PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/interesting-facts-about-the-death-of-the-film1dc998ea-6f38-4ce4-949a-da0a7ca39b19-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/interesting-facts-about-the-death-of-the-film1dc998ea-6f38-4ce4-949a-da0a7ca39b19-415x250-IndiaHerald.jpgవీజే చిత్ర మరణించి మూడు రోజులకుపైగా అయినప్పటికి.. ఆమె మరణం ఆత్మహత్యా? హత్యానా అనే విషయాన్ని పోలీసులు తేల్చలేకపోయారు. క్రమంలో హోటల్ సీసీ ఫూటేజీ కీలకంగా మారింది. డిసెంబర్ 4న హేమంత్, వీజే చిత్ర ఉన్న హోటల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఆ రోజుల్లో హోటల్ కు వచ్చిన ప్రతీ ఒక్కరిని పిలిచి ప్రశ్నిస్తున్నారు. హోటల్ మేనేజ్ మెంట్ కు సమన్లు జారీ చేసి ప్రశ్నిస్తున్నారు interesting facts about the death of the film;hema;hemanth;jeevitha rajaseskhar;smart phone;police;television;december;sucide;fatherచిత్ర మరణం గురించి ఆసక్తికర విషయాలు..!చిత్ర మరణం గురించి ఆసక్తికర విషయాలు..!interesting facts about the death of the film;hema;hemanth;jeevitha rajaseskhar;smart phone;police;television;december;sucide;fatherFri, 11 Dec 2020 23:10:00 GMTడిసెంబర్ 4న హేమంత్, వీజే చిత్ర ఉన్న హోటల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఆ రోజుల్లో హోటల్ కు వచ్చిన ప్రతీ ఒక్కరిని పిలిచి ప్రశ్నిస్తున్నారు. హోటల్ మేనేజ్ మెంట్ కు సమన్లు జారీ చేసి ప్రశ్నిస్తున్నారు

అయితే వీజే చిత్ర గురించి ఆమె స్నేహితులు ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు. వీజే చిత్ర సైకాలజీ స్టూడెంట్. మానసికంగా సమస్యలున్నవారికి ఆమె కౌన్సిలింగ్ కూడా ఇస్తుందనే అంశాన్ని చెబుతున్నారు. అలాంటి చిత్ర బలవన్మరణానికి పాల్పడటంపై అనేక అనుమానాలు వినిపిస్తున్నాయి.

మొదట ఆత్మహత్యగా భావించినా, చిత్ర గొంతు, దేహంపై గాయాలు ఉండటంతో అనుమానాలు మొదలయ్యాయి. చిత్ర తల్లి, తండ్రి తమ కూతురు మరణంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. చిత్ర  ధైర్యవంతురాలు.. ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని చెప్తున్నారు. మరోపక్క చిత్ర స్నేహితురాలు షమ్ము ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని పలుమార్లు హెచ్చరించానని, ఫోన్ చేసి కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేశానని జీవిత భాగస్వామితో అభిప్రాయ బేధాలతో మానసికంగా ఏదో సంఘర్షణకు గురవుతోందని ఆ పోస్ట్ లో చెప్పుకొచ్చింది.

నిజానికి చిత్ర మరణించే రోజు వరకు షూటింగ్ లతో తీరిక లేకుండా ఉంది. మరణానికి ముందు రోజు రాత్రి ఆమె ఓ టీవీ సీరియల్ షూటింగ్‌ లో పాల్గొన్నారు. ఇంత హడావుడిలో కూడా వివాహానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె చనిపోవటం తమిళనాట సంచలనంగా మారింది.

మొత్తానికి చిత్ర మరణంపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకిలా జరిగి ఉంటుందని సన్నిహితుల్లో చర్చ మొదలైంది. చనిపోయేంత ఘటనలు ఆమె జీవితంలో ఏం జరిగి ఉంటాయోనని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.






అరియానాకు సపోర్ట్ గా అభిజిత్.. సోహెల్ కు స్ట్రాంగ్ రిప్లై..!

సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>