MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/those-two-were-set-beside-pawan-and-mahesh-moviesf92bf44a-f08a-4f9e-b934-652e30111064-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/those-two-were-set-beside-pawan-and-mahesh-moviesf92bf44a-f08a-4f9e-b934-652e30111064-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో వరుసగా మూడు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకొని కెరీర్ పరంగా మంచి జోష్ మీద ఉన్న విషయం తెలిసిందే. ఇక అతి త్వరలో ఆయన నటించనున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట సెట్స్ మీదకు వెళ్లనుండగా దానిని పరశురాం తెరకెక్కించనున్నాడు. తొలిసారిగా కీర్తి సురేష్ మహేష్ కి జోడిగా నటించనున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ ని అందిస్తుండగా మది ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. బ్యాంకుల్లో ఇటీవల జరిగిన పలు ఆర్థిక కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమా ఎంతో గ్రాండ్ లెpawan kalyan;mahesh babu;pawan;mahesh;anil kapoor;sanjay dutt;suresh;vivek oberoi;anil music;bharath;kalyan;keerthi suresh;kirti;kranthi;kranti;m m keeravani;maharshi;parasuram;ram pothineni;sriram;surya sivakumar;thaman s;vivek;makar sakranti;rbi;bollywood;sri bharath;cinema;rajani kanth;sankranthi;media;maharshi 1;blockbuster hit;hero;thief;research and analysis wing;venu sreeram;josh;donga;mega surya productionsపవన్ కోసం ఆయన .... మహేష్ కోసం ఈయన ..... మొత్తానికి భలే సెట్ చేశారుగా ....??పవన్ కోసం ఆయన .... మహేష్ కోసం ఈయన ..... మొత్తానికి భలే సెట్ చేశారుగా ....??pawan kalyan;mahesh babu;pawan;mahesh;anil kapoor;sanjay dutt;suresh;vivek oberoi;anil music;bharath;kalyan;keerthi suresh;kirti;kranthi;kranti;m m keeravani;maharshi;parasuram;ram pothineni;sriram;surya sivakumar;thaman s;vivek;makar sakranti;rbi;bollywood;sri bharath;cinema;rajani kanth;sankranthi;media;maharshi 1;blockbuster hit;hero;thief;research and analysis wing;venu sreeram;josh;donga;mega surya productionsFri, 11 Dec 2020 08:00:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల  భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో వరుసగా మూడు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకొని కెరీర్ పరంగా మంచి జోష్ మీద ఉన్న విషయం తెలిసిందే. ఇక అతి త్వరలో ఆయన నటించనున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట సెట్స్ మీదకు వెళ్లనుండగా దానిని పరశురాం తెరకెక్కించనున్నాడు. తొలిసారిగా కీర్తి సురేష్ మహేష్ కి జోడిగా నటించనున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ ని అందిస్తుండగా మది ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. బ్యాంకుల్లో ఇటీవల జరిగిన పలు ఆర్థిక కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమా ఎంతో గ్రాండ్ లెవల్లో తెరకెక్కనుందని మంచి మెసేజ్ తో పాటు పలు కమర్షియల్ హంగులు జోడించి దర్శకుడు పరశురామ్సినిమా తీస్తున్నాడని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్థిక నేరస్థుడిగా కనిపించనున్నట్లు టాక్. ఇకపోతే ఈ సినిమాలో విలన్ పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉంటుందని కాగా పాత్రకు గాను బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, సంజయ్ దత్ లలో ఎవరో ఒకరిని తీసుకునే ఛాన్స్ ఉందని కొద్ది రోజుల నుంచి పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారాన్ని బట్టి అనిల్ కపూర్ ఈ సినిమాలో విలన్ గా చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. ఇకపోతే మరో వైపు ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమా తో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరొక భారీ పీరియాడికల్ సినిమా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పండుగల సాయన్న అనే వజ్రాల దొంగ పాత్రలో కనిపించనున్నట్లు టాక్. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ సంక్రాంతి అనంతరం ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో కూడా విలన్ పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుందని హీరో పాత్రకు ఢీ అంటే ఢీ అనే రీతిలో ఉండే ఆ పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ని ఎంపిక చేసిందట మూవీ యూనిట్. అతి త్వరలో ఆయన తదుపరి షెడ్యూల్ షూటింగులో జాయిన్ కాబోతున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే అటు మహేష్ కోసం అనిల్ కపూర్ అలాగే ఇటు పవన్ కోసం వివేక్ ఒబెరాయ్ ఇలా ఇద్దరు బాలీవుడ్ నటులు మన స్టార్ హీరోలకు విలన్లు కాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా వాటికి సంబంధించి ఆయా సినిమా యూనిట్స్ నుంచి అధికారికంగా ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.....!!


పోలీసులు ఇంటికొస్తారు జాగ్రత్త

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>