PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cm-jaganf81b3a44-a85c-4855-ba28-8fa932d6a047-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cm-jaganf81b3a44-a85c-4855-ba28-8fa932d6a047-415x250-IndiaHerald.jpgఏపీలో నిరుద్యోగులకు తీవ్ర స్థాయిలో అన్యాయం జరిగిందని, ఇంకా జరుగుతూనే ఉందని ధ్వజమెత్తారు జనసేనాని పవన్ కల్యాణ్. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంలో ఏపీపీఎస్సీ ఉదాసీనంగా ఉంటోందని, అందుకే నిరుద్యోగులంతా రోడ్డున పడుతున్నారని మండిపడ్డారాయన. జగన్ అధికారంలోకి రాగానే గొప్పగా ప్రకటించిన ఉద్యోగాల క్యాలెండర్ ఏమైపోయిందని అన్నారు జనసేనాని. ప్రణాళిక లేని తీరు వల్లే నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వ తీరుతో నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారని, ఇకనైనా ప్రభుత్వం తన తీరు మార్చుకుని ఏపీపీఎస్సీ cm jagan;pawan;pawan kalyan;vidya;jagan;andhra pradesh;janasena;qualification;janasena party;partyఏపీలో నిరుద్యోగులకు ఇంత అన్యాయం జరిగిందా..?ఏపీలో నిరుద్యోగులకు ఇంత అన్యాయం జరిగిందా..?cm jagan;pawan;pawan kalyan;vidya;jagan;andhra pradesh;janasena;qualification;janasena party;partyFri, 11 Dec 2020 11:00:00 GMTపవన్ కల్యాణ్. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంలో ఏపీపీఎస్సీ ఉదాసీనంగా ఉంటోందని, అందుకే నిరుద్యోగులంతా రోడ్డున పడుతున్నారని మండిపడ్డారాయన. జగన్ అధికారంలోకి రాగానే గొప్పగా ప్రకటించిన ఉద్యోగాల క్యాలెండర్ ఏమైపోయిందని అన్నారు జనసేనాని. ప్రణాళిక లేని తీరు వల్లే నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వ తీరుతో నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారని, ఇకనైనా ప్రభుత్వం తన తీరు మార్చుకుని ఏపీపీఎస్సీ ద్వారా రెగ్యులర్ గా ఉద్యోగాల భర్తీ ప్రకటనలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై ఉన్న సందేహాలు కూడా తొలగించాలన్నారు.

గ్రూప్‌-1 మెయిన్స్‌ నిర్వహణపై పునరాలోచన చేయాలని ప్రభుత్వానికి, ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు పవన్.  ఈ మేరకు జనసేనాని ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్‌ వస్తే చెప్పిన తేదీల్లో ఎలాంటి వివాదాలు, న్యాయపరమైన చిక్కులు లేకుండా పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తారనే నమ్మకాన్ని యువత కోల్పోతోందని అన్నారు పవన్. ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి క్యాలెండర్‌ ఇస్తామని చెప్పిన ఏపీపీఎస్సీ.. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి అడుగులు వేయలేదని ఆక్షేపించారు. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ఇచ్చి రెండేళ్లు అయిందన్నారు. ప్రిలిమ్స్‌ పరీక్షా పత్రంలో 51 తప్పులు వచ్చాయని.. ఈ మేరకు నిరుద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

నిరుద్యోగుల అభ్యంతరాలను ఏపీపీఎస్సీ పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమని పవన్‌ అన్నారు. ఈనెలలో మెయిన్స్‌ నిర్వహణకు కమిషన్‌ సన్నద్ధం అయ్యిందని.. అదే సమయంలో ఇతర ఉద్యోగాలతోపాటు ఉన్నత విద్య అర్హత పరీక్షలు ఉన్నందున గ్రూప్‌-1 మెయిన్స్‌ నిర్వహణ తేదీలు మార్చాలని అభ్యర్థులు జనసేన పార్టీ దృష్టికి తీసుకొచ్చారని పవన్‌ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రణాళిక లేకుండా వ్యవహరించడం వల్ల నిరుద్యోగులు నష్టపోతున్నారని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉన్నతాధికారులు నిరుద్యోగ యువత సమస్యను మానవతా దృక్పథంతో పరిశీలించాలని పవన్‌ విజ్ఞప్తి చేశారు.

ఏపీలో నిరుద్యోగులకు నమ్మకం కలిగించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించిన పవన్ కల్యాణ్.. ఇకపై ప్రతి ఏడాది ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు.


ముంబైలో మహేష్ చిల్ సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్.

పీసీసీ రాకుంటే బీజేపీలో చేరేందుకు సిద్దమైన కోమటిరెడ్డి?

బిగ్‌బాస్4 చివరి వారంలో కూడా ఏంటీ గొడవలు?

ఆ అధికారికి ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు అప్పగించేందుకు పావులు కదుపుతున్న ఏపీ ప్రభుత్వం!

బీజేపీ నేతలను ఏకిపారేసిన దీదీ మమతా బెనర్జీ!

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>