MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/salaarf7c69c88-d884-4592-a8a4-dff677c3fc0c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/salaarf7c69c88-d884-4592-a8a4-dff677c3fc0c-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అతిత్వరలో కేజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా సలార్. ప్రస్తుతం కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమాని తెరకెక్కిస్తున్న హోంబలే ఫిలిమ్స్ సంస్థవారు దీనిని కూడా ఎంతో భారీ లెవల్లో అత్యధిక ఖర్చుతో నిర్మించనున్నట్లు టాక్. గతంలో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి రెండు సినిమాలు కూడా ఒకదానిని మించి మరొకటి ఎంతో గొప్ప విజయాలు అందుకుని ప్రభాస్ కి హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. ఇక అక్కడి నుండిprabhas;prabhas;krishnam raju;naga;prasanth;prashanth neel;rajamouli;india;apherald;bollywood;tollywood;cinema;huzur nagar;bahubali;naga aswin;january;kollywood;traffic police;kgf;prasanth neel;prashant kishorప్రభాస్ సలార్ : ఈ ట్విస్ట్ అసలు ఊహించనే లేదే ....??ప్రభాస్ సలార్ : ఈ ట్విస్ట్ అసలు ఊహించనే లేదే ....??prabhas;prabhas;krishnam raju;naga;prasanth;prashanth neel;rajamouli;india;apherald;bollywood;tollywood;cinema;huzur nagar;bahubali;naga aswin;january;kollywood;traffic police;kgf;prasanth neel;prashant kishorThu, 10 Dec 2020 23:12:44 GMTరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అతిత్వరలో కేజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా సలార్. ప్రస్తుతం కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమాని తెరకెక్కిస్తున్న హోంబలే ఫిలిమ్స్ సంస్థవారు దీనిని కూడా ఎంతో భారీ లెవల్లో అత్యధిక ఖర్చుతో నిర్మించనున్నట్లు టాక్. గతంలో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి రెండు సినిమాలు కూడా ఒకదానిని మించి మరొకటి ఎంతో గొప్ప విజయాలు అందుకుని ప్రభాస్ కి హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. ఇక అక్కడి నుండి ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ కొనసాగుతున్న ప్రభాస్, సలార్ తో పాటు ప్రస్తుతం మరొక రెండు మూడు సినిమాలు కూడా లైన్లో పెట్టిన విషయం తెలిసిందే.

అందులో ముందుగా రాధేశ్యామ్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా అతి త్వరలో నాగ అశ్విన్ సినిమా అలానే ఆదిపురుష్ సినిమాలు రెండు కూడా సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. ఇకపోతే సాలార్ కథని మాఫియా బ్యాక్ డ్రాప్ లో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలానే ప్రభాస్ ఫ్యాన్స్ ని ఆకట్టుకునే విధంగా తెరకెక్కించనున్నాడట ప్రశాంత్. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా కొన్ని ఫిల్మ్ నగర్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఇందులో ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తారని అందులో ఒకటి సలార్ అనే వయొలెంట్ మాఫియా డాన్ కాగా మరొకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర అని అంటున్నారు.

ఇక రెండు పాత్రలు కూడా సినిమాలో అదిరిపోతాయని అలానే రెండు క్యారెక్టర్స్ లో ప్రభాస్ అదరగొట్టే పర్ఫామెన్స్ చేయడం ఖాయమని అంటున్నారు. టాలీవుడ్ కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు అగ్ర నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నట్లు సమాచారం. జనవరి రెండో వారంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే దీనికి సంబంధించిన మూవీ యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాలి....!!


లేడీ ఎస్సై పై మనసు పారేసుకున్న మరో ఎస్సై.. చివరికి అదిరిపోయే ట్విస్ట్..

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>