PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccineddb8b54b-3fce-400b-9d69-2328a64cbd74-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccineddb8b54b-3fce-400b-9d69-2328a64cbd74-415x250-IndiaHerald.jpgప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా వ్యాక్సిన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ మరో నిరాశజనక వార్త అందింది. ఆస్ట్రేలియా దేశీయంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌లో ప్రతికూల మార్పులు ఎదురైనట్లు గుర్తించారు. దీంతో కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి కార్యక్రమాన్ని అర్ధంతరంగా రద్దు చేశారు.vaccine;australia;university;hiv;coronavirusషాక్: కరోనా వ్యాక్సిన్‌తో HIV పాజిటివ్..!షాక్: కరోనా వ్యాక్సిన్‌తో HIV పాజిటివ్..!vaccine;australia;university;hiv;coronavirusFri, 11 Dec 2020 21:00:00 GMTకరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా వ్యాక్సిన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ మరో నిరాశజనక వార్త అందింది. ఆస్ట్రేలియా దేశీయంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌లో ప్రతికూల మార్పులు ఎదురైనట్లు గుర్తించారు. దీంతో కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి కార్యక్రమాన్ని అర్ధంతరంగా రద్దు చేశారు. ఈ మేరకు వ్యాక్సిన్ తయారీదారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ యూనివర్సిటీ, సీఎస్‌ఎల్‌ ఔషధ సంస్థ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి.

ఇక క్లినికల్ ట్రయల్స్‌లో తొలి దశలో ఈ టీకా ఆశాజనక ఫలితాలు ఇచ్చిందని అధికారులు పేర్కొన్నారు. కానీ, రెండు, మూడో దశలో కొంత మంది వలంటీర్ల శరీరంలో కొన్ని ప్రతికూల మార్పులకు గుర్తించినట్లు వెల్లడించారు. అయితే, అవి అంత ప్రమాదకరమైనవేమీ కావని స్పష్టం చేశారు. అయినప్పటికీ ముందస్తు చర్యగా వ్యాక్సిన్ ట్రయల్స్‌ను, అభివృద్ధిని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

ఈ వ్యాక్సిన్ తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలే వచ్చాయి. టీకాతో ఉత్పత్తయిన యాంటీబాడీలు కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నాయి. కానీ, రెండు, మూడో దశలో కొన్ని షాకింగ్ అంశాలను గుర్తించారు. అదేమంటే.. ఈ వ్యాక్సిన్ వల్ల ఏర్పడిన యాంటీబాడీలు హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షలో కలగజేసుకుంటున్నాయి. ఈ ప్రతికూల ప్రభావం వల్ల hiv లేనివారికి కూడా పాజిటివ్‌గా తేలిందని అధికారులు తెలిపారు.

అయితే.. వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్‌ వల్ల ఉత్పత్తయిన యాంటీబాడీలు హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షల్లో మాత్రమే ప్రభావం చూపుతున్నాయని.. అలాగని ఆ వ్యక్తులకు హెచ్‌ఐవీ సోకినట్లు కాదని స్పష్టం చేశారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ వారికి హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్‌ అని తేలినట్లు వివరించారు.


సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!

కరోనా వ్యాక్సీన్‌తో షాకింగ్ సైడ్ ఎఫెక్ట్స్.. వెల్లడించిన అమెరికా!

సినిమా ఛాన్స్ ఇవ్వకపోయినా.. ఫ్రెండ్ షిప్ కి విలువిచ్చిన మహేష్ గొప్పదనం చూడండి..!!

చంద్రుడిపై యాత్రకు భారత సంతతి వ్యోమగామికి అవకాశమిచ్చిన నాసా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>