PoliticsP Subhadra devieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/congress-leaders-race-for-pcc-chairfb0be280-e7e0-459e-9ea7-aa629887bbc1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/congress-leaders-race-for-pcc-chairfb0be280-e7e0-459e-9ea7-aa629887bbc1-415x250-IndiaHerald.jpgఉత్తమ కుమార్ రెడ్డి రాజీనామా తర్వాత టీపీసీసీ అదేక్ష స్థానానికి అర్హుడైన నేత కోసం కాంగ్రెస్ లో కసరత్తు మొదలైనది. ఇందుకోసం ఏఐసిసి నుంచి పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాగూరు హైదరాబాద్ కి ప్రత్యేకంగా విచ్చేసారు. దాంతో గాధీభవన్ లో హడావుడి మొదలైనది. పీసీసీ పీఠం పై కన్నేసిన సీనియర్ నేతలంతా క్యూ కట్టి మరీ తమ అర్హతలను వెల్లడిస్తున్నారు. pcc chair race;ktr;kumaar;prabhakar;revanth;sathish;sridhar;venkat;hyderabad;mohandas karamchand gandhi;revanth reddy;congress;mp;రాజీనామా;media;chintamaneni prabhakar;tpcc;ponnam prabhakar;mla;minister;letter;central government;ponnam prabhakar goud;parakala prabhakar;reddy;party;shakti;mantraటీపీసీసీ పీఠం కోసం నేతల క్యూటీపీసీసీ పీఠం కోసం నేతల క్యూpcc chair race;ktr;kumaar;prabhakar;revanth;sathish;sridhar;venkat;hyderabad;mohandas karamchand gandhi;revanth reddy;congress;mp;రాజీనామా;media;chintamaneni prabhakar;tpcc;ponnam prabhakar;mla;minister;letter;central government;ponnam prabhakar goud;parakala prabhakar;reddy;party;shakti;mantraFri, 11 Dec 2020 12:00:00 GMTకుమార్ రెడ్డి రాజీనామా తర్వాత టీపీసీసీ అదేక్ష స్థానానికి అర్హుడైన నేత కోసం కాంగ్రెస్ లో కసరత్తు మొదలైనది. ఇందుకోసం ఏఐసిసి నుంచి పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాగూరు హైదరాబాద్ కి ప్రత్యేకంగా విచ్చేసారు. దాంతో గాధీభవన్ లో హడావుడి మొదలైనది. పీసీసీ పీఠం పై కన్నేసిన సీనియర్ నేతలంతా క్యూ కట్టి మరీ తమ అర్హతలను వెల్లడిస్తున్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు, ఏఐసీసీ సభ్యులు, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు గాంధీ భవన్ ని చుట్టేస్తున్నారు. మొదటినుంచి ఈ పదవిపై కన్నేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం ఠాగూరుని కలసి రెండు పేజీల లేఖను సమర్పించారు. పీసీసీ చీఫ్ పోస్ట్ తనకు ఇస్తే పార్టీని బలోపేతం చేయడమే కాకుండా పాదయాత్ర చేసి మరీ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తానని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత మీడియా తో ఆయన మాట్లాడుతూ ఆ పదవి తననే వరించి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నాలుగు రోజుల తర్వాత ఇదే విషయం తేటతెల్లమవుతుందన్నారు. ఆపై ఇంకా మాట్లాడుతూ అధ్యక్షుడి నియామకం అధిష్ఠానం నిర్ణయమన్నారు. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. పదవి రాకున్నా తాను బీజేపీలో చేరేది లేదని ఖరాకండిగా చెప్పేసారు. అధ్యక్ష స్థానం తనని వారిస్తే శక్తి వంచన లేకుండా తాను శ్రమిస్తానన్నారు. పాదయాత్ర ద్వారా  ప్రతి గ్రామాన్ని సందర్శించి పార్టీకి మంచి ఫలితాలు తెచ్చేందుకు ప్రయత్నిస్తానన్నారు.
కాంగ్రెస్ లో గ్రూపుల ప్రస్తావనకు రాగా ప్రతి పార్టీలోనూ అది సాధారణమేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. అధికార తెరాసలో కూడా గ్రూపులు ఉన్నాయన్నారు. మంత్రి కేటీఆర్ తోపాటు ఎంపీ జోగినిపల్లి సతీష్ కుమార్ కూడా సీఎం కావాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
టీపీసీసీ సారథ్యం ఎవరి చేతుల్లో పెడితే బాగుంటుందా అన్న విషయమై పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఆచి తూచి అడుగులు వేస్తోంది. విస్తృతంగా అభిప్రాయం సేకరణ చేస్తోంది. నియామకం జరిగిన తర్వాత అసంతృప్తులు పెద్దగా ఉండకూడదని భావిస్తోంది.
అత్యధిక సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోవాలని కోరుకుంటోంది. గురువారం నాడు ఠాగూర్ ని కలసినవాళ్లలో సిఎల్ఫీ నేత బట్టి విక్రమార్క, టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ తదితరులు కలిసి అభిప్రాయాలు చెప్పారు. టీపీసీసీ రేస్ లో ప్రస్తుత ఎంపీలు రేవంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ల్లో ఎవరిని ఎంపిక చేయాలో సూచనలు చేసారు. మాజీ ఎంపీ అంజనీ కుమార్ యాదవ్ కూడా తనకే ఆ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఇవాళ కూడా ఈ విషయమై ఠాగూర్ ని మరికొంతమంది నేతలు కలసి తమ అభిప్రాయలు చెప్పనున్నారు. ఎవరు టీపీసీసీ నేత అవుతారో కొద్దిరోజుల్లోనే తేలనుంది.





సత్యదేవ్ కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నాడా?

‘ఢిల్లీ మే దోస్తీ’ కోసమేనా! కేసీఆర్ టూర్ పై ఠాగూర్ సెటైర్

ఆ కారణం వల్లే.. పుష్ప షూటింగ్ ఆగిపోయిందా?

సూర్య ఇంట్లో జ్యోతిక ప్రవర్తన ఎలా ఉంటుందో తెలిస్తే అస్సలు నమ్మరు

పీసీసీ రాకుంటే బీజేపీలో చేరేందుకు సిద్దమైన కోమటిరెడ్డి?

13 వారాలు..13 ట్విస్టులు..అస్సలేం జరుగుతుంది బిగ్ బాస్ హౌస్ లో

ఫైజర్, బయో ఎన్ టెక్ కరోనా వ్యాక్సిన్ డేటా చోరీ!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P Subhadra devi]]>