Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/salaarf7c69c88-d884-4592-a8a4-dff677c3fc0c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/salaarf7c69c88-d884-4592-a8a4-dff677c3fc0c-415x250-IndiaHerald.jpgబాహుబలి కోసం దాదాపు 4 ఏళ్ళు కష్టపడిన ప్రభాస్ ఇప్పుడు ఏకధాటిగా సినిమాలు చేయబోతున్నాడు. దీనికోసం వరుస ప్రాజెక్టులు ఒప్పుకుంటున్నాడు. ఇప్పటికే ప్రభాస్ తన రాధేశ్యామ్ సినిమాను దాదాపు పూర్తి చేశాడు. ఇది కాకుండా మరో 2 సినిమాలు చేతిలో ఉన్నాయి. అందులో...salaar;prabhas;prasanth;prashanth neel;vijay;india;cinema;smart phone;huzur nagar;bahubali;director;joseph vijay;posters;kgf;prasanth neel;prashant kishor'సలార్' లో యాక్టింగ్ ఛాన్స్.. నిజమేనా..?'సలార్' లో యాక్టింగ్ ఛాన్స్.. నిజమేనా..?salaar;prabhas;prasanth;prashanth neel;vijay;india;cinema;smart phone;huzur nagar;bahubali;director;joseph vijay;posters;kgf;prasanth neel;prashant kishorThu, 10 Dec 2020 14:04:27 GMT

బాహుబలి కోసం దాదాపు 4 ఏళ్ళు కష్టపడిన ప్రభాస్ ఇప్పుడు ఏకధాటిగా సినిమాలు చేయబోతున్నాడు. దీనికోసం వరుస ప్రాజెక్టులు ఒప్పుకుంటున్నాడు. ఇప్పటికే ప్రభాస్ తన రాధేశ్యామ్ సినిమాను దాదాపు పూర్తి చేశాడు. ఇది కాకుండా మరో 2 సినిమాలు చేతిలో ఉన్నాయి. అందులో  ఓం రవుత్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న  ఆదిపురుష్ కాగా.. మరొకటి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనుంది.


ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయనున్న సినిమాకు సలార్ అనే పేరును ఫిక్స్ చేశారు. ఈ సినిమా భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ఉంటుందని అంచనా. అంతేకాకుండా ఈ సినిమా ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందనుందని, పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుందని ఇప్పటికే ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.


సినిమా హంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభం కానుంది. ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇందులో ప్రభాస్ ఎలా కనిపిస్తాడు..? ప్రభాస్ డ్రస్సింగ్ ఎలా ఉంటుంది..? పాటలెలా ఉంటాయంటూ అప్పుడే చర్చించుకుంటున్నారు.


 ఈ సినిమా కోసం కొత్త నటీనటులకు అవకాశం ఇవ్వాలని ప్రశాంత్ నీల్ అనుకున్నాడట. దీంతో కొత్త నటీనటుల వేటలో ఉన్న చిత్ర బృందం భారత్ వ్యాప్తంగా ప్రత్యేకంగా ఆడిషన్స్ కూడా నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికోసం ఫోన్ నంబర్లు కూడా ప్రశాంత్ నీల్ విడుదల చేసినట్లు పుకారు. ఈ విషయాన్ని కొన్ని వార్త సంస్థలు పబ్లిసిటీ కూడా చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై ప్రశాంత్ నీల్ నుంచి కానీ, సలార్ చిత్ర బృందం నుంచి కానీ ఎలాంటి సమాచారం బయటకు రానట్లు తెలుస్తోంది. అయితే 15వ తేదీ వరకు ఆగితే కానీ అసలు విషయం బయటపడదు.


ఇదిలా ఉంటే ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలే పెట్టుకుంటున్నారు. ఈ మధ్యనే రిలీస్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ అంచనాలను మరింత పెంచుతోంది. ప్రభాస్ లోని ఓ కొత్త కోణం ఈ సినిమాలో చూడొచ్చని ఆశపడుతున్నారు. మరి ఈ సినిమా వారి అంచనాలను అందుకుంటుందో లేదో వేచి చూడాలి.


సోనూ సూద్ ఖాతాలో మరో అరుదైన ఘనత

సుప్రీం కోర్ట్ లో నిమ్మగడ్డ ఫిర్యాదు...?

నూతన పార్లమెంట్ భవనంలో ఎన్ని అత్యాధునిక ఫెసిలిటీస్ ఉన్నాయో తెలుసా ?

పాస్టర్ గా మారిన టాలీవుడ్ హీరో.. ఎందుకు హర్ట్ అయ్యాడు

అలియాతో రొమాన్స్ కోసం చెర్రీ హడావిడి

సత్యదేవ్...తిమ్మరుసు అవతారం క్లిక్ అవుతుందా...?

'ఎఫ్3' స్టోరీ రివీల్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>