణుకు అని.. అందుకే రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ఆయ‌న మోడీకి తాక‌ట్టు పెడుతున్నారంటూ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.ysr jagan;modi;kumaar;andhra pradesh;y. s. rajasekhara reddy;vundavalli aruna kumar;mp;minister;letter;butter;father;reddyవైఎస్ బెస్ట్ ఫ్రెండ్సే జ‌గ‌న్‌కు బ‌ద్ధ శ‌త్రువుల‌య్యారే...!వైఎస్ బెస్ట్ ఫ్రెండ్సే జ‌గ‌న్‌కు బ‌ద్ధ శ‌త్రువుల‌య్యారే...!ysr jagan;modi;kumaar;andhra pradesh;y. s. rajasekhara reddy;vundavalli aruna kumar;mp;minister;letter;butter;father;reddyFri, 11 Dec 2020 18:10:37 GMTఈ టైటిల్ నూటికి నూరు శాతం నిజం అన్న‌ట్టుగానే ఉంది. జ‌గ‌న్ తండ్రి, దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డికి అనుంగు అనుచ‌రులుగా ఉన్న వారు, ఆయ‌న ద్వారా ల‌బ్ధి పొంది.. ఎంతో కీల‌క‌మైన ప‌ద‌వులు పొందిన వారు నేడు జ‌గ‌న్‌కు బ‌ద్ధ శ‌త్రువుల్లా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో పాటు తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ నేత‌ల విమ‌ర్శ‌లే ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో హైలెట్ అవుతున్నాయి. ఈ లిస్టులో చాలా మంది నేత‌లే ఉన్నారు. వీరిలో మాజీ మంత్రి, నిన్న మొన్నటి వ‌ర‌కు ఏపీ పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న ర‌ఘువీరా రెడ్డి ముందు వ‌రుస‌లో ఉన్నారు.

జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కూడా ర‌ఘువీరా తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చారు. జ‌గ‌న్ కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచార‌ని ర‌ఘువీరా తీవ్ర విమ‌ర్శ‌లు చేసేవారు. ఇక ఇప్పుడు పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న సాకే శైల‌జానాథ్ సైతం వైఎస్ ద‌య‌తో పైకి వ‌చ్చిన వారే... మంత్రి అయిన వారే. అలాంటిది ఆయ‌న సైతం ఇప్పుడు జ‌గ‌న్‌నే టార్గెట్‌గా చేసుకుని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మోడీ పేరు చెపితే జ‌గ‌న్‌కు వ‌ణుకు అని.. అందుకే రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ఆయ‌న మోడీకి తాక‌ట్టు పెడుతున్నారంటూ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

అందుకే జ‌గ‌న్ రైతుల గొంతు కోసే వ్య‌వ‌సాయ బిల్లుకు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారంటూ ధ్వ‌జ‌మెత్తుతున్నార‌ని ఫైర్ అయ్యారు. ఇక ఇప్పుడు ఈ లిస్టులోకి రాజ‌కీయ చాణుక్యుడు ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ సైతం చేరిపోయారు. వైఎస్ ద‌య‌తోనే ఆయ‌న రెండుసార్లు ఎంపీ అయ్యారు. వాస్త‌వంగా వార్డు కౌన్సెల‌ర్‌గా గెలిచేంద‌కే ఉండ‌వ‌ల్లికి అప‌సోపాలు ప‌డ‌తార‌న్న సెటైర్ ఉంది. అలాంటి వ్య‌క్తి రెండు సార్లు ఎంపీ అంటే వైఎస్ చ‌ల‌వే. జ‌గ‌న్ సీఎం అయ్యే వ‌ర‌కు ప‌రోక్షంగా చంద్ర‌బాబును విమ‌ర్శిస్తూ జ‌గ‌న్‌కు స‌పోర్ట్‌గా ఉంటూ వ‌చ్చిన ఉండ‌వ‌ల్లి సైతం ఇప్పుడు జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

పైగా జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేసే విష‌యంలో ఉండ‌వ‌ల్లి స్వ‌రం కూడా పెరిగింది. పైగా వైఎస్సార్ వేరు, జ‌గ‌న్ వేరు అంటూ ఉండ‌వ‌ల్లి చెపుతున్నారు. కేవీపీ కూడా జ‌గ‌న్‌కు సానుకూలంగా ఎప్పుడూ వ్యాఖ్య‌లు చేయ‌డం లేదు. ఏదేమైనా నాడు వైఎస్ ద‌య‌తో రాజ‌కీయంగా ఎదిగిన నేత‌లు నేడు జ‌గ‌న్‌ను బాగా టార్గెట్ చేస్తున్నార‌నే చెప్పాలి. 


జగన్‌ రెడ్డిది ఫాసిస్ట్‌ పాలన! నేరగాళ్ల రాజ్యం తెచ్చారన్న చంద్రబాబు

సినిమా ఛాన్స్ ఇవ్వకపోయినా.. ఫ్రెండ్ షిప్ కి విలువిచ్చిన మహేష్ గొప్పదనం చూడండి..!!

చంద్రుడిపై యాత్రకు భారత సంతతి వ్యోమగామికి అవకాశమిచ్చిన నాసా!

తుళ్ళూరులో హై టెన్షన్.. పోటాపోటీగా కేసులు..కానీ !

తిరుప‌తిపై బాబు గేమ్ ప్లాన్ మామూలుగా లేదే...!

మోడీని ఇలా తిట్టి.. అలా పొగిడి.. కేసీఆర్ నయా పొలిటిక‌ల్ గేమ్‌..!

రకుల్ ప్రీత్ సింగ్ కు అనుకూలంగా తీర్పు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>