PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/telangana-congress-politics545f1351-82c3-4034-9f2e-1b6dfac2d494-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/telangana-congress-politics545f1351-82c3-4034-9f2e-1b6dfac2d494-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీకి కొత్త చీఫ్ వ‌స్తార‌ని ఆ పార్టీ వ‌ర్గాలు బ‌లంగా న‌మ్మాయి. అయితే సోనియాగాంధీ జ‌న్మ‌దిన వేడుకలు వ‌చ్చి వెళ్లాయి... అయినా పీసీసీ చీఫ్ ఎవ‌ర‌న్న‌ది మాత్రం తేల‌లేదు. ప‌రిపాటిగా ఆ ఇద్ద‌రిలో ఎవ‌రు అన్న ప్ర‌శ్నే మ‌ళ్లీ పార్టీ శ్రేణుల ఎదుట నిలిచింది. అప్ప‌టిదాకా ఉత్త‌ముడే కొన‌సాగుతాడు అన్న‌ట్లుగా కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి మౌన విధాన స‌మాధానం రావ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా ఉండ‌గా కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక‌కు క‌స‌ర‌త్తcongress;telangana;revanth reddy;congress;mp;mallu bhatti vikramarka;jagga reddy;partyపీసీసీ చీఫ్ ఎంపిక‌లో ఏందీ సాగ‌దీత‌...! ఠాగూర్‌తో కూడా కావ‌ట్లేగా..?పీసీసీ చీఫ్ ఎంపిక‌లో ఏందీ సాగ‌దీత‌...! ఠాగూర్‌తో కూడా కావ‌ట్లేగా..?congress;telangana;revanth reddy;congress;mp;mallu bhatti vikramarka;jagga reddy;partyThu, 10 Dec 2020 09:00:00 GMTకాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీకి కొత్త చీఫ్ వ‌స్తార‌ని ఆ పార్టీ వ‌ర్గాలు బ‌లంగా న‌మ్మాయి. అయితే సోనియాగాంధీ జ‌న్మ‌దిన వేడుకలు వ‌చ్చి వెళ్లాయి... అయినా పీసీసీ చీఫ్ ఎవ‌ర‌న్న‌ది మాత్రం తేల‌లేదు. ప‌రిపాటిగా ఆ ఇద్ద‌రిలో ఎవ‌రు అన్న ప్ర‌శ్నే మ‌ళ్లీ పార్టీ శ్రేణుల ఎదుట నిలిచింది. అప్ప‌టిదాకా ఉత్త‌ముడే కొన‌సాగుతాడు అన్న‌ట్లుగా కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి మౌన విధాన స‌మాధానం రావ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా ఉండ‌గా కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక‌కు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లుగా తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. అంద‌రికీ ఆమోదయోగ్యుడైన వ్య‌క్తినే చీఫ్‌గా ఎంపిక చేస్తామ‌ని మ‌ళ్లీ పాత‌పాటే పాడుతున్నారు. నిర్ణ‌యాల్లో జాప్యం చేస్తూ పార్టీకి న‌ష్టం చేకూరుస్తార‌ని శ్రేణుల నుంచి ఫిర్యాదులు వ‌చ్చినా ప‌ట్టించుకోవ‌డం లేదు.


ఇదిలా ఉండ‌గా మంగ‌ళ‌వారం కాంగ్రెస్‌ కోర్ కమిటీతో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం టాగూర్‌ భేటీ అయ్యారు. ముందుగా.. కోర్‌ కమిటీ నేతలతో సమిష్టిగా భేటీ అయిన ఠాగూర్‌.. తర్వాత విడివిడిగా సమావేశం అయ్యారు. ఒక్కొక్కరికి పది పది నిమిషాలు కేటాయించారు. వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా పీసీసీ చీఫ్‌ పదవిని ఆశిస్తున్నారా..? ఎవరికైనా మద్దతునిస్తున్నారా? అనేది ఆయన అడిగినట్లు సమాచారం. అప్పటికే నలుగురు ఐదుగురి పేర్లు జోరుగా వినిపించాయి. వీరిలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరే ఎక్కువగా వినిపించిన‌ట్లు స‌మాచారం.  అయితే కొంత‌మంది మాత్రం భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌, మధుయాష్కి, శ్రీధర్‌ బాబు కూడా పీసీసీ కోసం సూచించిన‌ట్లుగా తెలుస్తోంది.


రేవంత్‌రెడ్డి ఖాయ‌మ‌న్న‌ట్లుగా వార్త‌లు గుప్పుమ‌న్న కొద్దిరోజుల‌కే ఇప్పుడు మ‌ళ్లీ కోమ‌టిరెడ్డి అయితేనే రాష్ట్రంలో పార్టీ పుంజుకోగ‌ల‌దు అంటూ కొంత‌మంది నేత‌లు అధిష్ఠానం ప్ర‌తినిధికి సూచించ‌డం వెనుక ఆంత‌ర్యం ఏంట‌న్న ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తున్నాయి. చూడాలి మ‌రి ఈ విడ‌త అయినా ప్ర‌క్రియ‌ను త్వ‌ర‌గా పూర్తి చేసి ఎవ‌రో ఒక‌రిని చీఫ్‌గా ఎంపిక చేసి పార్టీని గాడిలో పెట్టే ప్ర‌య‌త్నం చేస్తారా..?  లేదంటే మ‌ళ్లీ వాయిదా వేస్తారా..? అన్న‌ది కొద్దిరోజులు ఆగితేగాని తెలియ‌రాదు.










అరియానా ఇక నిన్ను ఆపేవాడే లేడు..!

హెరాల్డ్ సెటైర్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ..ఏపీ "కిమ్" అంటా.! వామ్మో..!!

సోయలేని సోహెల్ ఏందయ్యా నీ కోపం.. బీప్ సౌండ్ వచ్చేలా మాటలా..!

అంగరంగ వైభవంగా జరిగిన మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

మరో రెండు రోజుల పాటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకు

ఏలూరు వింత వ్యాధికి కారణాలు బయటపెట్టిన శాస్త్రవేత్తలు....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>