PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-who-say-psy-means-psy-with-the-centerd642e119-2d56-4222-b74e-7e43051d133b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-who-say-psy-means-psy-with-the-centerd642e119-2d56-4222-b74e-7e43051d133b-415x250-IndiaHerald.jpgకొత్త వ్యవసాయ చట్టాలపై పీటముడి వీడటం లేదు. రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. కేంద్రం చర్చలతో నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంది. చట్టాలకు సవరణలను ప్రతిపాదించినా రైతులు తగ్గడం లేదు. ఇంతకీ.. కేంద్రం ప్రతిపాదనలేమిటి? వాటిపై రైతుల అభ్యంతరాలేంటి? పీఠముడి ఎక్కడపడింది? అగ్గి ఎక్కడ రాజుకుంది? రైతుల కార్యాచరణ ఏంటో తెలుసా? farmers who say psy means psy with the center;suma;suma kanakala;bharatiya janata party;haryana - chandigarh;collector;court;prime minister;king;job;central government;jio;punjab;mantraసెంటర్‌తో సై అంటే సై అంటున్న రైతులు !సెంటర్‌తో సై అంటే సై అంటున్న రైతులు !farmers who say psy means psy with the center;suma;suma kanakala;bharatiya janata party;haryana - chandigarh;collector;court;prime minister;king;job;central government;jio;punjab;mantraThu, 10 Dec 2020 14:00:00 GMT
సెంటర్‌తో సై అంటే సై అంటున్నారు రైతులు. కొత్త వ్యవసాయ చట్టాల్లో సవరణ చేస్తామంటూ కేంద్రం పంపిన ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి రైతుసంఘాలు. ఎలాంటి ప్రతిపాదనలూ అంగీకరించేది లేదన్న రైతుసంఘాల నేతలు.. చట్టాల్ని రద్దు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు.

కేంద్రం తీరును నిరసిస్తూ.. దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. డిసెంబర్‌ 12 నుంచి వరుస నిరసనల కోసం కార్యాచరణప్రకటించారు. డిసెంబర్‌ 12న దిల్లీ- జైపూర్‌, దిల్లీ-ఆగ్రా జాతీయ రహదారుల దిగ్బంధం, దేశవ్యాప్తంగా టోల్‌ప్లాజాల దగ్గర ఆందోళన , రిలయన్స్‌ మాల్స్‌ బహిష్కరణ, జియో మాల్స్‌ ఎదుట ఆందోళన చేపట్టాలని నిర్ణయించిన రైతుసంఘాలు.. దేశంలోని రైతులందరూ ఆందోళనల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

డిసెంబర్‌ 12 తర్వాత బీజేపీ నాయకులు, మంత్రులను ఘెరావ్‌ చేస్తామన్నారు రైతు నేతలు. డిసెంబర్‌ 14న దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన రైతు సంఘాల నేతలు.. అదే రోజున బీజేపీ కార్యాల‌యాల‌ ముట్టడించాలని నిర్ణయించారు. అయితే, అంతకు ముందు 8 చట్టసవరణ ప్రతిపాదనలను రైతుల ముందు ఉంచింది కేంద్రం.

ప్రస్తుతం ఉన్న కనీస మద్దతు ధర విధానం కొనసాగుతుందని.. లిఖిత పూర్వక హామీ ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. మండి వ్యవస్థ లో మార్పులు, ఒకే పన్ను విధానానికి సవరణ, ప్రభుత్వ మార్కెట్ల బలోపేతం, ఉత్పత్తుల కొనుగోలుకు కఠిన నిబంధనలు, ఇకపై ప్రభుత్వం పంట సేకరణ,  కాంట్రాక్ట్ వ్యవసాయం ఒప్పందాల వివాదాల్లో సబ్ కలెక్టర్ అధికారాల సవరణ, ఒప్పంద వ్యవసాయంలో రైతులు సివిల్ కోర్టుకు వెళ్లే వీలు , ఒప్పంద వ్యవసాయంలో రైతుల భూములకు రక్షణ,
పంట వ్యర్థాల దహనంపై పంజాబ్, హర్యానా రైతులకు అనుగుణంగా నిర్ణయం వంటి అంశాల్లో పూర్తి హామీ ఇచ్చింది కేంద్రం. అయితే, వాటన్నింటినీ రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. కొత్త చట్టాల రద్దే తమ ప్రధాని డిమాండని స్పష్టం చేశారు.




సోనూ సూద్ ఖాతాలో మరో అరుదైన ఘనత

సుప్రీం కోర్ట్ లో నిమ్మగడ్డ ఫిర్యాదు...?

నూతన పార్లమెంట్ భవనంలో ఎన్ని అత్యాధునిక ఫెసిలిటీస్ ఉన్నాయో తెలుసా ?

పాస్టర్ గా మారిన టాలీవుడ్ హీరో.. ఎందుకు హర్ట్ అయ్యాడు

అలియాతో రొమాన్స్ కోసం చెర్రీ హడావిడి

సత్యదేవ్...తిమ్మరుసు అవతారం క్లిక్ అవుతుందా...?

'ఎఫ్3' స్టోరీ రివీల్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>