PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/combo501e4340-731e-4470-8fab-4661677cfbf5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/combo501e4340-731e-4470-8fab-4661677cfbf5-415x250-IndiaHerald.jpgచంద్రబాబుది రాజకీయాల్లో ఫార్టీ యియర్స్ అనుభవం. ఆయన ఇంతటి సుదీర్ఘ కాలం పాలిటిక్స్ లో కొనసాగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ప్రతీదీ తనకు అనుకూలంగా మలచుకోవడం ఒక ప్రధాన కారణం. అలా ఈ మధ్య ప్రధాని మోడీ చేసిన ఒక ప్రకటనను బాబు తనకు వరంగా మార్చుకుంటున్నారు. తమ్ముళ్ళను కూడా తబ్బిబ్బు చేస్తున్నారు. combo;cbn;modi;lokesh;amala akkineni;jagan;gujarat - gandhinagar;west bengal - kolkata;bhuma akhila priya;bihar;prime minister;minister;lokesh kanagaraj;nijamబాబుకు వరంగా మోడీ ప్రకటన.. తమ్ముళ్ళకు పిలుపు ?బాబుకు వరంగా మోడీ ప్రకటన.. తమ్ముళ్ళకు పిలుపు ?combo;cbn;modi;lokesh;amala akkineni;jagan;gujarat - gandhinagar;west bengal - kolkata;bhuma akhila priya;bihar;prime minister;minister;lokesh kanagaraj;nijamThu, 10 Dec 2020 21:00:00 GMTప్రధాని మోడీ చేసిన ఒక ప్రకటనను బాబు తనకు వరంగా మార్చుకుంటున్నారు. తమ్ముళ్ళను కూడా తబ్బిబ్బు చేస్తున్నారు.

తాజాగా గుజరాత్ లో జరిగిన  అఖిల భారత స్పీకర్ల ముగింపు సమావేశంలో ప్రధాని మోడీ జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. జమిలి ఎన్నికలు జరిగితే మంచిది అని కూడా అన్నారు. దేశంలో ఎక్కడో ఒక చోట తరచూ ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి అభివృద్ధి ఆగిపోతోందని  అని కూడా ఆయన అన్నారు. అసలు మోడీ ఈ రోజు ఇలా అన్నా కూడా చాలాకాలంగా జమిలి ఎన్నికల విషయం దేశంలో నలుగుతున్న అంశమే.

అయితే దానికి  ఒక మార్గం మాత్రం ఇప్పటికీలేదు. జమిలి ఎన్నికలు అంటేనే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకోవాలి. ఇక గతసారి జమిలి ఎన్నికలు అంటే చంద్రబాబు ఆయన కుమారుడు అప్పటి మంత్రి లోకేష్ బాబు నో చెప్పారు. తాము పూర్తి కాలం అధికారంలో ఉంటామని కూడా లోకేష్ చెప్పుకొచ్చారు.

మరి జగన్ కి కూడా అలాగే ఉంటుంది కదా. అంతే కాదు దేశంలో కొత్తగా గెలిచిన వారికీ ఆ ఆశ ఉంటుంది కదా. మరి ఇవేమీ ఆలోచించినట్లుగా బాబు లేరు. మోడీ చెప్పారు కాబట్టి ఎన్నికలు జరిగినా జరగకపోయినా తమ్ముళ్ళను జంప్ చేయకుండా ఉంచుకునేందుకు జమిలిని వాడేసుకుంటున్నారు.

నిజంగా జమిలి ఎన్నికలు జరిగే సీన్ ఉంటే బీహార్ ఎన్నికలను వాయిదా వేసేవారు. అలాగే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కూడా 2021లో జరిపేందుకు చురుకుగా  సన్నాహలు చేస్తున్నారు.  జమిలి ఎన్నికలు  అయితే వాటిని కూడా ఇప్పటికే  ఆపేవారు. మరి ఇవన్నీ బాబుకు తెలియని విషయాలు అని ఎవరూ అనుకోరు. కానీ బాబు ఇదిగో అదిగో ఎన్నికలు అని చెప్పకపోతే తమ్ముళ్ళు పక్క చూపులు చూస్తారు. ఎన్నికలు అంటే టికెట్ల కోసమైనా అలా కొంతకాలం ఉంటారు. దీంతోనే బాబు జమిలి జపంచేస్తున్నారు అంటున్నారు.




ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !

హైకోర్ట్ రాయలసీమలోనే... చెప్పేసిన సోము




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>