KidsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/kids44a85cff-97d3-40b1-88ce-8296ce31eeab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/kids44a85cff-97d3-40b1-88ce-8296ce31eeab-415x250-IndiaHerald.jpgమీరు ఎప్పుడు ఏదోఒక పుస్తకం చదువుతూ ఉంటారా. అయితే మీరు ఈ విషయం తెలుసుకోండి. పఠనం మెదడులోని వివిధ భాగాల మధ్య కొత్త కనెక్షన్లను పెంచుతుంది. 2013లో జరిగిన అధ్యయనం ప్రకారం నవలలు మెదడును చురుగ్గా చేస్తాయి. భాషపై పట్టు పెరుగుతుంది. రీడింగ్ మెదడులోని న్యూరాన్లను సృష్టిస్తుందని న్యూయార్క్‌కు చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ సబ్రినా రోమనోఫ్ చెప్పారు. kids;manuబుడుగు: చదివే అలవాటుతో ఎంతో ఆరోగ్యం... దీర్ఘాయుష్షు ఫలాలు ఇవే..!బుడుగు: చదివే అలవాటుతో ఎంతో ఆరోగ్యం... దీర్ఘాయుష్షు ఫలాలు ఇవే..!kids;manuThu, 10 Dec 2020 17:00:00 GMT
ఇక రీడింగ్ వల్ల ఆలోచనలు పెరిగి, పరిశీలనాత్మక దృష్టితో చూడటం వల్ల మెదడులో కొత్త న్యూరాన్లు పుడతాయని రోమనోఫ్ చెప్పారు. జ్ఞానం అంటే గుర్తుంచుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, జడ్జిమెంట్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండటం. చదవడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. 14 ఏళ్ల పాటు సాగిన అధ్యయనం వివరాల్ని 2020లో ప్రచురించారు. ఎక్కువసార్లు చదివిన వారికి 6 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వ్యవధిలో జ్ఞాన క్షీణత తక్కువగా ఉందని కనుగొన్నారు.

అంతేకాదు 14 ఏళ్ల తర్వాత తక్కువ సార్లు చదివిన వారితో పోలిస్తే ఎక్కువసార్లు చదివిన వృద్ధులకు జ్ఞాన క్షీణత తగ్గుతోంది. అంతేకాకుండా చదవడం వల్ల మతిమరుపు రావడానికి కూడా తక్కువ అవకాశం ఉందని తేలింది. చైనాలో 2018లో చేసిన అధ్యయనం ప్రకారం ఐదేళ్ల కాలంలో 65 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారిని ట్రాక్ చేశారు. పఠనం లాంటి మేథో కార్యకలపాల్లో పాల్గొనడం వల్ల కొన్నేళ్ల తరువాత వచ్చే చిత్త వైకల్యం తక్కువగా ఉంటోందని కనుగొన్నారు.
 

అయితే మనుషులు చదువుతున్నప్పుడు మెదడులో దృశ్యాలు ఏర్పడుతుంటాయి. అవి మెమరీ రీకాల్, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. జ్ఞాపకశక్తి పెరగాలంటే రెగ్యలర్ రీడింగ్ అవసరమని రోమనోఫ్ చెప్పారు. 2013 అధ్యయనం ప్రకారం చదవడం, రాయడం వంటివి చేయని వారితో పోల్చితే... అవి చేసే వారి జ్ఞాపకశక్తి పెరుగుతోందని గుర్తించారు.

ఇక మెదడు ఆరోగ్యాన్ని పఠనం మెరుగుపరుస్తుంది. ఇది దీర్ఘాయుష్షును పెంచుతుంది. 12 ఏళ్ల పాటు సాగిన అధ్యయనం 2017లో ప్రచురితమైంది. దీని ప్రకారం పుస్తకాలు చదవని వారితో పోలిస్తే చదివేవారిలో మరణ ప్రమాదం 20 శాతం తగ్గుతుందని తేలింది. పఠనం వల్ల ఆరోగ్యకరమైన జీవనశైలి ఏర్పడి... త్వరగా చనిపోయే అవకాశాలను తగ్గిస్తోంది.


ఫేస్ బుక్ అమెరికా ముప్పెట దాడి

ఆ ఏపీ మంత్రిలో దూకుడు త‌గ్గిందే... తెన‌వెన‌క క‌థ ఇదే...!

అతనితో లిప్ లాక్ కు రెడీ.. తమన్నా బోల్డ్ స్టేట్మెంట్..!

వ్యాక్సిన్ అమెరికన్లకే ఫస్టా..?

రాఘవేంద్రరావుకు నో చెప్పిన హీరోయిన్..!

తెలంగాణ కాంగ్రెస్ గ్రూపులుగా విడిపోయింది! జగ్గారెడ్డి హాట్ కామెంట్స్

పీసీసీ ఇవ్వండి.. ప్రగతి భవన్ పునాదులు కదిలిస్తా: కోమటిరెడ్డి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>