PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/modi42e99533-a3bd-4da5-8fdb-32dfb20073ba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/modi42e99533-a3bd-4da5-8fdb-32dfb20073ba-415x250-IndiaHerald.jpg‘వన్‌ నేషన్‌ - వన్‌ రేషన్‌’ కార్డు వ్యవస్థకు సంబంధించిన సంస్కరణలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విజయవంతంగా పూర్తి చేసినట్లు కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రోత్సాహకరంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు అదనపు రుణాలను మంజూరు చేస్తోంది.jagan;amala akkineni;goa;kerala;andhra pradesh;gujarat - gandhinagar;haryana - chandigarh;karnataka - bengaluru;telangana;december;success;central government'వన్ నేషన్ - వన్ రేషన్' సక్సెస్ కారణంగా తెలుగు రాష్ట్రాలకు అదనపు రుణాలు!'వన్ నేషన్ - వన్ రేషన్' సక్సెస్ కారణంగా తెలుగు రాష్ట్రాలకు అదనపు రుణాలు!jagan;amala akkineni;goa;kerala;andhra pradesh;gujarat - gandhinagar;haryana - chandigarh;karnataka - bengaluru;telangana;december;success;central governmentThu, 10 Dec 2020 20:00:00 GMTఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు అదనపు రుణాలు ఇస్తున్నట్లు ప్రకటించింది. ‘వన్‌ నేషన్‌ - వన్‌ రేషన్‌’ కార్డు వ్యవస్థకు సంబంధించిన సంస్కరణలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విజయవంతంగా పూర్తి చేసినట్లు కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రోత్సాహకరంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు అదనపు రుణాలను మంజూరు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 9 రాష్ట్రాలు దేశంలో ప్రస్తుతం వన్ నేషన్ - వన్ రేషన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. వన్‌ నేషన్‌ - వన్‌ రేషన్‌ పథకం సంస్కరణల కోసం నిర్దేశించిన షరతులను తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, కర్ణాటక, కేరళ, త్రిపుర, గోవా రాష్ట్రాలు నెరవేర్చాయని కేంద్రం వెల్లడించింది.



ఈ నేపథ్యంలో ఈ 9 రాష్ట్రాలకు రూ.23,523 కోట్ల అదనపు రుణాలు ఇవ్వడానికి అనుమతించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం (డిసెంబర్ 10) ఓ ప్రకటనలో తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,525 కోట్లు, తెలంగాణకు రూ.2,508 కోట్లు అదనంగా రుణాలు అందనున్నాయి. వన్ నేషన్ వన్ రేషన్ పథకం కింద.. లబ్ధిదారులు దేశంలో ఎక్కడైనా తమ రేషన్ సరకులు తీసుకోవచ్చు. దేశంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లే వారికి ప్రయోజనం చేకూర్చే దిశగా కేంద్రం ఈ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు ఉన్నవారు తెలంగాణలో, తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారు ఏపీలోనూ రేషన్ సరకులు తీసుకోవచ్చు. ఇదేవిధంగా ఇతర రాష్ట్రాల్లోనూ సరకులు తీసుకోవచ్చు. మొత్తానికి ఈ రేషన్ పథకం విజయవంతంగా అమలు కావటం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలకు మరిన్ని అదనపు నిధులు చేకూరుతుండటం పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


టీఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !

హైకోర్ట్ రాయలసీమలోనే... చెప్పేసిన సోము




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>