MoviesVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijayaseth4db2293c-ce47-4167-b575-a8478d8d9bfe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijayaseth4db2293c-ce47-4167-b575-a8478d8d9bfe-415x250-IndiaHerald.jpgతమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి తెలుగులో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'పుష్ప' సినిమాలో కీలక పాత్రకు గాను ఎంపిక అయిన విషయం తెల్సిందే. షూటింగ్ ఆలస్యం అవ్వడంతో విజయ్ సేతుపతి ఇతర సినిమాలకు డేట్లు ఇచ్చిన కారణంగా పుష్ప సినిమాను వదిలేసినట్లుగా చెబుతున్నారు. పుష్ప సినిమాలోని పాత్ర నాకు బాగా నచ్చింది. తప్పకుండా చేయాలనుకున్నాను. కాని డేట్లు కుదరక పోవడం వల్ల ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది అంటూ స్వయంగా విజయ్ సేతుపతి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అదే విజయ్ సేతుపతి బాలీవుడ్ సినిమాను కోల్పోయాvijayaseth;auto;aamir khan;allu arjun;sethu;vijay;vijay sethupathi;ameer khan;bollywood;cinema;telugu;rajani kanth;tamil;interview;husband;joseph vijay;arjun 1;nijamపుష్ప సినిమా ఆలస్యం బాలీవుడ్ సినిమా మిస్పుష్ప సినిమా ఆలస్యం బాలీవుడ్ సినిమా మిస్vijayaseth;auto;aamir khan;allu arjun;sethu;vijay;vijay sethupathi;ameer khan;bollywood;cinema;telugu;rajani kanth;tamil;interview;husband;joseph vijay;arjun 1;nijamFri, 11 Dec 2020 07:54:53 GMT
పుష్ప ఆలస్యం బాలీవుడ్ సినిమా మిస్

తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి తెలుగులో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'పుష్ప' సినిమాలో కీలక పాత్రకు గాను ఎంపిక అయిన విషయం తెల్సిందే. షూటింగ్ ఆలస్యం అవ్వడంతో విజయ్ సేతుపతి ఇతర సినిమాలకు డేట్లు ఇచ్చిన కారణంగా పుష్ప సినిమాను వదిలేసినట్లుగా చెబుతున్నారు. పుష్ప సినిమాలోని పాత్ర నాకు బాగా నచ్చింది. తప్పకుండా చేయాలనుకున్నాను. కాని డేట్లు కుదరక పోవడం వల్ల ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది అంటూ స్వయంగా విజయ్ సేతుపతి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అదే విజయ్ సేతుపతి బాలీవుడ్ సినిమాను కోల్పోయాడు.


పుష్ప సినిమాను ఆయన వదులుకుంటే బాలీవుడ్ సినిమా నుండి మాత్రం ఆయన్ను తప్పించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగా రూపొందుతున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో విజయ్ సేతుపతికి కీలక పాత్ర కోసం ఎంపిక చేయడం జరిగింది. త్వరలో విజయ్ సేతుపతి షూటింగ్ లో కూడా జాయిన్ అవ్వాల్సి ఉంది. ఈ సమయంలో ఆ సినిమా నుండి విజయ్ సేతుపతిని తప్పిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

సినిమాలోని పాత్ర కోసం విజయ్ సేతుపతిని మేకర్స్ కాస్త బరువు తగ్గమంటూ సూచించారట. కాని ఆయన బరువు తగ్గక పోవడంతో మొదటికే మోసం వచ్చింది. సినిమా నుండి నిర్మొహమాటంగా తప్పించారు. ఆ పాత్ర కోసం ఒక బుల్లి తెర నటుడిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ సినిమా ఛాన్స్ మిస్ అవ్వడం అంటే నిజంగా చాలా పెద్ద విషయం. ఈ విషయమై విజయ్ సేతుపతి వాదన ఏంటీ అనేది తెలియాల్సి ఉంది



పోలవరం పై కేంద్రం ఏం తేలుస్తుందో

ఆ అధికారిని రప్పించేందుకు పావులు కదుపుతున్న ఏపీ ప్రభుత్వం!

బీజేపీ నేతలను ఏకిపారేసిన దీదీ మమతా బెనర్జీ!

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>