Breakingyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/vaccinea3ba3d59-ec2c-442b-bdce-e6b22a99eab8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/vaccinea3ba3d59-ec2c-442b-bdce-e6b22a99eab8-415x250-IndiaHerald.jpgప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను అంతమొందించడానికి ప్రపంచ దేశాలకున్న ఏకైక ఆశ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ తయారీలో అనేక దేశాలకు సంబంధించిన పలు కంపెనీలు తలమునకలవున్నాయి. కరోనా మహమ్మారితో అష్టకష్టాల్లో కూరుకుపోయిన అగ్రరాజ్యం సైతం టీకా అభివృద్ధిలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలోనే అనేక సంస్థలు వ్యాక్సిన్‌లను తయారు చేసినట్లు...vaccine;maya;varsha;india;germany;american samoa;vegetable market;indian;newyorkవ్యాక్సిన్ మాయ.. కాసుల వర్షంవ్యాక్సిన్ మాయ.. కాసుల వర్షంvaccine;maya;varsha;india;germany;american samoa;vegetable market;indian;newyorkFri, 11 Dec 2020 23:35:06 GMTన్యూయార్క్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను అంతమొందించడానికి ప్రపంచ దేశాలకున్న ఏకైక ఆశ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ తయారీలో అనేక దేశాలకు సంబంధించిన పలు కంపెనీలు తలమునకలవున్నాయి. కరోనా మహమ్మారితో అష్టకష్టాల్లో కూరుకుపోయిన అగ్రరాజ్యం సైతం టీకా అభివృద్ధిలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలోనే అనేక సంస్థలు వ్యాక్సిన్‌లను తయారు చేసినట్లు ప్రకటించుకుంటున్నాయి. ఈ ప్రకటనల్లో ఎంత వరకు వాస్తవం ఉందో పక్కనపెడితే.. ఆయా కంపెనీలకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తున్నాయి. వ్యాక్సిన్ విక్రయించడం వల్ల వచ్చే లాభాలపై వాల్‌స్ట్రీట్ విశ్లేషకులు ఓ అంచనా వేశారు. దాని ప్రకారం వ్యాక్సిన్ విక్రయం ద్వారా ఫైజర్, మోడెర్నాలు వచ్చే ఏడాది ఏకంగా 32 బిలియన్ డాలర్లు సంపాదించనుందట. ఇక మోర్గాన్ స్టేన్లీ అంచనా ప్రకారం వచ్చే ఏడాది కొవిడ్-19 వ్యాక్సిన్ విక్రయం ద్వారా వచ్చే ఆదాయంలో ఫైజర్‌ వాటా 19 బిలియన్ డాలర్లు ఉంటుందట. టీకా అభివృద్ధి కోసం జర్మనీ కంపెనీ బయోఎన్‌టెక్‌తో ఫైజర్ చేతులు కలిపిన నేపథ్యంతో వచ్చే ఆదాయాన్ని పంచుకోవాల్సి ఉంటుంది.

 ఫైజర్ వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి అమెరికా ఎఫ్‌డీఏ కమిటీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అయితే ప్రస్తుతానికి అనుమతులు రాకపోయినా.. త్వరలోనే అవి కూడా లభిస్తాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్‌ను వినియోగిచేందుకు బ్రిటన్‌ అనుమతించేసింది. ఇక అమెరికా అనుమతి కూడా లభిస్తే.. పీఫైజర్‌కు మొత్తంగా 2020లో 975 మిలియన్ డాలర్ల వ్యాక్సిన్ ఆదాయం సమకూరుతుందని అంచనా. అంతేకాదు 2022, 2023లలో మొత్తం కొవిడ్ వ్యాక్సిన్ ఆదాయంలో పీఫైజర్ వాటా 9.3 బిలియన్ డాలర్లు ఉంటుందనేది నిపుణుల అంచనా.

ఇక కరోనా తయారీలో మునిగిపోయిన మరో కంపెనీ మోడెర్నా. బయోటెక్ కంపెనీ అయిన మోడెర్నా గురించి 2020కి ముందు చాలా మందికి తెలియదు. అయితే ఇప్పుడు ఆ పేరు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. ఎవరికీ పెద్దగా తెలియని మోడెర్నా కంపెనీని కొవిడ్-19 వ్యాక్సిన్ 62 బిలియన్ డాలర్ల పవర్ హౌస్‌గా మార్చివేసింది. ఫైజర్ ఇప్పటికే అతిపెద్ద కంపెనీ కావడంతో ఆ సంస్థ కరోనా టీకాను అభివృద్ధి చేసినప్పటికీ దాని షేర్లకు బూమ్ రాలేదు. కానీ మోడెర్నా విషయంలో అలా కాదు. ఈ ఏడాది మొడెర్నా షేర్లు దాదాపు 700 శాతం పెరిగాయి. మోర్గాన్ స్టాన్లీ అంచనా ప్రకారం కంపెనీ మార్కెట్ విలువలో సగం టీకాతోనే ముడిపడి ఉంటుంది. మోడెర్నా వచ్చే ఏడాది కొవిడ్-19 ఆదాయంలో 13.2 బిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని గోల్డ్‌మన్ సాచ్స్ ద్వారా సమాచారం అందుతోంది. అలాగే, 2021, 2022లలో కరోనా టీకా అమ్మకాల ద్వారా 10 నుంచి 15 బిలియన్ డాలర్లు సంపాదించగలదని పెట్టుబడిదారులు భావిస్తున్నారని, బూస్టర్స్ సేల్స్ అమ్మకాలు కూడా బిలియన్లలో ఉంటాయని తెలుస్తోంది.

మన దేశంలో కూడా కరోనా వ్యాక్సిన్ తయారీలో ఉన్న భారత్ బయోటెక్ వంటి ఇండియన్ సంస్థల లాభాలు కూడా భారీగా పెరిగాయి. వ్యాక్సిన్ పూర్తిగా తయారైతే ఈ లాభాలు కోట్ల డాలర్లకు చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే కరోనా ప్రపంచానికి ఎంత మేర నష్టం కలిగించిందో పక్కన పెడితే బయోటెక్ కంపెనీలకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తున్నాయన్న మాట.




వారి ఆశలన్నీ అడియాశలు .... ఇక ఇప్పట్లో అప్ డేట్ లేనట్లే ....??

సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>