PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-modi-shivsena-maharashtra-sanjayrautaff87bd9-90a0-4318-ae60-0c0ac0bcd96f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-modi-shivsena-maharashtra-sanjayrautaff87bd9-90a0-4318-ae60-0c0ac0bcd96f-415x250-IndiaHerald.jpgఇటీవలే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీలో గత కొన్ని రోజులుగా చేస్తున్న ఆందోళనల వెనుక దాయాది పాకిస్థాన్, చైనాల హస్తం ఉందంటూ కేంద్ర మంత్రి రావ్‌సాహేబ్ దాన్వే బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. రైతుల ఉద్యమం వెనుక చైనా, పాకిస్థాన్‌లు ఉంటే వెంటనే వాటిపై సర్జికల్ స్ట్రయిక్స్ చేపట్టాలని సూచించారు. sanjay raut;allu aravind;bharatiya janata party;pakistan;sanjay raut;hosta;mp;prime minister;minister;shiv sena;central government;arvind savantరైతుల ఉద్యమం వెనుక చైనా, పాక్ లు ఉంటే వెంటనే సర్జికల్ స్ట్రైక్స్ చేయండి - శివసేన సీనియర్ నేతరైతుల ఉద్యమం వెనుక చైనా, పాక్ లు ఉంటే వెంటనే సర్జికల్ స్ట్రైక్స్ చేయండి - శివసేన సీనియర్ నేతsanjay raut;allu aravind;bharatiya janata party;pakistan;sanjay raut;hosta;mp;prime minister;minister;shiv sena;central government;arvind savantThu, 10 Dec 2020 17:00:00 GMTకేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీలో గత కొన్ని రోజులుగా చేస్తున్న ఆందోళనల వెనుక దాయాది పాకిస్థాన్, చైనాల హస్తం ఉందంటూ కేంద్ర మంత్రి రావ్‌సాహేబ్ దాన్వే బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని జాల్నా జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నార్సీ, సీఏఏ విషయంలో ముస్లింలను కొందరు తప్పుదోవ పట్టించారని, ఆ ప్రయత్నాలేవీ సఫలం కాలేదన్న కేంద్ర మంత్రి.. రైతులను కూడా అదే విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఎన్సార్సీ, సీఏఏపై అప్పట్లో ముస్లింలను ఆందోళనకు గురిచేసి, ఆరు నెలల్లోగా దేశం నుంచి తరిమేస్తారని భయభ్రాంతులకు గురిచేశారని, వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో రైతులను ఇప్పుడు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఇదేమీ రైతుల ఉద్యమం కాదు. వీటి వెనుక పాక్, చైనాలున్నాయని ఆరోపించారు. ఆందోళనల్లో పాల్గొంటున్న వారు రైతులు కాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.



కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. రైతుల ఉద్యమం వెనుక చైనా, పాకిస్థాన్‌లు ఉంటే వెంటనే వాటిపై సర్జికల్ స్ట్రయిక్స్ చేపట్టాలని సూచించారు. కేంద్ర మంత్రి చెప్పినట్టు రైతుల ఆందోళనల వెనుక పొరుగు దేశాల హస్తం ఉందనే సమాచారం ఉన్నట్టయితే, ఆ దేశాలపై రక్షణ మంత్రి వెంటనే సర్జికల్ స్ట్రయిక్స్ చేయాలని పేర్కొన్నారు. ఇది చాలా తీవ్రమైన విషయమని... రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి, త్రివిధ దళాల అధిపతులు వెంటనే దీనిపై సమావేశమై చర్చించాలని అన్నారు. కేంద్ర మంత్రి దాన్వే వ్యాఖ్యలపై శివసేన అధికార ప్రతినిధి, మాజీ కేంద్ర మంత్రి అరవింద్ సావంత్ కూడా మండిపడ్డారు. మహారాష్ట్రలో అధికారం కోల్పోవడంతో బీజేపీ నేతలు పిచ్చిపట్టి మాట్లాడుతున్నారని అన్నారు. అటు రైతు సంఘాలూ దీనిపై స్పందించాయి. ‘రైతులకే ఇది అవమానం. రైతులు స్వతహాగా ఉద్యమిస్తున్నారు. ఎవరో ఉసిగొల్పితే కాదు.’ అని రైతు సంఘం నేత హన్నన్ మొల్లాహ్ తెలిపారు.


ఆ ఏపీ మంత్రిలో దూకుడు త‌గ్గిందే... తెన‌వెన‌క క‌థ ఇదే...!

అతనితో లిప్ లాక్ కు రెడీ.. తమన్నా బోల్డ్ స్టేట్మెంట్..!

వ్యాక్సిన్ అమెరికన్లకే ఫస్టా..?

రాఘవేంద్రరావుకు నో చెప్పిన హీరోయిన్..!

తెలంగాణ కాంగ్రెస్ గ్రూపులుగా విడిపోయింది! జగ్గారెడ్డి హాట్ కామెంట్స్

పీసీసీ ఇవ్వండి.. ప్రగతి భవన్ పునాదులు కదిలిస్తా: కోమటిరెడ్డి

కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>