PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/janareddy811cd9c4-90d3-4812-8a0d-64ae28642e15-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/janareddy811cd9c4-90d3-4812-8a0d-64ae28642e15-415x250-IndiaHerald.jpgతాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఏ పార్టీ నేతలూ తనను సంప్రదించలేదని జానా రెడ్డి స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో మీరు పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు జానారెడ్డి బదులిస్తూ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందన్నారు. సాగర్‌లో ఎవరు పోటీ చేయాలన్నది పార్టీయే నిర్ణయిస్తుందని చెప్పారు. janareddy;nagarjuna akkineni;raghu;kerala;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;tpcc;mla;janareddy;reddy;partyపార్టీ మారడం లేదన్న జానారెడ్డి! అయినా ఆగని ప్రచారంపార్టీ మారడం లేదన్న జానారెడ్డి! అయినా ఆగని ప్రచారంjanareddy;nagarjuna akkineni;raghu;kerala;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;tpcc;mla;janareddy;reddy;partyThu, 10 Dec 2020 11:00:00 GMTపార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఏ పార్టీ నేతలూ తనను సంప్రదించలేదని జానా రెడ్డి స్పష్టం చేశారు.  నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో మీరు పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు జానారెడ్డి బదులిస్తూ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందన్నారు. సాగర్‌లో ఎవరు పోటీ చేయాలన్నది పార్టీయే నిర్ణయిస్తుందని చెప్పారు.



       కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలోనూ స్పందించారు జానా రెడ్డి. పార్టీలోని అందరి అభిప్రాయాలు సేకరించి, అందరినీ ఒప్పించిన తర్వాత హైకమాండ్ ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. అధ్యక్షుడిగా ఎవరి పేరు సూచించారన్న ప్రశ్నకు, అది బహిర్గతం చేయాల్సిన విషయం కాదని సున్నితంగా తిరస్కరించారు జానా రెడ్డి. గాంధీభవన్ లో జరిగిన టీపీసీసీ కోర్ కమిటీ సమావేశానికి హాజరైన జానా రెడ్డి.. ఈ మేరకు వివరణ ఇచ్చారు. తన స్థాయి వ్యక్తిపై ఇలాంటి ప్రచారం చేయడం తగదని కూడా ఆయన సూచించారు.



            టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో త్వరలో నాగార్జున సాగర్ లో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో సాగర్ కు చెందిన సీనియర్ నేత జానారెడ్డి.. బీజేపీ లేదా టీఆర్‌ఎస్ లోకి వెళ్లనునున్నట్లుగా కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. దీంతో  కాంగ్రెస్‌ పార్టీ అప్రమత్తమైంది. కేరళ నుంచి తిరిగి వచ్చిన జానారెడ్డిని బుధవారం సాయంత్రం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలిశారు. పార్టీ మారుతున్నట్లుగా  జరుగుతున్న ప్రచారంపైవివరణ ఇవ్వాల్సిందిగా జానారెడ్డిని ఉత్తమ్‌ కోరినట్లుగా చెబుతున్నారు. జానారెడ్డి పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలను ఆయన కొడుకు రఘువీర్‌రెడ్డి ఇప్పటికే ఖండించారు. అయినా జానారెడ్డి పార్టీ మార్పుపై ప్రచారం జరుగుతూనే ఉంది.





"తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం"...ఆ పంటకు దశాబ్దాల చరిత్ర

అరియానా ఇక నిన్ను ఆపేవాడే లేడు..!

హెరాల్డ్ సెటైర్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ..ఏపీ "కిమ్" అంటా.! వామ్మో..!!

సోయలేని సోహెల్ ఏందయ్యా నీ కోపం.. బీప్ సౌండ్ వచ్చేలా మాటలా..!

అంగరంగ వైభవంగా జరిగిన మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

మరో రెండు రోజుల పాటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>