PoliticsSreekanth Eeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/bandi-sanjay-condemns-attack-on-jp-naddabe70b3e4-9533-4df5-a671-a5f279de4a55-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/bandi-sanjay-condemns-attack-on-jp-naddabe70b3e4-9533-4df5-a671-a5f279de4a55-415x250-IndiaHerald.jpgజేపీ నడ్డాపై దాడిని తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని బండి సంజయ్ అన్నారు. నడ్డా కాన్వాయిపై రాళ్లు రువ్వడం చూస్తుంటే పశ్చిమ బెంగాల్‌ లో శాంతి భద్రతలు ఎంత అధ్వాన్నంగా ఉన్నయో రుజువు అవుతోందని ట్వీట్ చేసారు. బెంగాల్‌లో బీజేపీపై దాడులు చేయడం, బీజేపీ కార్యకర్తలను చిత్ర హింసలకు గురి చేయడం, హత్య చేయడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారిందని ఫైర్ అయ్యారు.bandi sanjay;auto;amit shah;kumaar;benarjee;rakshita;audi;bharatiya janata party;telangana;west bengal - kolkata;narendra modi;indiaherald group;mp;district;huzur nagar;murder;car;minister;letter;murder.;central government;karimnagar;mamta mohandas;party;narendraటీఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్టీఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్bandi sanjay;auto;amit shah;kumaar;benarjee;rakshita;audi;bharatiya janata party;telangana;west bengal - kolkata;narendra modi;indiaherald group;mp;district;huzur nagar;murder;car;minister;letter;murder.;central government;karimnagar;mamta mohandas;party;narendraThu, 10 Dec 2020 20:37:00 GMTపార్టీ అయిన తృణముల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ)పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అసహనం వ్యక్తం చేసారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ నడ్డాపై దాడిని బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సారధి అయిన నడ్డా కాన్వాయిపై రాళ్లు రువ్వడం చూస్తుంటే పశ్చిమ బెంగాల్‌లో శాంతి భద్రతలు ఎంత అధ్వాన్నంగా ఉన్నయో రుజువు అవుతోందని ట్వీట్ చేసారు. బెంగాల్‌లో తృణముల్‌ కాంగ్రెస్‌, జాతీయ కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు కలిసి బీజేపీపై ఇలాంటి దాడులు నిర్వహించడం, అనేక మంది బీజేపీ కార్యకర్తలను చిత్ర హింసలకు గురి చేయడం, హత్య చేయడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారిందని ఫైర్ అయ్యారు.

అప్రజాస్వామిక చర్యలకు బీజేపీ కార్యకర్తలు భయపడరని, నడ్డా సారథ్యంలో, నరేంద్ర మోదీ, అమిత్‌ షా  నాయకత్వంలో బెంగాల్‌లో  బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.  బెంగాల్‌లో ప్రజాస్వామ్యాన్ని, శాంతి భద్రతలను బీజేపీ కాపాడుతుందని విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు.  కాగా జేపీ నడ్డా  పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో భాగంగా దక్షిణ 24 పరగణాల జిల్లా నుంచి కోల్‌కతాలోని డైమండ్‌ హార్బర్‌కు వెళ్తుండగా అయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ పై కొందరు ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. జేపీ నడ్డా ప్రయాణిస్తున్నకారు బుల్లెట్ ప్రూఫ్ కావడంతో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే మరో కారులో ఉన్న బీజేపీ నేత కైలాష్ విజయవర్గీయకు గాయాలయ్యాయి.  

కాగా దుర్గా మాతా ఆశీస్సులతోనే తాను సురక్షితంగా బయట పడ్డానని  జేపీ నడ్డా అన్నారు.  ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. జే.పీ నడ్డా కాన్వాయ్ పై దాడిని తీవంగా ఖండించిన ఆయన...  ఘటనపై విచారణకు ఆదేశించారు.  ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 12 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇక ఘటనపై స్పందించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ....బీజేపీ డ్రామా ఆడిందని అన్నారు. వారిపై వారే  దాడి చేసుకుని తమ మీద నింద వేస్తున్నారని పేర్కొన్నారు.


తెలుగు వారిని దారుణంగా అవమానించిన హీరోయిన్ సాయి పల్లవి

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sreekanth E]]>