Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/balakrishna649cd2d1-88c2-47e4-b568-00860c23f33a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/balakrishna649cd2d1-88c2-47e4-b568-00860c23f33a-415x250-IndiaHerald.jpgయాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. ఈ హీరో సినిమా వస్తుందంటే చాలు యాక్షన్ ప్రియులకు ఇక పండగే అవుతుంది. గ్యాప్ లేకుండా వరుస సినిమాల్లో ఎలాంటి అలుపు సొలుపు రాకుండా నటించే కథాయకుల్లో ముందుండేది కూడా ఈ హీరోనే చెప్పుకోవచ్చు. అయితే ఈ హీరో కథల ఎంపికలో ఏ మాత్రం ఆలోచనలు చేయకుండా ముందడుగు వేస్తుంటారని ఈ హీరో అభిమానులు కొంత నిరాశ వ్యక్తం చేస్తుంటారు. ఆ కథ మంచి హిట్ ను ఇస్తుందా లేదా.. అని ఒకింత కూడా ఆలోచించకుండా.. కథ మంచిగుందని ఎవరు చెప్పినా గుడ్డినా నమ్మి అపజయాన్ని చవిచbalakrishna;balakrishna;c kalyan;jai;kalyan;cinema;tamil;k s ravikumar;jai simha;director;hero;ruler;gottipati ravi kumar;nandamuri taraka rama raoఅయ్యొ బాలయ్య మళ్లీ వాళ్లనే నమ్ముకుంటున్నావా?అయ్యొ బాలయ్య మళ్లీ వాళ్లనే నమ్ముకుంటున్నావా?balakrishna;balakrishna;c kalyan;jai;kalyan;cinema;tamil;k s ravikumar;jai simha;director;hero;ruler;gottipati ravi kumar;nandamuri taraka rama raoThu, 10 Dec 2020 10:36:00 GMTహీరో నందమూరి బాలకృష్ణ. ఈ హీరో సినిమా వస్తుందంటే చాలు యాక్షన్ ప్రియులకు ఇక పండగే అవుతుంది. గ్యాప్ లేకుండా వరుస సినిమాల్లో ఎలాంటి అలుపు సొలుపు రాకుండా నటించే కథాయకుల్లో ముందుండేది కూడా ఈ హీరోనే చెప్పుకోవచ్చు. అయితే ఈ హీరో కథల ఎంపికలో  ఏ మాత్రం ఆలోచనలు చేయకుండా ముందడుగు వేస్తుంటారని ఈ హీరో అభిమానులు కొంత నిరాశ వ్యక్తం చేస్తుంటారు. ఆ కథ మంచి హిట్ ను ఇస్తుందా లేదా.. అని ఒకింత కూడా ఆలోచించకుండా.. కథ మంచిగుందని ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మి అపజయాన్ని చవిచూస్తుంటాడని కొందరు భావిస్తుంటారు. నిజమే ఈ హీరో కొన్ని సార్లు కథల విషయంలో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటూ అట్టర్ ప్లాప్ ను చాలా సార్లు చవిచూసాడనే చెప్పుకోవచ్చు.

అలాంటి విషయమే ఈ హీరోకు మరో సారి ఎదురు కాబోతోందని అర్థమవుతోంది. ఇంతకు ముందు రెండు సార్లు అపజయాలు చవిచూసిన వారి చేతిలోనే మళ్లీ సినిమాకు ఓకే చెప్పాడట బాలయ్య. ఇంతకి బాలయ్యకు అత్యంత దారుణంగా అట్టర్ ప్లాప్ చేసిన డైరెక్టర్, సినిమా ఏంటో తెలుసా.. అదేనండి ఒకటి జయసింహ అయితే రెండో సినిమా రూలర్ లు. ఈ సినిమాల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్యకు మాంచి విజయాలను అందిస్తాయనుకున్న ఈ సినిమాలు బాక్సఫీస్ వద్ద భారీ పరాజయాన్ని అందుకున్నాయి. ఈ రెండు సినిమాలకు సి కళ్యాణ్ తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నిర్మించాడు. మళ్లీ బాలయ్య వీరి కాంబోలోనే మూడవ సినిమాకు ఓకే చెప్పాడని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇటీవలె సి కళ్యాణ్ బాలకృష్ణ హీరోగా మరో సినిమాను కూడా తెరకెక్కించబోతున్నామని తెలిపారు. ఆ సినిమాకు సంబంధించిన విషయాలను త్వరలోనే ప్రకటిస్తామంటూ చెప్పాడు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే వీరిరువురి కాంబినేషన్ లో తెరకెక్కించబోతున్న మూడవ సినిమాకు కూడా కేఎస్ రవికుమారే దర్శకత్వం వహిస్తున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి. అయినా రెండు సార్లు వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు కూడా ఘోరంగా పరాజయాన్ని చవిచూసినా కాని మళ్లీ వీరికే అవకాశం బాలకృష్ణ ఎందుకు ఇస్తున్నట్టని వార్తలు గుప్పుమంటున్నాయి. చూడాలి మరి ఈ సారైనా వీరి కాంబినేషన్ బాలయ్యకు కలిసి వస్తుందో.. లేక.. మునపటిలా పరాజయాన్ని మూటకట్టుకోవాల్సి వస్తుందో..


శశిరేఖ గెటప్ లో నిహారిక

అరియానా ఇక నిన్ను ఆపేవాడే లేడు..!

హెరాల్డ్ సెటైర్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ..ఏపీ "కిమ్" అంటా.! వామ్మో..!!

సోయలేని సోహెల్ ఏందయ్యా నీ కోపం.. బీప్ సౌండ్ వచ్చేలా మాటలా..!

అంగరంగ వైభవంగా జరిగిన మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

మరో రెండు రోజుల పాటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>