WomenN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/yoga2fc304c2-ebe7-43e1-bfef-f3debf241c1e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/yoga2fc304c2-ebe7-43e1-bfef-f3debf241c1e-415x250-IndiaHerald.jpgగర్భధారణ సమయంలో మహిళలు అనేక ఆరోగ్య సమస్యలకు, ఒత్తిళ్లకు గురవుతుంటారు. అయితే గర్భధారణ సమయంలో వ్యాయామం చేయడం సురక్షితం కాదని వైద్యులు సూచిస్తుంటారు.ఇక గర్భధారణ సమయంలో, గర్భిణీ స్త్రీ శరీరంలో హార్మోన్లు వేగంగా కదులుతుంటాయి. yoga;women;rakshita;stree;butter;yoga;pregnantఅమ్మ: యోగాతో గర్భిణీ స్త్రీలకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!?అమ్మ: యోగాతో గర్భిణీ స్త్రీలకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!?yoga;women;rakshita;stree;butter;yoga;pregnantFri, 11 Dec 2020 15:00:00 GMT స్త్రీ శరీరంలో హార్మోన్లు వేగంగా కదులుతుంటాయి. ఈ సమయంలో మహిళలు తరచుగా ఆందోళన, ఒత్తిడి, కోపం, మూడ్ స్వింగ్లకు గురవుతుంటారు. అనులోమ, విలోమ, భ్రమరి ప్రాణాయామం వంటి శ్వాస-కేంద్రీకృత ఆసనాలు మీ భావోద్వేగాన్ని ఎదుర్కోవటానికి సహాయపడతాయి. ప్రాణాయామం ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. దీని ద్వారా శిశువుకు కూడా ఆరోగ్యంగా చేకూరుతుంది.

అయితే గర్భధారణ సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి సురక్షితమైన, సున్నితమైన మార్గంగా యోగా నిర్ధారించబడింది. ఈ సమయంలో మీరు యోగా చేస్తే బిడ్డకు ఆరోగ్యం చేకూరుతుంది. ప్రినేటల్ యోగాను అభ్యసించడం ద్వారా శిశువు బరువు మెరుగవ్వడం, ముందస్తు ప్రసవ ప్రమాదం తగ్గుతుంది. ఇది గర్భధారణ సమయంలో వచ్చే అధిక రక్తపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ర్భధారణ సమయంలో స్త్రీలకు వెన్నునొప్పి, వికారం, నిద్రలేమి, తలనొప్పి వంటి అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడంలో ప్రినేటల్ యోగా సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇక డెలివరీ సమయంలో మహిళలు ఒత్తిడికి లోనవుతుంటారు. ముఖ్యంగా మొదటిసారి జన్మనిచ్చే మహిళలకు ఇది సాధారణ సమస్య అని చెప్పవచ్చు. అందువల్ల, వివిధ ఆసనాలతో తల్లిని శారీరకంగా, మానసికంగా ప్రసవానికి సిద్ధం చేయవచ్చు. ప్రినేటల్ యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల కాళ్ళు మరింత బలోపేతం అవుతాయి, తద్వారా ప్రసవ సమయంలో వివిధ బంగిమల్లో కూర్చోవడం కూడా సులువవుతుంది. అంతేకాక, ప్రసవ సమయంలో నొప్పి తగ్గుతుంది. గర్భిణీ స్త్రీ శరీర కండరాలు, లిగ్మెంట్స్ను సాగదీయడానికి యోగా సహాయపడుతుంది. తద్వారా పెరుగుతున్న శిశువుకు గర్భంలో స్థలం లభిస్తుంది. శిశువు పెరుగుతున్నప్పుడు లేదా గర్భంలో శిశువు విస్తరించే సమయంలో కాళ్ళలో వచ్చే నొప్పి నుండి ఉపశమనానికి యోగా సహాయపడుతుంది.




నటి పవిత్ర లోకేష్ తండ్రి ఎంతో పెద్ద స్టార్, భర్త కూడా నటుడే అని మీకు తెలుసా..?

కొడాలి నానీపై నిమ్మగడ్డ ఫిర్యాదు...?

బాలీవుడ్ బ్యూటీకి స్వీటీ అనుష్క సపోర్ట్

‘ఢిల్లీ మే దోస్తీ’ కోసమేనా! కేసీఆర్ టూర్ పై ఠాగూర్ సెటైర్

టీపీసీసీ పీఠం కోసం నేతల క్యూ

ఆ కారణం వల్లే.. పుష్ప షూటింగ్ ఆగిపోయిందా?

సూర్య ఇంట్లో జ్యోతిక ప్రవర్తన ఎలా ఉంటుందో తెలిస్తే అస్సలు నమ్మరు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>