PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/drugs-arrests8bcbe348-3d78-493d-a789-ffb55f32b083-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/drugs-arrests8bcbe348-3d78-493d-a789-ffb55f32b083-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ నెలలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. సుశాంత్ అనుమానాస్పదస్థితిలో మృతి చెంది కొన్ని నెలలు గడిచిపోయింది. అయితే ఈ కేసులో పలు ఆరోపణలు పెద్ద ఎత్తున తెరపైకి వచ్చాయి. సుశాంత్ మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్ లో కలకలం రేపింది. అయితే ఈ అంశంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. తీగ లాగితే డొంక కదిలినట్లు.... ఈ డ్రగ్స్ కోణం ఒకదానికొకటి ముడిపడి పెద్ద ఊబిలా కనిపిస్తోంది. drugs arrests;arbaaz khan;kumaar;raaj kumar;sushant singh;varun dhawan;raj;sushanth;varun;varun sandesh;varun tej;godha;bollywood;police;court;arrest;hero;drugs;june;shikhar dhawanడ్రగ్స్ కేసు: మరొకరి అరెస్ట్ సంచలనం...!డ్రగ్స్ కేసు: మరొకరి అరెస్ట్ సంచలనం...!drugs arrests;arbaaz khan;kumaar;raaj kumar;sushant singh;varun dhawan;raj;sushanth;varun;varun sandesh;varun tej;godha;bollywood;police;court;arrest;hero;drugs;june;shikhar dhawanFri, 11 Dec 2020 09:00:00 GMTబాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ నెలలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. సుశాంత్ అనుమానాస్పదస్థితిలో మృతి చెంది కొన్ని నెలలు గడిచిపోయింది. అయితే ఈ కేసులో పలు ఆరోపణలు పెద్ద ఎత్తున తెరపైకి వచ్చాయి. సుశాంత్ మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్ లో కలకలం రేపింది. అయితే ఈ అంశంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. తీగ లాగితే డొంక కదిలినట్లు.... ఈ డ్రగ్స్ కోణం ఒకదానికొకటి ముడిపడి పెద్ద ఊబిలా కనిపిస్తోంది.

ఇప్పటికే కొందరు నటీమణులు  ఈ కేసులో ఇన్వాల్వ్‌మెంట్‌ ఉన్నట్లు బయటపడింది. మరికొందరి పై విచారణ కొనసాగుతోంది. డ్రగ్స్ విచారణ దెబ్బకు బాలీవుడ్ అంతటా షేక్ అవుతోంది. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్  ఆత్మ‌హ‌త్య నాటినుంచి.. డ్రగ్స్‌ వ్యవహారం బాలీవుడ్‌ ను కుదిపేస్తున్నది. ఇప్పటికే ఈ కేసులో కొందరు ప్రముఖులను విచారించగా వారికి ఈ డ్రగ్స్ కేసు తో సంబంధాలు ఉన్నట్లు తెలిసి అరెస్టు చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ కేసులో కీలకమైన వ్యక్తి ఒకరి గురించి తెలియడంతో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ సూరజ్ గోదాంబే ను ఎన్సీబీ అరెస్టు చేసినట్లు  సమాచారం. సూరజ్ గోదాంబే బాలీవుడ్ బడా తారలు వరుణ్ ధావన్ - అర్బాజ్ ఖాన్ - రాజ్ కుమార్ రావు వంటి హీరోలకు హెయిర్ స్టయిలిస్ట్ గా పనిచేశాడు.

అయితే ఈయన్ని ప్రస్తుతం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అందిన సమాచారం మేరకు సూరజ్ గోదాంబే  ఇంటికి తనిఖీ కి వెళ్లిన ఎన్సీబీ అధికారులకు 16 బాటిల్స్ కొకైన్  పట్టుబడినట్లు తెలుస్తోంది. అక్కడ ఈ సమయంలో రూ .2.5 కోట్ల విలువైన ‘చరాస్’ని మరియు రూ .13.51 లక్షల విలువైన నగదును ఎన్సీబీ స్వాధీనం  చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ సరుకును పలుచోట్ల విక్రయించేందుకు తెచ్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. సూరజ్ మరియు అతనికి సహకరించిన వారిపై కేసు నమోదు చేసి కోర్టులో విచారణకు తీసుకెళ్లనున్నారట పోలీసులు. మరి ఈ డ్రగ్స్ కేసు వీరి ద్వారా మరెన్ని రహస్యాలు బయటపడనున్నాయో చూడాలి. 


కీర్తి ఇక ఆ టైపు సినిమాలు మానేస్తే బెటర్..?

ఆ అధికారిని రప్పించేందుకు పావులు కదుపుతున్న ఏపీ ప్రభుత్వం!

బీజేపీ నేతలను ఏకిపారేసిన దీదీ మమతా బెనర్జీ!

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>