PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jp-nadda507816c2-3a36-4ae9-9438-58d4d5944a17-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jp-nadda507816c2-3a36-4ae9-9438-58d4d5944a17-415x250-IndiaHerald.jpgపశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు చేదు అనుభవం ఎదురైంది. నడ్డా ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై కొందరు ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతుదారులే ఈ దాడికి పాల్పడినట్లు బీజేపీ బెంగాల్‌ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ ఆరోపించారు. ఈ ఘటనలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయ్‌ వర్గియా కారు ధ్వంసమైనట్లు తెలిపారుnadda;amit shah;dileep;dilip;bharatiya janata party;west bengal - kolkata;dilip ghosh;congress;district;police;december;twitter;minister;letter;partyబీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై దాడి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పైనే - బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు!బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై దాడి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పైనే - బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు!nadda;amit shah;dileep;dilip;bharatiya janata party;west bengal - kolkata;dilip ghosh;congress;district;police;december;twitter;minister;letter;partyThu, 10 Dec 2020 17:00:00 GMTబెంగాల్ పర్యటనలో ఉన్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు చేదు అనుభవం ఎదురైంది. నడ్డా ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై కొందరు ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో కాన్వాయ్‌లోని కొన్ని వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. అయితే దుర్గా మాత ఆశీస్సులతోనే తాను ఇవాళ బయట పడ్డానని ఘటన అనంతరం జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో ఉన్న ఆయన దక్షిణ 24 పరగణాల జిల్లా నుంచి కోల్‌కతాలోని డైమండ్‌ హార్బర్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. జేపీ నడ్డా వస్తున్నారనే సమాచారం తెలుసుకొని బుధవారం (డిసెంబర్ 10) ఉదయం రహదారిని దిగ్బంధించిన కొంత మంది ఆందోళనకారులు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. అనంతరం వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


ఇక తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతుదారులే ఈ దాడికి పాల్పడినట్లు బీజేపీ బెంగాల్‌ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ ఆరోపించారు. ఈ ఘటనలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయ్‌ వర్గియా కారు ధ్వంసమైనట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను బెంగాల్ బీజేపీ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. జేపీ నడ్డా పర్యటనలో తీవ్రమైన భద్రతా లోపాలున్నాయని దిలీప్ ఘోష్ ఆరోపించారు. హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. నడ్డా కార్యక్రమాల్లో ఎక్కడా పోలీసులు లేరని తెలిపారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదని.. పైగా వారు అధ్యక్షుడు నడ్డా వాహనానికి అత్యంత సమీపంలోకి వచ్చేంత వరకు వేచి చూశారని ఆరోపించారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని అమిత్ షాను కోరారు. ఇప్పుడు ఈ ఆరోపణలపై బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

" style="height: 470px;">




ఒకే సమయంలో పుట్టి, ఒకేలా ఉండే టాలీవుడ్ కవలలు ఎవరో తెలుసా..?

ప్రభాస్ సలార్ లో ఛాన్స్ పట్టేసిన బికిని భామ..!

2024 నాటికి ఏపీ లో బి‌జే‌పి జెండా పాతేనా..!!

ఫేస్ బుక్ అమెరికా ముప్పెట దాడి

ఆ ఏపీ మంత్రిలో దూకుడు త‌గ్గిందే... తెన‌వెన‌క క‌థ ఇదే...!

అతనితో లిప్ లాక్ కు రెడీ.. తమన్నా బోల్డ్ స్టేట్మెంట్..!

వ్యాక్సిన్ అమెరికన్లకే ఫస్టా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>