PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/eluruf18f72ac-c4db-4629-80ee-e38abf1b4a4c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/eluruf18f72ac-c4db-4629-80ee-e38abf1b4a4c-415x250-IndiaHerald.jpgపశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి ప్రబలుతూనే ఉంది. కేసుల సంఖ్య కొంత తగ్గినా ప్రజల్లో భయాందోళన మాత్రం పోవడం లేదు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య పూర్తిగా మాత్రం తగ్గడం లేదు. తాజాగా విం వ్యాధి సోకిన బాధితుల్లో మరో ఇద్దరు మృతి చెందారు. అపాస్మరక స్థితికి వెళ్లిన 30 మందిని విజయవాడ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్సపొందుతూ ఇద్దరు మృతి చెందారు. మృతులను సుబ్బరావమ్మ (56), అప్పారావు (50)గా గుర్తించారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.eluru;health;apple;godavari river;jagan;vijayawada;andhra pradesh;district;west godavari;air;letter;tdp;central government;european union;custard apple;eluru;vఏలూరులో మరో ఇద్దరు మృతి! ఇంకా తేలని వింత వ్యాధి మూాలాలుఏలూరులో మరో ఇద్దరు మృతి! ఇంకా తేలని వింత వ్యాధి మూాలాలుeluru;health;apple;godavari river;jagan;vijayawada;andhra pradesh;district;west godavari;air;letter;tdp;central government;european union;custard apple;eluru;vThu, 10 Dec 2020 10:50:00 GMTపశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి ప్రబలుతూనే ఉంది. కేసుల సంఖ్య కొంత తగ్గినా ప్రజల్లో భయాందోళన మాత్రం పోవడం లేదు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య పూర్తిగా మాత్రం తగ్గడం లేదు. తాజాగా విం వ్యాధి సోకిన బాధితుల్లో మరో ఇద్దరు మృతి చెందారు. అపాస్మరక స్థితికి వెళ్లిన  30 మందిని విజయవాడ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్సపొందుతూ ఇద్దరు మృతి చెందారు. మృతులను సుబ్బరావమ్మ (56), అప్పారావు (50)గా గుర్తించారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. వింత వ్యాధితో ఏలూరులో ఇప్పటివరకు ముగ్గురు చనిపోయారు, అయితే 15 రోజుల క్రితం ఫిట్స్ రావడంతో కొందరు చనిపోయినట్లు తెలుస్తోంది. వారు కూడా ఈ వింత వ్యాధి కారణాంగనే మరణించి ఉండవచ్చనే అనుమానాలు వస్తున్నాయి.


ఇప్పటివరకు దాదాపు 600 మందికి ఈ వింత వ్యాధి సోకగా, 450 మందికి పైగా చికిత్స తరువాత డిశ్చార్జ్ అయ్యారు. పరిస్థితి విషమంగా ఉందని భావించిన కొందరిని మాత్రం మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. వింత వ్యాధి మూలాలు కనుగొనేందుకు కేంద్ర, రాష్ట్ర బృందాలు పరిశోధనలు చేస్తున్నాయి. గాలి, నీరు, పాలు.. ఇలా అన్నింటిని శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపారు. ఎయిమ్స్ , ఎన్ఐఎన్, సీసీఎంబీ సంస్థలు కూడా ప్రత్యేక బృందాలను ఏలూరుకు పంపించాయి. ఎయిమ్స్ నుంచి వచ్చిన ప్రాధమిక పరిశోధనలో బాధితుల శరీరంలో మోతాదుకు మించి సీసం, నికెల్ వంటి లోహాల అవశేషాలు ఉన్నట్లు తేలింది.


 అయితే పూర్తిస్థాయి నివేదిక వచ్చాకా మాత్రమే వింత వ్యాధికి అసలు కారణం ఏంటన్నది తేలే అవకాశం ఉంది.కలుషిత నీరు తాగడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని మరికొందరు వైద్య నిపుణులు అనుమానిస్తున్నారు. ఇది గాలి ద్వారా వ్యాపించినది కాదని, ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు.

            మరోవైపు ఏలూరులో వింత వ్యాధి ప్రబలడంపై రాజకీయ దుమారం రేగుతోంది. జగన్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందన టీడీపీ ఆరోపిస్తోంది. ప్రజలకు కనీసం సురక్షితమైన తాగునీరు కూడా అందించలేని దుస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు.ఏలూరులో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏలూరులో ప్రతి ఒక్కరికి ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ కార్డులు అందజేయాలని సూచించారు చంద్రబాబు. దీర్ఘకాలిక ప్రాతిపదికపై ప్రతి రోగిని నిశితంగా పర్యవేక్షించాలని  ప్రభుత్వాన్ని కోరారు. వైద్య నిపుణులతో బాధితులకు అత్యుత్తమ వైద్యం అందించాలన్నారు.


శశిరేఖ గెటప్ లో నిహారిక

అరియానా ఇక నిన్ను ఆపేవాడే లేడు..!

హెరాల్డ్ సెటైర్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ..ఏపీ "కిమ్" అంటా.! వామ్మో..!!

సోయలేని సోహెల్ ఏందయ్యా నీ కోపం.. బీప్ సౌండ్ వచ్చేలా మాటలా..!

అంగరంగ వైభవంగా జరిగిన మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

మరో రెండు రోజుల పాటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>