MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/pushpaf50c98c6-8dcf-44e6-85ed-a86fb089b110-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/pushpaf50c98c6-8dcf-44e6-85ed-a86fb089b110-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ లో ఆసక్తికరం గా మారిన సినిమాల జాబితాలో అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్పా సినిమా కూడా ఒకటి. మొట్టమొదటిసారి అల్లు అర్జున్ ఒక మాస్ క్యారెక్టర్ చేయడం, అది కూడా కామన్ స్లాంగ్ కాకుండా పూర్తి రాయలసీమ స్లాంగ్ లో సినిమా చేస్తుండడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇది ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించిన కథ కావడంతో సినిమా షూటింగ్ అంతా దాదాపుగా అడవిలోనే షూట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్ అడవుల్లో చేయాలని సుకుమార్ భావించాడు. కానీ కరోనాtollywood;kumaar;allu arjun;niharika konidela;rashmika mandanna;sukumar;tollywood;cinema;rayalaseema;tamil;marriage;heroine;mythri movie makers;house;arjun 1;bangkok;massకరోనాతో మనిషి చనిపోయినా వెనక్కుతగ్గనంటున్నారు !కరోనాతో మనిషి చనిపోయినా వెనక్కుతగ్గనంటున్నారు !tollywood;kumaar;allu arjun;niharika konidela;rashmika mandanna;sukumar;tollywood;cinema;rayalaseema;tamil;marriage;heroine;mythri movie makers;house;arjun 1;bangkok;massThu, 10 Dec 2020 21:00:00 GMTటాలీవుడ్ లో ఆసక్తికరం గా మారిన సినిమాల జాబితాలో అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్పా సినిమా కూడా ఒకటి. మొట్టమొదటిసారి అల్లు అర్జున్ ఒక మాస్ క్యారెక్టర్ చేయడం, అది కూడా కామన్ స్లాంగ్ కాకుండా పూర్తి రాయలసీమ స్లాంగ్ లో సినిమా చేస్తుండడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇది ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించిన కథ కావడంతో సినిమా షూటింగ్ అంతా దాదాపుగా అడవిలోనే షూట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్ అడవుల్లో చేయాలని సుకుమార్ భావించాడు. కానీ కరోనా దెబ్బకు ఆ ప్లాన్ అంతా అప్సెట్ అయింది. తర్వాత కేరళలో చేయాలని భావించాడు అక్కడ కూడా కరోనా కేసులు భారీగా ఉండడంతో అక్కడి ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వడం మానేశాయి. దీంతో చేసేదేమీ లేక ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ మొదలుపెట్టారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేసిన ఒక క్రూ  మెంబర్ కు కరోనా సోకిన ఆయన ఆసుపత్రి పాలైన చనిపోవడం జరిగింది. ఈ మనిషి దాదాపుగా సెట్ లో ఉన్న అందరితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండడంతో షూటింగ్ అప్పటికప్పుడు ప్యాకప్ చెప్పేసి ఎవరికి వాళ్ళు హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లి పోవాల్సి వచ్చింది.

 అయితే ఈ సినిమా ఇప్పట్లో మరలా సెట్స్ మీదకు వెళ్లదేమో అని అందరూ భావించారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్ ఒకటి రెండు రోజుల్లో వికారాబాద్ అడవుల్లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా అందరి ఐసోలేషన్ గడువు పూర్తయిందని ఎటూ నిహారిక పెళ్లి కూడా పూర్తికావడంతో అల్లు అర్జున్ కూడా షూట్ కి పాల్గొనే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే దీని మీద విమర్శలు గట్టిగా వినిపించే అవకాశం ఉంది.


 సినిమా క్రూ మెంబర్  చనిపోయినా సినిమానే ముఖ్యం అన్నట్టు సినిమా షూటింగ్ మొదలు పెట్టారు ఏంటి అని జనాలు విమర్శించే అవకాశం ఉంది. అయినా సరే ఇవేవీ పట్టకుండా సినిమా యూనిట్ మాత్రం సినిమా వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే పట్టుదలతో షూటింగ్ మొదలుపెట్టనుంది. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఒక తమిళ విలన్ ను తీసుకురావాలని భావిస్తున్నారు. ఇప్పటికీ ఎవరు అనేది ఫిక్స్ కాకపోయినా అనేక మంది పేర్లు ప్రచారం జరుగుతున్నాయి.. ఇక ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు నిర్మిస్తున్నారు.




బాబుకు వరంగా మోడీ ప్రకటన.. తమ్ముళ్ళకు పిలుపు ?

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>