PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/the-disease-is-like-an-elusive-mystery9c280903-d4db-463d-ab5b-e9a844bddfbb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/the-disease-is-like-an-elusive-mystery9c280903-d4db-463d-ab5b-e9a844bddfbb-415x250-IndiaHerald.jpgఏలూరులో అంతు చిక్కని వ్యాధి ఓ మిస్టరీలా మారింది. బాధితుల సంఖ్య తగ్గినా.. దీని వెనుక కారణాలపై క్లారిటీ రావడం లేదు. నీళ్లు, ఆహార పదార్థాల వల్ల జనాలు అస్వస్థతకు గురవుతున్నారి ప్రాథమిక అంచనాకు వచ్చారు. డబ్ల్యూహెచ్ ఓ ప్రతినిధులు, ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు, ఐఏ బృందం, ఐపీఎం, ఐఆర్‌సీఐ బృందాలు కారణాలు ఏంటో తేల్చే పనిలో ఉన్నారు. the disease is like an elusive mystery;nani;delhi;vijayawada;minister;aqua;mangalagiri;central government;eluru;vఅంతుచిక్కని మిస్టరీలా ఆ వ్యాధి..!అంతుచిక్కని మిస్టరీలా ఆ వ్యాధి..!the disease is like an elusive mystery;nani;delhi;vijayawada;minister;aqua;mangalagiri;central government;eluru;vThu, 10 Dec 2020 23:00:00 GMTఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు, ఐఏ బృందం, ఐపీఎం, ఐఆర్‌సీఐ బృందాలు కారణాలు ఏంటో తేల్చే పనిలో ఉన్నారు.  

ఏలూరులో అంతుచిక్కని వ్యాధికి ఆక్వా సాగే కారణమని అనుమానిస్తున్నారు నిపుణులు. ఆక్వా సాగులో పెద్ద ఎత్తున యాంటీ బయోటిక్స్ వినియోగిస్తున్నారని దీన్నీ వల్ల దుష్ప్రభావాలు వస్తాయంటున్నారు. వరదల సమయంలో ఆక్వాలో మోతాదుకు మించి యాంటీ బయోటిక్స్ వాడిన నీరు ....తాగునీటిలో కలిసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి‌. ఆర్గానో క్లోరో నీటిలో కలుషితమై ఉంటుందని  చెబుతున్నారు.

ప్రస్తుతం కేంద్ర బృందాలు, వైద్య నిపుణుల బృందాలు ఏలూరులోనే ఉన్నాయి.  వ్యాధికి గల కారణాలను అన్వేషిస్తు న్నాయి. వివిధ విభాగాల నుంచి పంపించిన కేంద్ర వైద్య బృందం, మంగళగిరి ఎయిమ్స్‌ బృందం, ఏఐఏ బృందం, ఐపీఎం, ఐఆర్‌సీఐ బృందాలు  బాధితులకు అందే వైద్యంతోపాటుగా కోలుకున్న వారి స్థితిగతులను తెలుసుకుంటున్నాయి. ఆహార పదార్థాలు, పాలు, కూరగాయలు, నివసించే ప్రాంతాల్లో ఉండే మట్టినీ పరీక్షిస్తున్నాయి. నీరు వచ్చే ప్రాంతాలు, పంట ప్రాంతాలను పరిశీలిస్తున్నాయి.

డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని విజయవాడ ఆస్పత్రిలో చికిత్సపొందుతన్న బాధితుల్ని పరామర్శించారు.. తాజా పరిస్థితులపై ఆరా తీశారు. బాధితుల సంఖ్య తగ్గుతోందని.. ఆస్పత్రుల్లో ఉన్నవారు కూడా త్వరగానే కోలుకుంటున్నారని తెలిపారు. విజయవాడ ఆస్పత్రిలో ఇద్దరు వింత వ్యాధితో చనిపోలేదని ఆళ్ల నాని అన్నారు. రేపు సాయంత్రానికి దీనిపై ఓ క్లారిటీ వస్తుందంటున్నారు.

మరోవైపు వ్యాధికి గల కారణాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో  కారణాలు నిర్ధారణ అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివిధ జాతీయ సంస్థలతో డీసీహెచ్‌ఎస్‌ సమావేశం నిర్వహించారు.

నాలుగు బృందాలు క్షేత్రస్థాయిలో తిరిగి వ్యాధికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. భార లోహాలైన సీసం, నికెల్‌, క్రిమిసంహారక అవశేషాలు, ఆర్గనో క్లోరిన్స్‌ వంటివి వింత వ్యాధికి కారణమై ఉండొచ్చని కేంద్ర బృందాలు భావిస్తున్నాయి. ఆహారం, తాగునీరు, పాలు, కూరగాయలు, ఆకుకూరలు వంటి ద్వారా బాధితుల శరీరంలోకి చేరి ఉండొచ్చని ఢిల్లీ ఎయిమ్స్‌, ఐఐసీటీ, ఎన్‌ఐఎన్‌ బృందాల పరిశోధనలో తేలినట్లు అధికారులు వివరించారు. సోషల్ మీడియాలో వదంతులు నమ్మొద్దని అధికారులు ప్రజల్ని కోరుతున్నారు.


అఖిల్ నాలుగో సినిమా కూడా కష్టమేనా..?

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>