MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavi2ce6f752-74bc-4dee-83ca-031eb356dff9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavi2ce6f752-74bc-4dee-83ca-031eb356dff9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో రెస్పాన్సిబుల్ అండ్ రెస్పెక్టబుల్ యాక్ట్రెస్ ఎవరైనా ఉన్నారు అంటే సాయిపల్లవి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈమె అందరి హీరోయిన్స్ లా ఎలా పడితే అలా ఉండరు. చాలా హుందాగా ఉంటూనే సమాజం పట్ల చాలా బాధ్యతగా ఉంటారు. sai pallavi;pawan;nani;pawan kalyan;shyam;tollywood;cinema;heroine;sai pallavi;fidaaతెలుగు వారిని దారుణంగా అవమానించిన హీరోయిన్ సాయి పల్లవితెలుగు వారిని దారుణంగా అవమానించిన హీరోయిన్ సాయి పల్లవిsai pallavi;pawan;nani;pawan kalyan;shyam;tollywood;cinema;heroine;sai pallavi;fidaaThu, 10 Dec 2020 20:49:11 GMTటాలీవుడ్ లో రెస్పాన్సిబుల్ అండ్ రెస్పెక్టబుల్ యాక్ట్రెస్ ఎవరైనా ఉన్నారు అంటే సాయిపల్లవి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈమె అందరి హీరోయిన్స్ లా ఎలా పడితే అలా ఉండరు. చాలా హుందాగా ఉంటూనే సమాజం పట్ల చాలా బాధ్యతగా ఉంటారు. యాక్చువల్ గా తనకున్న క్రేజ్ కి తను ఊ అంటే బోలెడన్ని అడ్వర్టైజ్ మెంట్లు చేయచ్చు. కానీ ఆమె అలా చేయదు. డబ్బులిస్తున్నారు కదా అని ఆ ఉత్పత్తులు వాడకుండా, కనీసం ఎలా ఉంటాయో తెలుసుకోకుండా ప్రమోట్ చేయడం తప్పు అని చాలా ప్రకటనలు ఆమె వదులుకున్నారు. డబ్బు ఇంపార్టెంట్ కాదు, తన అభిమానులు, జనం యొక్క ఆరోగ్యమే తనకి ముఖ్యమని భావించిన వ్యక్తి ఈ సాయిపల్లవి. అందుకే ఆమెకు యూత్ అంతా ఫిదా అయిపోయారు. ఇక డబ్బులొస్తున్నాయి కదా అని ఎలాంటి కేరెక్టర్స్ పడితే అలాంటి కేరెక్టర్స్ చేయరు, తనకి నచ్చితేనే చేస్తారు. ఎక్స్ పోజింగ్ కూడా చేయరు, బికినీలు అయితే వేసుకొను గాక వేసుకోనని చెప్పేశారు. ఎందుకు అంటే నా కుటుంబంతో కలిసి సినిమా చూసినప్పుడు నా తల్లిదండ్రులు సిగ్గుపడకూడదు అని చెప్పారు. ఇందుకే ఆమె మీద గౌరవం ఏర్పడింది. గరికిపాటి నరసింహారావు గారి లాంటి వ్యక్తి ఆమె మీద గౌరవంతో చేతులెత్తి నమస్కరించారంటే అర్ధం చేసుకోవచ్చు ఆమె గొప్పతనం. అలాంటి సాయిపల్లవి టాలీవుడ్ మీద ఆసక్తికర కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో లైవ్ లో ఫ్యాన్స్ ప్రశ్నలు అడగ్గా, ఆమె భిన్నమైన సమాధానాలు చెబుతూ అందరినీ ఆకట్టుకున్నారు.

 టాలీవుడ్ ఇండస్ట్రీకి, మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి మధ్య మీరు గమనించిన తేడాలు ఏమిటి అని ఒక అభిమాని అడగ్గా, దానికి ఆమె చాలా తెలివిగా సమాధానం చెప్పారు. తెలుగు దర్శకులు, నిర్మాతలు గారం చేస్తుంటారని, ప్రత్యేకంగా చూస్తుంటారని, మలయాళంలో అలా ఉండదని, అందరినీ సమానంగా చూస్తారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈమె చెప్పిన సమాధానాన్ని నెటిజన్లు రెండు రకాలుగా అర్ధం  చేసుకుంటున్నారు. మలయాళంలో అందరినీ సమానంగా చూస్తారు అని చెప్పిన దాని బట్టి చూస్తే, ఇక్కడ హీరోలతో పోలిస్తే హీరోయిన్స్ ని, మిగతా ఆర్టిస్టులని తక్కువగా చూస్తారేమో అని ఆమె అభిప్రాయం అయి ఉండచ్చునని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలానే కమర్షియల్ యాడ్స్ ఎందుకు చేయరు అని ఒక అభిమాని క్వశ్చన్ చేయగా, తనకి కమర్షియల్ యాడ్స్ చేసి ప్రజలని మేనిప్యులేట్ చేయడం ఇష్టం ఉండదని చెప్పుకొచ్చారు. ఈ ఒక్క మాటతో ఆ అభిమాని లేచి జేబులో చేయి వేసుకుని వెళ్లిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియదు. ఏది ఏమైనా గాని ఈమె వ్యక్తిత్వం చాలా గొప్పదని ఈమె మాటల్లోనే తెలుస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈమెను లేడీ పవర్ స్టార్ అనచ్చేమో. పవన్ కూడా చాలా సింపుల్ గా, హుందాగా బిహేవ్ చేస్తారు, సమాజం పట్ల బాధ్యతగా ఉంటారు. ఎంసీఏ, పడిపడిలేచే మనసు సినిమాలు హిట్ అయినా, తర్వాత వచ్చిన మారి2, ఎన్జికె సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి. అయినా సరే ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. పవర్ స్టార్ ఫీచర్స్ ఉన్నాయ్ కాబట్టి, లేడీ పవర్ స్టార్ అని కితాబ్ ఇవ్వడంలో తప్పులేదు. ఇక ఈమె విరాటపర్వం, నాని సరసన శ్యామ్ సింగరాయ్ సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు.


బాబుకు వరంగా మోడీ ప్రకటన.. తమ్ముళ్ళకు పిలుపు ?

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>