PoliticsP Subhadra devieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/amavathi-movement-becomes-more-intense013e5c4d-1506-45e0-aba7-a1ed44a735ba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/amavathi-movement-becomes-more-intense013e5c4d-1506-45e0-aba7-a1ed44a735ba-415x250-IndiaHerald.jpgఅమరావతి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు అమరావతి పరిరక్షణ సమితి కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 17తో అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తవుతుంది. వైకాపా ప్రకటించిన మూడు రాజధానులు వద్దంటూ, అమరావతి ఒక్కటే రాష్ట్రానికి రాజధాని అని రైతులు ఉద్యమిస్తున్నారు. కొత్త రాష్ట్రంలో రాజధాని తమ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాదని, ఆంధ్రప్రదేశ్ లోని 5 కోట్ల ప్రజలదని వారు నిర్ద్వందంగా చెబుతున్నారు. వైకాపా ప్రభుత్వం రాజధానిని విశాఖకు తరలించేందుకు సన్నాహాలు మొదలెట్టడంతో ఆందోళనకు దిగిన రైతులు ఏడాదిగా ఉద్యమిస్తున్నారు. amaravati movement;cbn;jagan;amaravati;guntur;andhra pradesh;narendra modi;capital;prime minister;chief minister;assembly;graphics;letter;maha;party;narendraఅమరావతి ఉద్యమం మరింత ఉధృతంఅమరావతి ఉద్యమం మరింత ఉధృతంamaravati movement;cbn;jagan;amaravati;guntur;andhra pradesh;narendra modi;capital;prime minister;chief minister;assembly;graphics;letter;maha;party;narendraFri, 11 Dec 2020 16:00:00 GMTఅమరావతి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు అమరావతి పరిరక్షణ సమితి కార్యాచరణ ప్రకటించింది.  ఈ నెల 17తో అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తవుతుంది. వైకాపా ప్రకటించిన మూడు రాజధానులు వద్దంటూ, అమరావతి ఒక్కటే రాష్ట్రానికి రాజధాని అని రైతులు ఉద్యమిస్తున్నారు. కొత్త రాష్ట్రంలో రాజధాని తమ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాదని, ఆంధ్రప్రదేశ్ లోని 5 కోట్ల ప్రజలదని వారు నిర్ద్వందంగా చెబుతున్నారు. వైకాపా  ప్రభుత్వం రాజధానిని విశాఖకు తరలించేందుకు సన్నాహాలు మొదలెట్టడంతో ఆందోళనకు దిగిన రైతులు ఏడాదిగా ఉద్యమిస్తున్నారు. 

ఓ పక్క న్యాయ పోరాటం, మరో పక్క ఆందోళనలతో రాజధాని ప్రాంతం దద్దరిల్లితోంది.  ఈ సందర్భంగా కార్యాచరణ ప్రకటించింది అమరావతి పరిరక్షణ సమితి. గుంటూరులో రేపు భారీ ర్యాలీ, 15న విజయవాడలో మహా పాదయాత్ర, 17న ఉద్దండరాయునిపాలెంలో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. వివరాల్లోకి వెళ్తే గత  ప్రభుత్వం  29 గ్రామాల రైతుల నుంచి ౩౩ వేల  ఎకరాల భూమిని సేకరించి అత్యంత ప్రతిష్టాత్మకంగా అమరావతి రాజధాని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ పోరుకు రాష్ట్రంలోని విపక్షాలన్నీ మద్దతు ప్రకటించాయి. 

రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ప్రజలు తెలుగు దేశం పార్టీకి ఇచ్చారు. దాంతో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు. 2015అక్టోబర్ 15న అమరావతి రాజధానికి శంకుస్థాపన జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ దేశంలోని ౩౦ నదుల నీటిని, మట్టిని తీసుకువచ్చి ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మితమవుతుందని  అమరావతిని ఆశీర్వదించారు. అంతకు ముందు అమరావతి విషయమై అసెంబ్లీలో చర్చకు రావడంతో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ తన సమ్మతిని తెలియచేసాడు. 

రాజధానికి సంబంధించి బాలారిష్టాలు తొలగించుకుంటూ కొన్ని కట్టడాలు నిర్మించేసరికి పుణ్యకాలం పూర్తయింది. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. వైకాపా అధికారంలోకి వస్తే రాజధానిని తరలిస్తారంటూ హోరెత్తిన ప్రచారాన్ని ఆ పార్టీ నేతలంతా ముక్త కంఠంతో ఖండించారు. జగన్ అమరావతి లోనే ఇల్లు కట్టుకున్నాడనీ, రాజధానిని తరలిస్తారంటూ తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి గురించి నేతలంతా ఒక్కొక్క తీరులో విమర్శనాస్త్రాలు  సంధించారు. గ్రాఫిక్స్ అన్నారు. స్మశానమన్నారు. ఎడారన్నారు. అమరావతిలో ఒక్క నిర్మాణం కూడా లేదన్నారు. దాంతో రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు భయాందోళనలు చెందారు. తర్వాత అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానుల ప్రస్తావన తెరమీదకి వచ్చింది. సిఆర్డీఏ  రద్దు చేసింది వైకాపా. వీటన్నిటినీ సవాల్ చేస్తూ రాజధాని రైతుల పోరాటం ఏడాది పూర్తి చేసుకుంటోంది. ఏడాదిగా రైతులు చేస్తున్న పోరాటానికి ఫలితం ఎప్పటికి దక్కుతుందోనంటూ పలువురు ఎదురుచూస్తున్నారు. 



కొడాలి నానీకి నేనెవరో తెలియదా...? ఈ రోజు నుంచే చూపిస్తా...!

ఆ రైతు అకౌంట్లో 4వేలకు బదులు 473కోట్లు... తీరా విత్ డ్రా సమయంలో ?

జనవరి 25 కు మహేష్ సర్కారు వారి పాట..!!

ఆక్వారంగానికి మంచి రోజులు !

వైసీపీ ని టెన్షన్ పెడుతున్న చోటా నేతలు..వీరితోనే ముప్పు..?

ప్రత్యేక రాయలసీమ కావాల్సిందే, టీడీపీ మాజీ హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఆర్ధిక ఎమర్జెన్సీ ఉందని ఆస్తులు అమ్ముతున్నారా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P Subhadra devi]]>