Breakingyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/central-law-minister-shocking-comments-on-farmers-protest4315627f-1730-4cad-a2d7-de5cab5f82a3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/central-law-minister-shocking-comments-on-farmers-protest4315627f-1730-4cad-a2d7-de5cab5f82a3-415x250-IndiaHerald.jpgవ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలపై బీజేపీ నేత, కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. రైతుల నిరసన వెనక ఎవరున్నారో తనకు తెలుసని, ఇదంతా ఆ గ్యాంగ్ పనేనని అన్నారు. రైతులను ముందుకు తోసి వెనక ‘తుక్డే తుక్డే గ్యాంగ్’ అంతా చేస్తోందని ఆరోపించారు. దీనికి సాక్ష్యాధారలు కూడా ఉన్నాయని, అవి తమవద్దకు ఇప్పటికే చేరాయని, వాటి ఆధారంగానే ఆందోళనల వెనక ఎవరున్నారో తమకర్థమైందని అన్నారు. రైతులతో ప్రభుత్వం ఇప్పటికే ....ayurveda;gautham new;gautham;prasad;delhi;bharatiya janata party;narendra singh tomar;prakash javdekar;ravi shankar prasad.;narendra singh tomar.;minister;central government;yevaru;jandhyala ravishankar;mantra;narendraరైతు ధర్నా వెనక తుకడే గ్యాంగ్.. బీజేపీ మంత్రి సంచలన వ్యాఖ్యలురైతు ధర్నా వెనక తుకడే గ్యాంగ్.. బీజేపీ మంత్రి సంచలన వ్యాఖ్యలుayurveda;gautham new;gautham;prasad;delhi;bharatiya janata party;narendra singh tomar;prakash javdekar;ravi shankar prasad.;narendra singh tomar.;minister;central government;yevaru;jandhyala ravishankar;mantra;narendraFri, 11 Dec 2020 23:25:57 GMTన్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలపై బీజేపీ నేత, కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. రైతుల నిరసన వెనక ఎవరున్నారో తనకు తెలుసని, ఇదంతా ఆ గ్యాంగ్ పనేనని అన్నారు. రైతులను ముందుకు తోసి వెనక ‘తుక్డే తుక్డే గ్యాంగ్’ అంతా చేస్తోందని ఆరోపించారు. దీనికి సాక్ష్యాధారలు కూడా ఉన్నాయని, అవి తమవద్దకు ఇప్పటికే చేరాయని, వాటి ఆధారంగానే ఆందోళనల వెనక ఎవరున్నారో తమకర్థమైందని అన్నారు. రైతులతో ప్రభుత్వం ఇప్పటికే అనేక సార్లు చర్చలు జరిపినా.. అవి విఫలం కావడానికి వెనకుండి ఈ తంతును నడిపిస్తున్న వారే కారణమని ఆరోపించారు. షార్జిల్ ఇమామ్, ఉమర్ ఖలీద్, గౌతమ్ నవ్లఖా లాంటి వ్యక్తులకు ఆందోళనలో ఉన్న వ్యక్తులు మద్దతు ఇస్తున్నారని, దీనినిబట్టే వారెవరో అర్థం చేసుకోవచ్చని ఆయన చెప్పుకొచ్చారు.

తుక్డే తుక్డే గ్యాంగ్ పేరు ఎప్పటినుంచో వాడుకలో ఉంది. అసలు తుక్డే తుక్డే గ్యాంగ్ అంటే ఎవరు..? అనే ప్రశ్నకు సమాచార హక్కు చట్టం ద్వారా అడిగినప్పుడు కేంద్ర హోంమంత్రిత్వ శాఖసైతం తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని చెప్పడం గమనార్హం. ఈ వివరణ కూడా ఇటీవలే వచ్చింది. అయితే మళ్లీ న్యాయ శాఖ మంత్రి అదే గ్యాగ్ ప్రస్తావన తీసుకురావడం ఆసక్తికరంగా తయారైంది.

ఇదిలా ఉంటే రోజులుగా రైతులు చేస్తున్న నిరసనలపై రవిశంకర్ ప్రసాద్ కంటే ముందు కూడా కొంతమంది కేంద్ర మంత్రులు వివాదాస్పదంగా మాట్లాడి వార్తల్లో నిలిచారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ చర్చల్లో జరిగిన ఓ విషయాన్ని దీనికి ఉదాహరణగా చెప్పారు. చర్చలు జరిగే సమయంలో షర్జిల్ ఇమామ్‌ను విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారని, రైతు సమస్యలపై చర్చించడానికి వచ్చి ఇతర విషయాలపై చర్చించడం ఆశ్చర్యాన్ని కలిగించిందని, ఇదంతా దేశాన్ని విచ్చిన్నం చేయాలనుకుంటున్న వారి పనేనని, రైతుల ఆందోళన వారి చేతుల్లోకి వెళుతోందని ప్రకాష్ జవడేకర్ పేర్కొన్నారు.

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘‘కనీస మద్దతు ధర, మండిలకు సంబంధించిన విషయాలు రైతులు ప్రస్తావించాలి. కానీ దానికి బదులు వేరే విషయాలు చర్చలోకి తీసుకువస్తున్నారు. రైతులకు ఇది చాలా ప్రమాదం. రైతు సమస్యల నుంచి పూర్తిగా పక్కదారి పట్టించే విషయాలు ఇవి’’ అని నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. మరో కేంద్ర మంత్రి రావుసాహేబ్ ధాన్వే అయితే రైతుల ఆందోళనకు చైనా, పాకిస్తాన్‌లతో సంబంధం ఉందంటూ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై రైతులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


అరియానాకు సపోర్ట్ గా అభిజిత్.. సోహెల్ కు స్ట్రాంగ్ రిప్లై..!

సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>