PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/repomapo-if-your-account-is-empty-umf02905f6-bade-424e-9289-c3b7666436e5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/repomapo-if-your-account-is-empty-umf02905f6-bade-424e-9289-c3b7666436e5-415x250-IndiaHerald.jpgడెబిట్ కార్డ్‌... క్రెడిట్‌ కార్డ్‌ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త. మీ కార్డు పిన్‌ నెంబర్‌ లీకయ్యింది. మీ అకౌంట్‌లో ఎంత డబ్బుంది.. పాస్‌వర్డ్‌.. పాన్‌ నెంబర్‌.. మీ లావాదేవీలు.. అన్నీ హ్యాకింగ్‌ కి గురయ్యాయి. రేపోమాపో మీ ఖాతా ఖాళీ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇలా.. 70 లక్షల మంది భారతీయుల డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల వివరాలు హ్యక్‌ అయినట్టు చెబుతున్నారు ఇంటర్నెట్‌ సెక్యూరిటీ రీసెర్చర్లు. repomapo if your account is empty um;singapore;rbi;2019;customerరేపోమాపో మీ ఖాతా ఖాళీ అయితే.. అమ్మో..!రేపోమాపో మీ ఖాతా ఖాళీ అయితే.. అమ్మో..!repomapo if your account is empty um;singapore;rbi;2019;customerThu, 10 Dec 2020 23:30:00 GMT
ఏటీఎం పిన్‌ నెంబర్‌.. మన ఖాతాకు శ్రీరామ రక్ష. ప్రాణంగా నమ్మేవారికి సైతం డెబిట్‌ కార్డ్‌ క్రెడిట్‌ కార్డ్‌ పిన్‌ నెంబర్‌ చెప్పరు. మీకు తప్ప మీ పాస్‌వర్డ్‌ ఎవరికీ తెలియదనుకుంటున్నారా.. అయామ్‌ సేఫ్‌ అనుకుంటున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త. మీ పాస్‌వర్డ్‌ లీకయ్యింది.. మీ అకౌంట్‌ వివరాలు హ్యాక్‌ అయ్యాయి. వందలో.. వేలో కాదు.. ఏకంగా 70 లక్షల మంది భారతీయుల డెబిట్‌ కార్డ్‌ క్రెడిట్‌ కార్డ్‌ వివరాలు హ్యాక్‌ అయ్యాయి.  

దేశవ్యాప్తంగా 70 లక్షల మందికి చెందిన డెబిట్‌ కార్డ్‌, క్రెడిట్‌ కార్డ్‌.. పాస్‌వర్డ్‌, పాన్‌ నెంబర్‌, మెయిల్‌ ఐడీ, ఫోన్‌నెంబర్లతో సహా పూర్తి వివరాలు హ్యాకైనట్లు చెబుతున్నారు ఇంటర్నెట్‌ సెక్యూరిటీ రీసెర్చర్లు. ఖాతాదారుల పేర్లు.. ఉద్యోగం.. కంపెనీ వివరాలు, వార్షిక ఆదాయం.. ఈ వివరాలన్నీ హ్యాకర్ల చేతిలో పజ్డాయి. లీక్‌ అయిన వారి వివరాలు ఏకంగా 2 జీబీ వరకు ఉండొచ్చని తెలిపారు.

2010 నుంచి 2019 మధ్యకాలంలో.. ఖాతాదారులకు సంబంధించిన పూర్తి డేటా లీక్‌ అయినట్లు నిర్ధారించారు. బ్యాంకులకు సేవలు అందించే థర్డ్‌పార్టీ కంపెనీలే డేటా లీక్‌ చేసినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ప్రజలకు చెందిన సాధారణ వివరాల కంటే.. బ్యాంకింగ్‌ సమాచారానికే ఎక్కువ డిమాండ్‌ ఉందంటున్నారు టెక్‌ ఎక్స్‌పర్ట్స్‌. అందుకనే ఈ థర్డ్‌పార్టీ కంపెనీలు.. బ్యాంక్‌ కస్టమర్ల వివరాలను స్కామ్‌స్టర్లు, హ్యాకర్లకు అమ్మిఉంటారని భావిస్తున్నారు.

ఇంత పెద్ద మొత్తంలో బ్యాంక్‌ ఖాతాదారుల వివరాలు హ్యాక్‌ అవడం ఇది రెండోసారి. సింగపూర్‌ సైబర్‌ సెక్యూరిటీ గ్రూప్‌ వాళ్లు చెబుతున్న లెక్కల ప్రచారం 4 లక్షల 60వేల మంది కార్డుల వివరాలు లీకయ్యాయి. వాటిని 30 కోట్లకు అమ్మాకానికి పెట్టారని తేలింది. తమకు తెలిసిన సమాచారాన్ని సింగపూర్ సైబర్ సెక్యూరిటీ గ్రూప్‌ ఇండియాకి చెందిన కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీంకి అందించారు. దీనిపై ఆరా తీసిన సైబర్‌ సెక్యూరిటీ అధికారులు.. డేటా లీకేజ్‌పై ఆర్‌బీఐకి సమాచారమిచ్చారు.  

హ్యాకింగ్‌కి గురైన కార్డుల్లో.. ప్రస్తుతం ఎన్ని యాక్టివ్‌గా ఉన్నాయనే విషయం తెలీదు. యాక్టివ్‌ ఉన్న కార్డులతో లగ్జరీ వస్తువులు కొని అమ్మేస్తుంటారని సైబర్‌ నిపుణులు చెప్తున్నారు. 70 లక్షల మంది వివరాల్లో నాది ఎందుకు ఉంటుంది లే అనుకోకండి. అందులో ఎవరిదైనా  ఉండవచ్చు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ఉన్నవాళ్లంతా పాస్‌వర్డ్‌లు, మెయిల్‌ ఐడీలు, మొబైల్‌ నెంబర్లు మార్చుకోవడం ఉత్తమం అంటున్నారు. మనది కాదులే అనుకుంటే.. ఖాతా ఖాళీ అయ్యాక.. బాధ పడాల్సి ఉంటుందని సూచిస్తున్నారు.

మీ ఖాతా హ్యాక్‌ అయినా.. అవకున్నా.. ప్రతీ ఖాతాదారుడు తమ పాస్‌వర్డ్‌, పిన్‌ నెంబర్లను ఎప్పటికప్పుడు చేంజ్‌ చేసుకోవడం ద్వారా సేఫ్‌గా ఉండచ్చంటున్నారు బ్యాంకింగ్‌ 


టీమిండియా ఆటగాడిని ప్రశంసలతో ముంచెత్తిన వార్నర్‌

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>