PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh-condemns-attack-on-tdp-leaders0a9273f0-6279-4272-bfa8-3d95a7c452e3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh-condemns-attack-on-tdp-leaders0a9273f0-6279-4272-bfa8-3d95a7c452e3-415x250-IndiaHerald.jpgగుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ నేతలు వీరంగం చేశారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది అయిన వావిలాల గోపాలకృష్ణయ్య స్మృతి వనంలో నీచ కార్యాలకు దిగారు.మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడిన ఆ మహనీయుడి సమాధి వద్దే మందుకొడుతూ ఫుల్ గా ఎంజాయ్ చేశారు. sattanapalli;auto;amala akkineni;vishal krishna;apple;mohandas karamchand gandhi;district;east;cinema;dance;turmeric;letter;tdp;local language;european union;ycp;custard apple;sattenapalle;v;partyవావిలాల స్మృతి వనంలో మందు పార్టీ! సత్తెనపల్లిలో వైసీపీ నేతల వీరంగంవావిలాల స్మృతి వనంలో మందు పార్టీ! సత్తెనపల్లిలో వైసీపీ నేతల వీరంగంsattanapalli;auto;amala akkineni;vishal krishna;apple;mohandas karamchand gandhi;district;east;cinema;dance;turmeric;letter;tdp;local language;european union;ycp;custard apple;sattenapalle;v;partyFri, 11 Dec 2020 21:22:41 GMT గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ నేతలు వీరంగం చేశారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది అయిన వావిలాల గోపాలకృష్ణయ్య స్మృతి వనంలో నీచ కార్యాలకు దిగారు.మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడిన ఆ మహనీయుడి సమాధి వద్దే మందుకొడుతూ ఫుల్ గా ఎంజాయ్ చేశారు.  లౌడ్ స్పీకర్లు పెట్టి మద్యం మత్తులో సినిమా పాటలకు స్టెప్పులేశారు.  అమ్మాయిలతో రికార్డింగ్ డ్యాన్సులు  ఏర్పాటు చేశారు.  సత్తెనపల్లి వైసీపీ యూత్ వింగ్ అధ్యక్షుడు అచ్యుత శివప్రసాద్ జన్మదిన వేడుకలంటూ ఇంత హంగామా చేశారు అధికార పార్టీ నేతలు. ఎలాంటి అనుమతి లేకుండా వావిలాల గోపాలకృష్ణయ్య స్మృతి వనంలోకి ఎంటరై ఈ తతంగమంతా కానిచ్చేశారు. 

     నిబంధనల ప్రకారం స్మృతివనంలోకి రాత్రి 7గంటలు దాటితే ఎవర్నీ అనుమతించరు. అలాంటిది ఏకంగా రాత్రి 9గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు మాజీ కౌన్సిలర్లు, మున్సిపల్ ఎన్నికల పోటీలో అభ్యర్థులుగా ఉన్నవారు అమ్మాయిలతో కలిసి చిందులు వేశారు. వైసీపీ నేతల ఈ తాజా నిర్వాకానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ ఆ ఘటన పై విచారణకు ఆదేశించారు. ఎంత అధికారంలో ఉంటే మాత్రం ఒక మహనీయుడి సమాధి వద్ద ఇలా అవమానించేలా ప్రవర్తిస్తారా అని మరోపక్క స్థానికులు మండిపడుతున్నారు.

           గత టీడీపీ ప్రభుత్వం రూ.10 కోట్లతో వావిలాల స్మృతివనాన్ని సుందరంగా తీర్చిదిద్దింది. స్థానికులు ఎంతో పవిత్రస్థలంగా భావించే స్మృతి వనంలో ఈ విధంగా మందుపార్టీలు చేసుకోవడంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మహాత్మ గాంధీ స్పూర్తితో మద్యనిషేధం అమలు చేస్తున్నామంటున్న వైసీపీ నేతలు.. అదే మద్యనిషేధం కోసం ఉద్యమించిన గాంధేయవాది వావిలాల గోపాల కృష్ణయ్య సమాధినే మందు పార్టీలు, రికార్డింగ్ డాన్సులకు వేదికగా చేయడాన్ని జనం తప్పుబడుతున్నారు. ఈ ఘటనకు నిరసనగా వివిధ పార్టీల స్థానిక నేతలు ఆందోళనకు దిగారు. టీడీపీ ఆధ్వర్యంలో స్మృతివనాన్ని పసుపునీటితో శుద్ధి చేశారు.



టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!

కరోనా వ్యాక్సీన్‌తో షాకింగ్ సైడ్ ఎఫెక్ట్స్.. వెల్లడించిన అమెరికా!

సినిమా ఛాన్స్ ఇవ్వకపోయినా.. ఫ్రెండ్ షిప్ కి విలువిచ్చిన మహేష్ గొప్పదనం చూడండి..!!

చంద్రుడిపై యాత్రకు భారత సంతతి వ్యోమగామికి అవకాశమిచ్చిన నాసా!

తుళ్ళూరులో హై టెన్షన్.. పోటాపోటీగా కేసులు..కానీ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>