PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajaneekant-election-symbol-is-cyclef54f08fa-c8b1-4db3-aa30-61bdc04f1293-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajaneekant-election-symbol-is-cyclef54f08fa-c8b1-4db3-aa30-61bdc04f1293-415x250-IndiaHerald.jpgరజనీకాంత్ తమిళ సూపర్ స్టార్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన తాజాగా రాజకీయ రజనీగా మారబోతున్నారు. రజనీ తమిళనాడులో మరో నాలుగు నెలల్లో జరిగే ఎన్నికల్లో పోటీ చేసి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు. అదే కనుక జరిగితే రజనీకాంత్ అటు ఎన్టీయార్ రికార్డుని తిరగరాసినట్లే. rajanee;ntr;venkatesh;rajinikanth;tiru;rajani kanth;tamil;chief minister;uttar pradesh;tamilnadu;cycle;tdp;partyటీడీపీ గుర్తు మీద రజనీ పోటీ ?టీడీపీ గుర్తు మీద రజనీ పోటీ ?rajanee;ntr;venkatesh;rajinikanth;tiru;rajani kanth;tamil;chief minister;uttar pradesh;tamilnadu;cycle;tdp;partyFri, 11 Dec 2020 19:00:00 GMTరజనీకాంత్ తమిళ సూపర్ స్టార్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన తాజాగా రాజకీయ రజనీగా మారబోతున్నారు. రజనీ తమిళనాడులో మరో నాలుగు నెలల్లో జరిగే ఎన్నికల్లో పోటీ చేసి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు. అదే కనుక జరిగితే రజనీకాంత్ అటు ఎన్టీయార్ రికార్డుని తిరగరాసినట్లే.

అప్పట్లో ఎన్నికలకు కేవలం తొమ్మిది నెలల ముందు పార్టీని పెట్టిన ఎన్టీయార్ ఏకంగా ముఖ్యమంత్రి సీటు పట్టేశారు. ఇపుడు రజనీకాంత్ అయితే ఏకంగా నాలుగు నెలల ముందు మాత్రమే సమయం ఉంచుకుని పార్టీని ప్రారంభిస్తున్నారు. రజనీకాంత్ కనుక బంపర్ విక్టరీ కొట్టి ముఖ్యమంత్రి ఐతే ఇప్పటిదాకా అన్న గారి పేరు మీద ఉన్న గిన్నీస్ రికార్డ్ చెరిగిపోవడం ఖాయం

ఇదిలా ఉంటే రజనీకాంత్ తమిళనాట పార్టీ పెడతాను అని ప్రకటించిన తరువాత ఆ పని మీదనే బిజీగా ఉన్నారు. తన ఎన్నికల గుర్తు మీద, పార్టీ విధానాల మీద పార్టీ జెండా కూడా రజనీకాంత్ చాలానే కసరత్తు చేస్తున్నారు. ఇందులో ఎన్నికల గుర్తు విషయం ఇపుడు చర్చకు వస్తోంది. దాని ప్రకారం చూసుకుంటే సైకిల్ గుర్తుని తన ఎన్నికల గుర్తుగా రజకీకాంత్ వాడుకోవాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

నిజానికి సైకిల్ గుర్తు అన్నది పేదవాడి గుర్తుగా ఎంచి నాడు ఎన్టీయార్ దాన్ని ఉపయోగించుకున్నారు. ఆ తరువాత 1990 ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సమాజ్ వాది పార్టీ కూడా సైకిల్ గుర్తునే తన ఎన్నికల గుర్తుగా మార్చుకుని అనేక విజయాలను నమోదు చేసింది. నిజానికి సైకిల్ గుర్తు ఎపుడూ విజయమే. దానికి తిరుగులేదు కూడా. ఆ గుర్తుని పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళిన పార్టీలు అన్నీ కూడా ఎన్నికల యుధ్ధంలో విజయాలే సాధించాయి. ఇక రజనీకాంత్ కి ఒక సెంటిమెంట్ కూడా ఉంది. అదేంటి అంటే ఆయన కూడా ఎన్టీయార్ మాదిరిగా సినీ నటుడు. ఇక ఆయనలాగానే విపరీతమైన చరిష్మా ఉన్న నటుడు. దాంతో రజనీకాంత్ ఎన్నికల గుర్తు కూడా సైకిల్ అయితే కచ్చితంగా ఆయన విజయం సాధిస్తారని అంతా అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.




టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!

కరోనా వ్యాక్సీన్‌తో షాకింగ్ సైడ్ ఎఫెక్ట్స్.. వెల్లడించిన అమెరికా!

సినిమా ఛాన్స్ ఇవ్వకపోయినా.. ఫ్రెండ్ షిప్ కి విలువిచ్చిన మహేష్ గొప్పదనం చూడండి..!!

చంద్రుడిపై యాత్రకు భారత సంతతి వ్యోమగామికి అవకాశమిచ్చిన నాసా!

తుళ్ళూరులో హై టెన్షన్.. పోటాపోటీగా కేసులు..కానీ !

తిరుప‌తిపై బాబు గేమ్ ప్లాన్ మామూలుగా లేదే...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>