PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jc0bd2bdb0-dfa4-4da1-9729-2ed2baa5d16c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jc0bd2bdb0-dfa4-4da1-9729-2ed2baa5d16c-415x250-IndiaHerald.jpgఏపీలో అనుకున్నదే అవుతోంది. రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం కూడా పూర్తిగా మారిపోతోంది. నిన్నటిదాకా సైలెంట్ గా ఉన్న పార్టీలే ఇపుడు దూసుకురానున్నాయి. ఏపీ రాజకీయాల్లో అతి కీలకంగా భావించే నాయకులు ఇపుడు పక్క చూపులు చూస్తున్నారు. కొత్త దారులు వెతుకుతున్నారు. అలాంటి వారిని వలవేసి మరీ పట్టేసేందుకు బీజేపీ సిధ్ధంగా ఉంది. jc;business;cbn;bharatiya janata party;jagan;andhra pradesh;congress;jcdiwakarareddy;district;rayalaseema;minister;tdp;central governmentటీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?jc;business;cbn;bharatiya janata party;jagan;andhra pradesh;congress;jcdiwakarareddy;district;rayalaseema;minister;tdp;central governmentFri, 11 Dec 2020 21:00:00 GMTఏపీ రాజకీయాల్లో అతి కీలకంగా భావించే నాయకులు ఇపుడు పక్క చూపులు చూస్తున్నారు. కొత్త దారులు వెతుకుతున్నారు. అలాంటి వారిని వలవేసి మరీ పట్టేసేందుకు బీజేపీ సిధ్ధంగా ఉంది.

అనంతపురం జిలాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి కుటుంబం తొందరలోనే బీజేపీ నీడకు చేరుతోంది. జేసీ దివాకరరెడ్డి నోరున్న పేరున్న నేత.  ఆయనది కాంగ్రెస్ రాజకీయం. సుదీర్ఘ కాలం పాటు ఆయన కాంగ్రెస్ లో కొనసాగి మంత్రి పదవులు నిర్వహించిన దిగ్గజ నేత. ఇక జేసీ ఫ్యామిలీ 2014 ఎన్నికల వేళ టీడీపీలోకి షిఫ్ట్ అయింది.

గత రెండు ఎన్నికల్లో టీడీపీ నుంచే పోటీ చేసి ఒకసారి గెలిచి తాజా ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ ఓడారు. ఈ నేపధ్యంలో ఈ మధ్యకాలం వరకూ జేసీ చంద్రబాబుకు అండగానే ఉంటూ వచ్చారు. అయితే జగన్ సర్కార్ వచ్చిన తరువాత జేసీ ఫ్యామిలీ టార్గెట్ అయింది. దాంతో పాటు ట్రావెలింగ్ బిజినెస్, మైనింగ్ బిజినెస్ ల మీద కూడా గట్టి దెబ్బ పడిపోయింది.

ఈ పరిణామాల నేపధ్యంలో కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీలో చేరిపోవడం బెటర్ అని జేసీ ఫ్యామిలీ భావిస్తోందని తాజా టాక్. ఈ మధ్యనే అనంతపురం జిల్లా టూర్ వేసిన ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు ఈ మేరకు రాయబేరాలు పూర్తి చేశారు అంటున్నారు. అన్నీ అనుకూలిస్తే చాలా తొందరలోనే జేసీ ఫ్యామిలీ కమలం కండువా కప్పుకుంటుందని అంటున్నారు. మొత్తానికి జేసీ ఫ్యామిలీ కనుక టీడీపీని వీడితే అది చంద్రబాబుకు భారీ దెబ్బగానే భావించాలి మరి. మరి ఈ పరిణామల నేపధ్యంలో బలమైన సీమ నేతలు కనుక కమలం వైపు తొంగి చూస్తే టీడీపీకి మరిన్ని కొత్త ఇబ్బందులు ఏర్పడడం ఖాయమని అంటున్నారు.







టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!

కరోనా వ్యాక్సీన్‌తో షాకింగ్ సైడ్ ఎఫెక్ట్స్.. వెల్లడించిన అమెరికా!

సినిమా ఛాన్స్ ఇవ్వకపోయినా.. ఫ్రెండ్ షిప్ కి విలువిచ్చిన మహేష్ గొప్పదనం చూడండి..!!

చంద్రుడిపై యాత్రకు భారత సంతతి వ్యోమగామికి అవకాశమిచ్చిన నాసా!

తుళ్ళూరులో హై టెన్షన్.. పోటాపోటీగా కేసులు..కానీ !

తిరుప‌తిపై బాబు గేమ్ ప్లాన్ మామూలుగా లేదే...!

మోడీని ఇలా తిట్టి.. అలా పొగిడి.. కేసీఆర్ నయా పొలిటిక‌ల్ గేమ్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>