TechnologyP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/digitalvotercard3dbd962d-375e-4e5a-8404-6be70c6f22ef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/digitalvotercard3dbd962d-375e-4e5a-8404-6be70c6f22ef-415x250-IndiaHerald.jpg2021లో దేశంలోని ఐదు రాష్ట్రాలు.. తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే నాటికి ఓటర్ కార్డును డిజిటలైజ్ చేసేయాలని ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. digitalvotercard;nithya new;tiru;kerala;delhi;puducherry;west bengal - kolkata;smart phone;central government;aadharఆధార్ కార్డ్ లాగానే ఓటర్ కార్డు కూడా ఆన్‌లైన్‌లోనే..ఆధార్ కార్డ్ లాగానే ఓటర్ కార్డు కూడా ఆన్‌లైన్‌లోనే..digitalvotercard;nithya new;tiru;kerala;delhi;puducherry;west bengal - kolkata;smart phone;central government;aadharFri, 11 Dec 2020 13:02:08 GMT
దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆధార్ కార్డును ఏ విధంగా అయితే డిజిటలైజ్ చేశారో ఓటర్ ఐడీలను కూడా అదే విధంగా డిజిటలైజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. 2021లో దేశంలోని ఐదు రాష్ట్రాలు.. తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే నాటికి ఓటర్ కార్డును డిజిటలైజ్ చేసేయాలని ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. డిజిటలైజ్ చేయడం వల్ల సదరు ఓటరు ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌లో తన ఓటరు గుర్తింపు కార్డును డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కొత్తగా ఓటరు కార్డును దరఖాస్తు చేసుకునే వారికి ఆటో‌మేటిక్‌గానే డిజిటలైజ్ అయిపోనుంది. వారి ఫోన్ నెంబరును ఓటరు కార్డును లింక్ చేయడంతో వారి ఓటరు కార్డు డిజిటలైజ్ కానుంది.

ఇక గతంలో ఓటరు గుర్తింపు కార్డును తీసుకున్న వారు కూడా ఆన్‌లైన్ ఓటర్ యాప్ ద్వారా తమ ఓటరు కార్డును ఆన్‌లైన్ చేసుకునే అవకాశం రానుంది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వస్తున్న సమాచారం బట్టి చూస్తే.. ఎపిక్ ఐడీకి రెండు క్యూఆర్ కోడ్‌లు ఉండనున్నట్టు సమాచారం. ఈ రెండు క్యూ ఆర్ కోడుల్లో ఒకటి ఓటరుకు సంబంధించిన సమాచారం కాగా. మరో క్యూ ఆర్ కోడ్‌లో మిగిలిన సమాచారం ఉండనుంది. ఓటరు కార్డు డిజిటలైజ్ అయితే విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా తమ ఓటరు కార్డును ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. డిజిటలైజ్ అవ్వడం ద్వారా అడ్రస్ మారినా వెంటనే కొత్త అడ్రస్‌తో మరో ఓటరు కార్డును తక్కువ సమయంలో పొందే సౌలభ్యం ఉంటుంది.  


వెచ్చటి నీళ్లు తాగితే లాభాలెన్నో...

కొడాలి నానీపై నిమ్మగడ్డ ఫిర్యాదు...?

బాలీవుడ్ బ్యూటీకి స్వీటీ అనుష్క సపోర్ట్

‘ఢిల్లీ మే దోస్తీ’ కోసమేనా! కేసీఆర్ టూర్ పై ఠాగూర్ సెటైర్

టీపీసీసీ పీఠం కోసం నేతల క్యూ

ఆ కారణం వల్లే.. పుష్ప షూటింగ్ ఆగిపోయిందా?

సూర్య ఇంట్లో జ్యోతిక ప్రవర్తన ఎలా ఉంటుందో తెలిస్తే అస్సలు నమ్మరు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>