PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revathi4b15dae1-2bf6-4702-a8dd-4b9263899472-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revathi4b15dae1-2bf6-4702-a8dd-4b9263899472-415x250-IndiaHerald.jpgవడ్డెర కార్పోరేషన్ ఛైర్మన్ దేవళ్ల రేవతి నేడు జరిగిన ఘటన గురించి వివరణ ఇచ్చారు. నిన్న ఉదయం మా అమ్మ కాలు జారి కిందపడటంతో ఆస్పత్రికి తీసుకువెళ్తున్నా అని ఆమె తెలిపారు. టోల్ గేట్ దారులు రద్దీగా ఉన్నాయని పక్కనున్న దారి నుంచి వెళ్తున్నా అని ఆమె అన్నారు. నేను స్థానిక ప్రజా ప్రతినిదిని. నా వద్ద లోకల్ టోల్ గేట్ పాస్ ఉంది అని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా టోల్ గేట్ మీదుగా నేను రాకపోకలు చేస్తూనే ఉన్నా అన్నారు. టోల్ గేట్ కట్టలేదని నాపై దుష్ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. నాకు ఫ్రీపాస్ ఉందని.. మినహాయిrevathi;revathi;vaddera;scheduled tribes;driver;local languageనన్నే కొట్టారు: రేవతి వెర్షన్ ఇదినన్నే కొట్టారు: రేవతి వెర్షన్ ఇదిrevathi;revathi;vaddera;scheduled tribes;driver;local languageThu, 10 Dec 2020 18:27:57 GMTవడ్డెర కార్పోరేషన్ ఛైర్మన్ దేవళ్ల రేవతి నేడు జరిగిన ఘటన గురించి వివరణ ఇచ్చారు. నిన్న ఉదయం మా అమ్మ  కాలు జారి కిందపడటంతో ఆస్పత్రికి తీసుకువెళ్తున్నా అని ఆమె తెలిపారు. టోల్ గేట్   దారులు  రద్దీగా ఉన్నాయని  పక్కనున్న దారి నుంచి వెళ్తున్నా అని ఆమె అన్నారు. నేను స్థానిక ప్రజా ప్రతినిదిని. నా వద్ద లోకల్ టోల్ గేట్ పాస్ ఉంది అని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా టోల్ గేట్ మీదుగా నేను రాకపోకలు చేస్తూనే ఉన్నా అన్నారు. టోల్ గేట్ కట్టలేదని నాపై దుష్ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు.

నాకు ఫ్రీపాస్ ఉందని.. మినహాయింపు ఇవ్వాలని టోల్ సిబ్బందిని కోరా అని ఆమె అన్నారు. మా అమ్మ ఆరోగ్యం బాగోలేదని ఆస్పత్రికి వెళ్తున్నానని పంపించాలని కోరా అన్నారు. అరగంట పాటు రిక్వెస్ట్ చేసి నా టోల్ సిబ్బంది వినలేదు అని నన్ను నానా బూతులు తిట్టారు అని ఆవేదన వ్యక్తం చేసారు. నన్ను లెక్కచేయకుండా ఎస్టీ అయిన మా డ్రైవర్ ను దుర్భాషలాడుతూ కొట్టారు అన్నారు. నాపై  జరుగుతోన్న దుష్ప్రచారం పూర్తి గా అవాస్తవం అని పేర్కొన్నారు. అరగంట పాటు మహిళనైన నాపై టోల్ ప్లాజా సిబ్బంది గూండాల్లా నాపై దాడి చేశారు అని ఆవేదన వ్యక్తం చేసారు.

బూతులు తిడుతూ  మహిళా లోకం  తలదించుకునేలా టోల్ సిబ్బంది వ్యవహరించారు అని, కాజా టోల్ గేట్ సిబ్బంది దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. ఛైర్మన్ అని చెబుతున్నా.. అయితే మాకేంటి అని దాడి చేశారు అని, ముందు నాపై నలుగురు గూండాలు దాడి చేశారని అన్నారు. అరగంట పాటు రోడ్డుపై వేధింపులకు గురి చేశారు అని విమర్శించారు. సిబ్బంది రౌడీయిజం చేశారు.. బోర్డును  నా కాలుపై వేశారు. కాలు వాచింది అని ఆమె పేర్కొన్నారు. టోల్ సిబ్బంది అరగంట పాటు ఓ మహిళపై  దురుసుగా వ్యవహరించారు అని ఆమె విమర్శించారు.


హైకోర్ట్ రాయలసీమలోనే... చెప్పేసిన సోము

ఒకే సమయంలో పుట్టి, ఒకేలా ఉండే టాలీవుడ్ కవలలు ఎవరో తెలుసా..?

ప్రభాస్ సలార్ లో ఛాన్స్ పట్టేసిన బికిని భామ..!

2024 నాటికి ఏపీ లో బి‌జే‌పి జెండా పాతేనా..!!

ఫేస్ బుక్ అమెరికా ముప్పెట దాడి

ఆ ఏపీ మంత్రిలో దూకుడు త‌గ్గిందే... తెన‌వెన‌క క‌థ ఇదే...!

అతనితో లిప్ లాక్ కు రెడీ.. తమన్నా బోల్డ్ స్టేట్మెంట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>