Breakingyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/gavaskar-angry-on-england-analist-sharing-secret-slip-with-code-to-change-fielding-in-ground146689ae-ec25-4fb0-97df-01e8b4a6902c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/gavaskar-angry-on-england-analist-sharing-secret-slip-with-code-to-change-fielding-in-ground146689ae-ec25-4fb0-97df-01e8b4a6902c-415x250-IndiaHerald.jpg క్రికెట్‌లో రహస్య సందేశాలపై ఎప్పటినుంచో దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలోనే గతవారం ఇంగ్లాండ్-సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి సందేశమే చేతులు మారింది. దీనిపై భారత మాజీ క్రికెటర్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో గత వారం రెండో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భాగంగానే ఇంగ్లండ్ అనలిస్ట్ నాథన్ లీమన్...cricket;view;sunil;delhi;sunil gavaskar;cricket;pakistan;south africa;england;pistachio;cheque;icc t20క్రికెట్‌లో కోడ్ భాష.. గవాస్కర్ ఫైర్క్రికెట్‌లో కోడ్ భాష.. గవాస్కర్ ఫైర్cricket;view;sunil;delhi;sunil gavaskar;cricket;pakistan;south africa;england;pistachio;cheque;icc t20Thu, 10 Dec 2020 22:49:07 GMTన్యూఢిల్లీ: క్రికెట్‌లో రహస్య సందేశాలపై ఎప్పటినుంచో దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలోనే గతవారం ఇంగ్లాండ్-సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి సందేశమే చేతులు మారింది. దీనిపై భారత మాజీ క్రికెటర్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో గత వారం రెండో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భాగంగానే ఇంగ్లండ్ అనలిస్ట్ నాథన్ లీమన్ తమ జట్టు సభ్యులకు ఓ కోడ్ సందేశం పంపారు.  కొన్ని అక్షరాల కలయికతో ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్లను మార్చాలన్న సంకేతాన్ని కెప్టెన్ మోర్గాన్‌కు లీమన్ పంపాడు. తాము మ్యాచ్ అధికారుల నుంచి అనుమతి తీసుకున్నట్టు ఇంగ్లండ్ స్పష్టం చేసింది. దీనిపై టీమిండియా సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ, ఆటగాళ్లతో మాట్లాడేందుకు బోల్డన్ని విధానాలు అందుబాటులో ఉన్నాయని, కానీ ఇలా కోడ్ పరిభాషల పద్ధతి మంచిది కాదని గవాస్కర్ సూచించాడు.

‘‘కెప్టెన్‌గా నేనైతే ఇలాంటి దానికి అంగీకరించను. నేను కనుక కెప్టెన్ అయితే, ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్ మార్చేందుకో, బౌలింగ్ చేంజింగ్ గురించో చెప్పేందుకు 12వ ఆటగాడిని వాటర్ బాటిలో, మరోటో ఇచ్చి మైదానంలోకి పంపిస్తా. అలా మనం చెప్పాల్సింది చెప్పొచ్చు. లేదంటే బౌండరీ వద్ద ఉన్న ఫీల్డర్ ద్వారా కోచ్ ఆ సందేశాన్ని పంపొచ్చు’’ అని గవాస్కర్ పేర్కొన్నాడు. ఇలాంటి వ్యూహాలకు చెక్ పెట్టేందుకు ఐసీసీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గవాస్కర్ అన్నాడు. ఇలాంటి విధానాన్ని ఐసీసీ అనుమతించినదీ, లేనిదీ తనకు తెలియదని, ఇప్పటి వరకు ఈ విషయం తమకు తెలియదని తెలిపాడు. తన క్రికెట్ కెరీర్‌లో తొలిసారి ఇలా చూస్తున్నానని, డీఆర్ఎస్ తీసుకునే విషయంలోనూ ఇలాంటి కోడ్ భాష ఉందా? అని గవాస్కర్ ప్రశ్నించాడు.

 
ఇదిలా ఉంటే ఈ విధంగా కోడ్ పరిభాషలో ఆటగాళ్లకు సూచనలు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మొదట్లో పాకిస్థాన్ సూపర్ లీగ్‌లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. విశేషమేమంటే అక్కడ కూడా ఈ కోడ్ పరిభాషను ఉపయోగించింది లీమనే. పీఎస్ఎల్‌లో ముల్తాన్ సుల్తాన్స్ జట్టుతో ఉన్న లీమన్ ఓ కోడ్ పరిభాషనే ఉపయోగించి మైదానంలోని ఆటగాళ్లకు మెసేజ్ చేరవేశాడు.


లేడీ ఎస్సై పై మనసు పారేసుకున్న మరో ఎస్సై.. చివరికి అదిరిపోయే ట్విస్ట్..

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>