PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nagarjunasagar-has-completed-65-springs-with-todayb54b1778-22cb-4150-9be1-c87cb04dbfc5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nagarjunasagar-has-completed-65-springs-with-todayb54b1778-22cb-4150-9be1-c87cb04dbfc5-415x250-IndiaHerald.jpgఆరున్నర దశాబ్ధాల క్రితం కరువు రాకాసి బారిన పడి రైతులు విలవిల లాడారు. అలాంటి సమయంలో తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణగా పైరుపచ్చలతో సింగారించి, తెలుగు మాగాణిని తీర్చిదిద్దిన అత్యద్భుత నిర్మాణ సౌధం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. క‌ృష్ణా నదిపై నిర్మించబడి వర్డల్ ఫేమస్ అయిన నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు నేటితో 65 ఏళ్లు పూర్తయ్యాయి. nagarjunasagar;nagarjuna akkineni;ali;ranina;krishna river;nagarjuna sagar dam;prime minister;aqua;local language;96నేటితో 65 వసంతాలు పూర్తి చేసుకున్న నాగార్జునసాగర్‌..!నేటితో 65 వసంతాలు పూర్తి చేసుకున్న నాగార్జునసాగర్‌..!nagarjunasagar;nagarjuna akkineni;ali;ranina;krishna river;nagarjuna sagar dam;prime minister;aqua;local language;96Thu, 10 Dec 2020 22:45:00 GMTనాగార్జున సాగర్ ప్రాజెక్ట్. క‌ృష్ణా నదిపై నిర్మించబడి వర్డల్ ఫేమస్ అయిన నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు నేటితో 65 ఏళ్లు పూర్తయ్యాయి.  కరువు రక్కసి కబంధ హస్తాల నుంచి కర్షకులకు విముక్తి ప్రసాదించిన పవిత్ర మందిరం. అలాంటి కట్టడానికి ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా విజయవంతంగా పూర్తి చేసిన ఘనత భారత దేశ ఇంజనీర్ల ప్రతిభకు, ప్రజల శ్రమశక్తికి నిదర్శనం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు. 65 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా లోకల్ యాప్ ప్రత్యేక కథనం..

ఆంధ్ర రాష్ట్ర అన్నపూర్ణగా, రైతుల కల్పతరువుగా మారిన నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 1955 డిసెంబర్‌ 10న శంకుస్థాపన చేశారు. ప్రముఖ ఇంజనీర్‌ కేఎల్‌ రావు, ముత్యాల జమీందార్‌ మహేశ్వరప్రసాద్‌ ఆలోచనలు దీనికి అంకురార్పణ చేశాయి. ప్రాజెక్టు నిర్మాణానికి వేల మంది శ్రమజీవులు చెమట చిందించగా.. వందల మంది ప్రాణాలు కోల్పోవడం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. 1970లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తైంది. డ్యాం నిర్మాణ దశలో నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు మొట్టమొదటి చీఫ్‌ ఇంజనీరుగా పనిచేసిన మీర్‌జాఫర్‌ అలీ నిబద్ధతను మెచ్చుకోవాల్సిందే.

ప్రపంచ రాతి నిర్మాణాల ప్రాజెక్టుల్లో నాగార్జునసాగర్‌ డ్యాం పొడవు, ఎత్తుల్లో ప్రథమస్థానంలో ఉండడం విశేషం. నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ఇది 285 చ.కి.మీ. విస్తీర్ణంతో 408 టీఎంసీల నీటి సామర్థ్యాన్ని కలిగివుంది. 44 ఏళ్లుగా కృష్ణా నదిలో వచ్చిన వరదల వల్ల రిజర్వాయర్‌లో పూడిక చేరడంతో సాగర్‌లో నీటి నిల్వ సామర్థ్యాన్ని 312 టీంఎసీలుగా ప్రభుత్వం నిర్ధారించింది. సుమారు 96 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని రిజర్వాయర్‌ కోల్పోయినట్లైంది.

జై జవాన్‌.. జై కిసాన్‌ అని నినాదం ఇచ్చిన మాజీ ప్రధాని లాల్‌బహుదూర్‌ శాస్త్రి జ్ఞాపకార్థం సాగర్‌ ఎడమ కాలువకు లాల్ బహుదూర్‌ కెనాల్‌ అని పేరు పెట్టారు. ఈ కాలువకు 1959లో అప్పటి రాష్ట్ర గవర్నర్‌ భీమ్‌సేన్‌ సచార్‌ శంకుస్థాపన చేయగా... కుడి కాలువతోపాటే ఇందిరాగాంధీ 1967 ఆగస్టు 4న ప్రారంభోత్సవం చేశారు. ఈ కాలువ ద్వారా 10.38 లక్షల ఎకరాలకు నీరు అందుతోంది.


టీకా వచ్చిందని రిలాక్స్ అవ్వకండి..మరో ప్రమాదం కూడా ఉంది..

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>