PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/paritala-ravi910c3ac1-d091-46fa-b0c1-8e31a81ae37f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/paritala-ravi910c3ac1-d091-46fa-b0c1-8e31a81ae37f-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లో భవిష్యత్తుని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అందరికీ తెలిసిందే. రేపటి కోసం ఇవాళ్టి నుంచే చేయాల్సినవి అన్నీ చేస్తారు. అదే సమయంలో గతం నుంచి అవసరమైన పేజీలను చాలా నేర్పుగా తీసి పక్కన పెడతారు. ఆ పేజీలు ప్రత్యర్ధులకు సంబంధించిన‌వి. దాంతో ప్రత్యర్ధుల గత చరిత్రను గుర్తు చేస్తూ వర్తమానంలో వారిని అన్ పాపులర్ చేయడమే రాజకీయ నేతల అసలైన టాలెంట్. paritala ravi;kirti;ram pothineni;ravi anchor;jagan;ram madhav;mp;రాజీనామా;chief minister;history;minister;traffic police;paritala ravindra;ycp;rakhta charitra;devarakondaరక్త చరిత్ర పార్ట్ త్రీ...వైసీపీ ఎంపీ సంచలనం...?రక్త చరిత్ర పార్ట్ త్రీ...వైసీపీ ఎంపీ సంచలనం...?paritala ravi;kirti;ram pothineni;ravi anchor;jagan;ram madhav;mp;రాజీనామా;chief minister;history;minister;traffic police;paritala ravindra;ycp;rakhta charitra;devarakondaThu, 10 Dec 2020 19:00:00 GMT
ఇవన్నీ ఇలా ఉంచితే గోరంట్ల మాధవ్ మాజీ పోలీస్ అధికారి అని అందరికీ తెలిసిందే. నాడు జేసీ బ్రదర్స్  మీద తొడగొట్టి మరీ పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. అతనికి వెంటనే హిందూపురం ఎంపీ సీటు ఇచ్చి జగన్ దగ్గరుండి గెలిపించుకున్నారు.  మాధవ్ తన పనితీరుతో జనాభిమానం పొందారు. అలాగే అధినేత జగన్ నమ్మకాన్ని కూడా బాగా నిలబెట్టారు.

ఇక అనంతపురం జిల్లాలో ముట్టాట, తోపుదుర్తి, దేవరకొండ మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ తాజాగా  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ జగన్ ని అపరభగీరధుడు అంటూ కీర్తించారు. ఆయన ఎండుతున్న అనంతపురం జిల్లాలోని పొలాలకు నీరు అందిస్తున్నారని కీర్తించారు.

అదే సమయంలో దివంగత నేత, మాజీ మంత్రి పరిటాల రవి మీద కూడా మాధవ్ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పరిటాలను ఫ్రాక్షనిస్ట్, ఫ్రాక్షనిస్ట్ గా అనంతపురం జిల్లాలో ఎన్నో అరాచకాలు చేసి రక్తపుటేరులు పారించారని మండిపడ్డారు. రైతులకు సాగు నీరు ఇవ్వకుండా నాడు జిల్లాను  పరిటాల రవి  వెనకాలే ఉంచారని విమర్శించారు.  ఆయనకు చంద్రబాబు అండ కూడా ఆనాడు ఉండడంతో జిల్లాలో చాలా అరాచకాలు చేశారంటూ  నిందించారు.

ఇక చంద్రబాబు బీసీల వ్యతిరేకి అని మాధవ్ విమర్శించారు. జగన్ బీసీల కోసం ఎంతో చేస్తున్నారని కీర్తించారు. మొత్తానికి రక్త చరిత్రను పార్ట్ వన్ టూలుగా రామ్ గోపాలవర్మ తీసే ఇపుడు పార్ట్ త్రీ పేరిట  పరిటాల గతాన్ని మాధవ్ తవ్వితీయడం జిల్లాలో సంచలనమైంది. పరిటాల కుటుంబం దీని మీద ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.




రేవంత్ ఆశ‌లు అడియాస‌లు... ఇప్పుడు ఆ ఒక్క దారే దిక్కా... ?

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !

హైకోర్ట్ రాయలసీమలోనే... చెప్పేసిన సోము

ఏపీ హోం మంత్రి ఆవేదన

ఒకే సమయంలో పుట్టి, ఒకేలా ఉండే టాలీవుడ్ కవలలు ఎవరో తెలుసా..?

ప్రభాస్ సలార్ లో ఛాన్స్ పట్టేసిన బికిని భామ..!

2024 నాటికి ఏపీ లో బి‌జే‌పి జెండా పాతేనా..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>